
మహేశ్ బాబు(పాత చిత్రం)
తిరుమల: సినీనటుడు మహేశ్ బాబు శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇటీవల మహేశ్ బాబు నటించిన ‘ భరత్ అనే నేను’ చిత్రం విజయవంతం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు మహేశ్ బాబుతో పాటు, దర్శకుడు కొరటాల శివ, మహేశ్‌బాబు బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా వచ్చారు. సినీ హీరో రావడంతో ఆయనను చూడటానికి భక్తులు, అభిమానులు ఆసక్తి కనబరిచారు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..నా జీవితంలో ఇది చాలా ఆనందకరమైన రోజు అని చెప్పారు. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ..భరత్ అనే నేను చిత్రం భారీ విజయం సాధించిందని, అందుకనే శ్రీవారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment