సాక్షి, తిరుమల: దసరా పండుగ, వరుస సెలవులు కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం ఏడుకొండల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తిరుమలతో కిటకిటలాడుతోంది. గంటగంటకు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. శ్రీవారి దర్శనం కోసం 60 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. వెలుపల నాలుగుకిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్‌లో నిలబడి ఉండటం గమనార్హం. దీంతో వెంకన్న దర్శనానికి భక్తులకు 30 గంటల సమయం పడుతోంది.
స్వామివారి దర్శన కోసం మడవీధుల్లోనూ భక్తులు వేచి ఉన్నారు. అత్యంత భారీస్థాయిలో భక్తుల రద్దీ ఉండటంతో టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. భారీ క్యూలైన్లలో నిలుచున్న భక్తులు సోమవారం ఉదయం 11 గంటలకు దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేసింది.