
తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈనెల 14 నుంచి భక్తులను అనుమతించే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఈనెల 13న శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 6వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 6 నుంచి 11గంటల వరకు ఆలయ శుద్ధి చేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
ఎంపీ శ్రీధర్, సినీ నిర్మాత విశ్వప్రసాద్, సీఐడీ ఎస్పీ సరిత, అపోలో డైరెక్టర్ సునీత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment