శ్రీవారిని దర్శించుకున‍్న తమిళనాడు సీఎం
Published Tue, May 9 2017 10:51 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి అష్టదళ పాద పద్మారాధన సేవలో వారు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేదాశీర్వచనం చేశారు.
అనంతరం తితిదే జేఈవో భాస్కర్ పళనిస్వామి దంపతులను సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. ఆర్మీ వైస్ చీఫ్, లెఫ్ట్‌నెంట్ జనరల్ శరత్‌చంద్ర దంపతులు కూడా మంగళవారం ఉదయం శ్రీ వేంకటేశ‍్వరస్వామిని దర్శించుకున్నారు.
Advertisement
Advertisement