rathasaptami celebrations
-
సొమ్ము స్పాన్సర్లది సంబరం సర్కారుది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రథసప్తమి వేడుకలు ముగిశాయి. రాష్ట్ర పండగగా ప్రకటించిన ప్రభుత్వం పైసా విడుదల చేయకపోయినా స్పాన్సర్ల సహకారంతో విజయవంతమయ్యాయి. ఒక వైపు దేవస్థానానికి విరాళాలిచ్చిన దాతల డోనర్ పాసుల విషయంలోనూ, సంప్రదాయంగా దర్శనం కల్పించడంలోనూ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించినప్పటికీ జిల్లాలోని మిగతా వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సాయంతో పండగను సక్సెస్ చేసింది. నగరంలో జరిగిన అభివృద్ధి పనుల నుంచి విద్యుత్ కాంతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరత్రా అలరించే ప్రోగ్రామ్స్ వరకు దాతలే దిక్కయ్యారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో స్పాన్సర్స్ కావాలని వివిధ వర్గాలతో నిర్వహించిన సమావేశం సత్ఫలితాలను ఇచ్చింది. అధికారుల మాట కాదంటే టార్గెట్ అయిపోతామేమోననో.. ఇబ్బందులొస్తాయనో, దేవుడు కార్యక్రమానికి అడిగినప్పుడు సాయం చేయడం మంచిదనో తెలియదు గానీ జిల్లా యంంత్రాంగం అడిగిన వెంటనే ప్రతీ ఒక్కరూ పోటీ పడి సాయం చేశారు. అయితే, ఆ సాయం ఎంతనేది అధికారులే లెక్క చెప్పాలి. అంతా అధికారులే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వేడుకల నిర్వహణ బాధ్యతను అధికారులే తీసుకున్నారు. కార్పొరేషన్, సుడా నిధులతో కొంతమేర అభివృద్ధి పనులు చేసినా అవి పూర్తయ్యేందుకు కూడా స్పాన్సర్లసాయం తీసుకున్నట్టు సమాచారం. ఇక, వేడుకలు విజయవంతంగా జరగడానికి సాంస్కృతిక, క్రీడా పోటీలు, విద్యుత్ కాంతులు, హెలికాప్టర్ రైడింగే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. హెలికాప్టర్ రైడింగ్ ఒక్కొక్కరికీ రూ.1800 టికెట్ పెట్టడంతో గతంలో ఎన్నడూ ఎక్కని వారంతా ఒక్కసారైనా పయనించాలని ఆరాట పడ్డారు. డబ్బులను లెక్క చేయకుండా రైడింగ్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల నిర్వహణ, బహుమతులు అందజేయడంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం ఉంది. అట్టహాసంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు జ్యూయలరీ, వస్త్ర, ఇతరత్రా బడా వ్యాపారులు ఆర్థికంగా సాయపడ్డారు. ఇక, లేజర్ షో, క్రాకర్స్, హాస్యనటుల ప్రోగ్రాం, సింగర్ మంగ్లీ ఈవెంట్ కూడా దాదాపు దాతల సహకారంతోనే జరిగినట్టు సమాచారం. సమన్వయంతో నిర్వహణ.. రాష్ట్ర, జిల్లా అధికారులు కూడా సమన్వయంతో వ్యవహరించారు. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం, విశాఖ కనకమహలక్ష్మీ దేవస్థానం, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, విజయనగరం పైడితల్లి అమ్మవారు, శంబర పోలమాంబ ఉత్సవాలతో పాటు అరకు ఉత్సవాలకు వినియోగించిన అనేక శకటాలను ఇక్కడికి తెప్పించి శోభాయాత్రను విజయవంతం చేశారు. ఇందులో దేవదాయ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి ముందుండి నడిపించగా.. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.భద్రాజీ తదితరులు తమవంతు శాయశక్తులా పనిచేశారు. ఒకవైపు ఆలయానికి విరాళాలు ఇచ్చిన దాతలపై చిన్న చూపు చూసినప్పటికీ, ప్రభుత్వం పైసా విడుదల చేయకుండా చేతులు దులుపుకున్నా.. ఉత్సవాల నిర్వహణ భారాన్ని దాదాపు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలే మోశారు. ప్రభుత్వంతో పనిలేకుండా దాతల సహకారంతో ఎంతటి కార్యక్రమాన్నైనా విజయవంతం చేయవచ్చనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. -
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్తాబవుతోన్న టీటీడీ
-
రథసప్తమి వేడుకలకు ముస్తాబైన అరసవల్లి సూర్య దేవాలయం
-
తిరుమలలో కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు (ఫోటోలు)
-
అరసవల్లిలో వైభవంగా రథసప్తమి
అరసవల్లి/తిరుమల: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సుమారు 60 వేల మంది వరకు భక్తులు ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆదిత్యుడిని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అరసవల్లి ఆలయానికి మాస్టర్ ప్లాన్ అమలుకు త్వరలోనే చర్యలు చేపడతానని మంత్రి వెలంపల్లి చెప్పారు. ఆలయ వివరాలను ఆర్జేసీ సురేష్‌బాబు, ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సప్తవాహనాలపై శ్రీనివాసుడి కటాక్షం.. తిరుమల శ్రీవారు సప్తవాహనాలను అధిరోహించి మంగళవారం భక్తులను కటాక్షించారు. తిరుమల ఆలయంలో రథసప్తమి మహోత్సవం వైభవంగా సాగింది. కోవిడ్ నేపథ్యంలో దీన్ని ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్రమాలను ఎస్వీబీసీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఉషోదయాన సూర్యప్రభ వాహనంతో సప్తవాహన సేవోత్సవం ప్రారంభమైంది. అనంతరం శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీమలయప్పస్వామి చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరారు. మధ్యాహ్నం శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు అభ్యంగనం ఆచరించారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు పరిసమాప్తమయ్యాయి. సింహగిరిపై విశేషంగా రథసప్తమి సింహాచలం: విశాఖ జిల్లా సింహాచలంలో వేంచేసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రథసప్తమి పూజలను మంగళవారం విశేషంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ప్రాంగణంలో హంసమూలన ఉన్న పురాతన రాతిరథంపై వేంజేపచేసి ఉదయం పంచామృతాభిషేకం, అరుణపారాయణ పఠనం నిర్వహించారు. అనంతరం రాతిరథంపైనే స్వామికి నిత్య కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై వేంజేపచేసి తిరువీధిని నిర్వహించారు. -
తిరుమలలో వైభవంగా రధసప్తమి వేడుకలు
-
తిరుమలలో వైభవంగా రథ సప్తమి
తిరుమల: తిరుమలలో రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యప్రభ, చిన్న శేష, గరుడ వాహనాలపై మలయప్ప స్వామి తిరువీదుల్లో ఊరేగారు. ఇపుడు హనుమంత వాహనంపై ఊరేగింపు కొనసాగుతోంది. తరువాత శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం కల్పవృక్ష వాహనం, రాత్రి 8 గంటలకు చంద్ర ప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రథ సప్తమి రోజున ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా భక్తులు లెక్కచేయకుండా తిరువీధుల్లో స్వామి వారి ఊరేగింపును తిలకిస్తున్నారు. ఇవాళ, రేపు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
ఘనంగా రథసప్తమి వేడుకలు
తిరుమల : తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య భగవానుడి జన్మ తిథి అయిన రథ సప్తమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సప్తగిరీశుడైన వెంకటేశ్వరస్వామి సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఏడు వాహహనాలపై తిరువీధులలో ఊరేగుతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు కొండపైకి భక్తులు భారీగా చేరుకున్నారు. మొదటగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగారు. అనంతరం చిన్న శేషవాహనంపై ఊరేగుతారు. రథ సప్తమి ఒక్కరోజే ఇన్ని వాహనాలపై శ్రీవారు ఊరేగడం విశేషం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే తిరుపతిలోని దక్షిణ మాడా వీధిలో కొలువై ఉన్న కోదండ రామమూర్తిని కూడా సూర్యప్రభ వాహనంపై ఊరించారు. భద్రాచలం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. -
ఘనంగా రధసప్తమి వేడుకలు
-
తిరుచానూరు రథసప్తమి వేడుకల్లో అపశృతి
రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై పద్మావతీ అమ్మవారు ఊరేగుతుండగా... ఉత్తర మాడవీధిలో వాహనంపై ఉన్న అమ్మవారి విగ్రహం ఒక్కసారిగా కుడివైపు ఒరిగింది. గమనించిన అర్చకులు వెంటనే అమ్మవారి విగ్రహాన్ని పట్టుకున్నారు. తిరిగి సరిగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో విగ్రహాన్ని అలా పట్టుకునే వాహన సేవను నిర్వహించారు. విగ్రహాన్ని సరిగా కూర్చోబెట్టకపోవడం వల్లే అలా జరిగినట్టు డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి వివరించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా పద్మావతీ అమ్మవారు సోమవారం మొత్తం ఏడు వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. -
తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
తిరుమల: తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించారు. శ్రీ వారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటడంతో, ప్రత్యేక వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. శ్రీ వారి దర్శనానికి 24 పడుతుంది. భక్తులు వాహన సేవలు వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.