శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో అనుమానం | YSRCP MLA Roja Slams TDP Government over Srivari Jewellery | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో అనుమానం

Published Wed, Aug 1 2018 9:49 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో రోజా మాట్లాడారు. నిత్యం స్వామివారికి సేవ చేసే రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోతే నిరసన తెలియజేశామని.. దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement