
ఘనంగా రథసప్తమి వేడుకలు
తిరుమల : తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య భగవానుడి జన్మ తిథి అయిన రథ సప్తమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
తిరుమలలో సప్తగిరీశుడైన వెంకటేశ్వరస్వామి సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఏడు వాహహనాలపై తిరువీధులలో ఊరేగుతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు కొండపైకి భక్తులు భారీగా చేరుకున్నారు. మొదటగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగారు. అనంతరం చిన్న శేషవాహనంపై ఊరేగుతారు. రథ సప్తమి ఒక్కరోజే ఇన్ని వాహనాలపై శ్రీవారు ఊరేగడం విశేషం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే తిరుపతిలోని దక్షిణ మాడా వీధిలో కొలువై ఉన్న కోదండ రామమూర్తిని కూడా సూర్యప్రభ వాహనంపై ఊరించారు.
భద్రాచలం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.