ఆభరణాల ఆనందనిలయుడు
బంగారు, వజ్ర. వైఢూర్య, మరకత, మాణిక్యాదుల అభరణాలు అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలిచిన భక్తుల కోర్కెలు తీరుస్తూ తిరుమల ఆలయంలో కొలువైనాడు. నాడు ఆకాశ రాజు నుంచి నేటి వరకు స్వామివారికి సమర్పించిన అమూల్యమైన ఆభరణాలు కానుకల రూపంలో స్వామి ఖజానాలో చేరిపోతున్నాయి. సాక్షాత్తూ స్వామికి అలంకరించే ఆభరణాలతోపాటు బాంకుల్లో డిపాజిట్ల రూపంలోని సుమారు 11 టన్నుల పైబడి బంగారం నిల్వల మదింపు అమూల్యం. ఆభరణాల జాబితాను టీటీడీ సిద్ధం చేసి భద్రపరిచింది. అందులో గర్భాలయ మూలమూర్తి అలంకరణలో అతిముఖ్యంగా 120, ఉత్సవవరులైన శ్రీదేవి, భూదేవి మలయప్పస్వామివారికి 383 ఆభరణాలు వాడుతున్నారు. ఆ జాబితాలోని ఆభరణ విశేషాలేమిటో తెలుసుకుందాం!!
మూలవర్ల అలంకరణకు విశేష ఆభరణాలు
≈ బంగారు పీతాంబరం, బంగారు కవచం - 19.410 కేజీలు
≈ నవరత్నాలు పొదిగిన పెద్ద కిరీటం - 13.374 కేజీలు
≈ వజ్రాలు పొదిగిన వామ్‌చెట్ బంగారు కటి హస్తం - 8.129 కేజీలు
≈ బంగారు సాలిగ్రామాల హారం - 8.150 కేజీలు
≈ వజ్రాలు పొదిగిన బంగారు కత్తి - 7.420 కేజీలు
≈ 108 బంగారు శంఖాలు - 6.100 కేజీలు
≈ వైకుంఠ హస్తం చైనుతో సహా - 5.908 కేజీలు
≈ మకర కంఠి మొదటిభాగం - 5.616 కేజీలు
≈ బంగారు గొడుగు - 5.530 కేజీలు
≈ జెమ్‌చెట్ శంఖు - 4.013 కేజీలు
≈ జెమ్‌చెట్ చక్రం - 4.077 కేజీలు
≈ జెమ్‌చెట్ రెండు కర్ణపత్రాలు - 3.100 కేజీలు
≈ రెండు బంగారు నాగాభరణాలు - 3.320 కేజీలు
≈ పచ్చలు, తెలుపు, ఎరుపు రాళ్లు పొదిగిన బంగారు కిరీటం - 3.145 కేజీలు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఆభరణాలు
≈ మలయప్పస్వామివారి బంగారు కవచాలు - 3.990కేజీలు
≈ శ్రీదేవి అమ్మవారి తొమ్మిది బంగారు కవచములు - 2.400 కేజీలు
≈ భూదేవి అమ్మవారి తొమ్మిది బంగారు కవచములు - 2.430 కేజీలు
≈ పద్మపీఠం - 2.869కేజీలు
≈ కొలువు శ్రీనివాసమూర్తి బంగారు తోరణం - 2.090 కేజీలు
≈ బంగారు పద్మాలు - 2.313 కేజీలు
≈ నూతన యజ్ఞోపవీతం - 2.043 కేజీలు
≈ 108 లక్ష్మీ డాలర్ల హారం - 2.560 కేజీలు
≈ బంగారు చేతి గంట - 2.794 కేజీలు
≈ కెంపులు పొదిగిన వైకుంఠ హస్త నాగాభరణం - 2.100 కేజీలు
≈ కెంపులు పొదిగిన బంగారు కఠికాహస్త - నాగాభరణం - 2.070 కేజీలు
≈ రత్నాలు పొదిగిన వజ్ర కవచ కిరీటం - 2.750 కేజీలు
≈ వజ్రాల కిరీటం - 2.935 కేజీలు
≈ బంగారు బిందె - 2.370 కేజీలు
≈ బంగారు గిన్నెలు - 2.080 కేజీలు
≈ బంగారు గోముఖ పళ్లెం - 2.085 కేజీలు
≈ శ్రీరాములవారి బంగారు ధనుస్సు, ఇతర ఆభరణాలు - 1.202 కేజీలు
≈ బంగారు తట్ట - 1.029 కేజీలు
≈ రత్నాలు పొదిగిన బంగారు నడుము వజ్రకవచం - 1.831 కేజీలు
≈ రత్నాలు పొదిగిన బంగారు కంఠ వజ్రకవచం - 1.661 కేజీలు
≈ రత్నాలు పొదిగిన బంగారు పాదపద్మ వజ్రకవచం - 1.495 కేజీలు
≈ రత్నాలు పొదిగిన బంగారు వెనుక వజ్రకవచం - 1.837 కేజీలు
≈ సీమ కమలాలు పొదిగిన హారం - 1.020 కేజీలు
≈ మకర కంటి రెండవ భాగం - 1.552 కేజీలు
≈ బంగారుపళ్లెం - 1.195 కేజీలు
≈ వజ్రాలు పొదిగిన బంగారు కాసుల దండ - 1.955 కేజీలు
≈ సీమకమలాలు, పచ్చలు, కెంపులు పొదిగిన బంగారు కిరీటం - 1.893కేజీలు
≈ మకర కంటి మూడవ భాగం - 1.434 కేజీలు
≈ బంగారు చెంబు - 1.020 కేజీలు ఠి బంగారు బెత్తం - 1.380 కేజీలు
≈ రత్నాలు చెక్కిన బంగారు కిరీటం - 1.185 కేజీలు
≈ రాళ్లకొండై బంగారు కిరీటం - 1.365 కేజీలు
≈ బంగారు కి రీటం - 1.190 కేజీలు జి బంగారు బిందె-1.995కేజీలు
≈ ఉత్సవవర్ల బంగారు కిరీటం-1.170 కేజీలు
తిరుమల ఆలయంలో ఆభరణాల లెక్కలివి
♦ శ్రీవారి మూలమూర్తి ఆభరణాలు - 120
♦ ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి, మలయప్ప ఆభరణాలు-383
♦ రాఘోజీ వారి తిరువాభరణాల రిజిస్టర్- 07
♦ వెంకటగిరి రాజావారి తిరువాభరణాల రిజిస్టర్ - 11
♦ వెండి ఆభరణాలు - 223
♦ రాగి, ఇత్తడి, బంగారు తాపడం చేసిన వస్తువులు - 17
♦ ముల్లెలు - 09
♦ శ్రీవారి భాష్యకార్ల ఆలయానికి సంబంధించిన ఆభరణాలు, వస్తువులు -13
♦ రికార్డు రూములోపల గల ఆభరణాలు - 08
♦ తిరుమల శ్రీ భూ వరాహస్వామి ఆలయానికి చెందిన ఆభరణాలు - 28
తిరుపతి, అనుబంధ ఆలయాల్లో
⇒ తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన బంగారు వస్తువులు-128
⇒ తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన వెండి వస్తువులు-253
⇒ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని బంగారు, రత్నాల ఆభరణాలు-162
⇒ అమ్మవారి వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు-97
⇒ అమ్మవారి ఆలయంలోని లోహవిగ్రహాలు, శిలా విగ్రహాలు - 23
⇒ అమ్మవారి ఆలయంలోని రాగి, ఇత్తడి వస్తువులు-33
⇒ తిరుచానూరు ఆలయంలోని శ్రీసుందరరాజ స్వామి ఆలయంలోని ఆభరణాల వస్తువులు-44
⇒ శ్రీకపిలేశ్వర స్వామి ఆలయంలోని ఆభరణాలు, వస్తువులు-73
⇒ పంచలోహ విగ్రహాలు-148
⇒ కార్వేటి నగరంలోని శ్రీవేణుగోపాలస్వామి వారి ఆలయంలోని ఆభరణాల వస్తువులు-78
⇒ వేణుగోపాలస్వామి వారి బంగారు తాపడం చేసిన ఉత్సవ మూర్తుల ఆభరణాలు, వస్తువులు-31
⇒ నగరిలోని కరియ మాణిక్యస్వామి ఆలయంలోని ఆభరణాలు వస్తువులు-36
⇒ బుగ్గ అగ్రహారంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలోని బంగారు, వెండి ఆభరణాలు వస్తువులు-13
⇒ నారాయణవనం శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, సంబంధిత ఆలయాలలోని బంగారు, వెండి ఆభరణాలు వస్తువులు-92
⇒ నారాయణవనం శ్రీ అవనాక్షమ్మ ఆలయంలోని ఆభరణాలు, వస్తువులు-13
⇒ నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి, రాగి ఆభరణాలు-54
⇒ తిరుపతి పాదాల మండపంలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని ఆభరణాలు బంగారు, వెండి, రాగి ఆభరణాలు-71
⇒ తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలోని బంగారు, రాగి ఆభరణాలు -47
⇒ వెండి ఆభరణాలు వస్తువులు-92
⇒ శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని బంగారు ఆభరణాలు-112 - వెండి, రాగి వస్తువులు-20
⇒ ఉత్తరాంచల్ రాష్ట్రంలోని రుషికేష్ ఆంధ్రా ఆశ్రమానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు-167
⇒ అప్పలాయగుంట శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు-56
⇒ వాయల్పాడులోని శ్రీపట్టాభిరామ స్వామివారి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు-77
శ్రీవారి ఆభరణాల విశేషాలెన్నెన్నో...
⇒ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవ రాయలు తిరుమలదేవుడికి వెలకట్టలేనన్ని ఆభర ణరాశులను కానుకగా సమర్పించారు. ఇతర సామ్రాజ్యాలపై దాడులకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ రాయలవారు స్వామివారిని దర్శించుకుని అమూల్యమైన ఆభరణాలు సమర్పించారు. వాటిలో అతిముఖ్యమైనవి.
⇒ 13.360 కిలోలు బరువుగల 3,308 కారెట్లు కలిగిన నవరత్న కిరీటం, త్రిసర హారం, మూడుపేటల నెక్లెస్, ఇంద్రనీలాలు, గోమేధికాలు, మాణిక్యాలు, కర్పూర హారతి కోసం 25 వెండిపళ్ళాలు, శ్రీవారి ఏకాంత సేవకు అవసరమైన 374 క్యారెట్ల బరువుగల రెండు బంగారు గిన్నెలు. బంగారు తీగె, రత్నాలతో చేసిన కంఠాభరణాలు, బంగారు కత్తి, రత్నాలు, మణులు పొదిగిన ఒర, ఎర్రలు, పచ్చలు పొదిగిన 132 క్యారెట్లు బరువున్న కత్తి, పచ్చలతో తయారు చేసిన పిడి కత్తి, మణులతో తయారు చేసిన పిడికత్తి ఒర, 87 క్యారెట్ల బరువుగల మణుల పతకం.
శ్రీవారికి టీటీడీ తయారు చేయించిన ఆభరణాలు...
వజ్రకిరీటం - 1940
వజ్రాల హారం - 1954
వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు - 1972
వజ్రాల కటిహస్తం - 1974
వజ్రాల కిరీటం - 1986
(బరువు 13.360 కేజీలు, అప్పటి విలువ రూ.5 కోట్లు)
⇒ శ్రీవారికి ఉన్న అరుదైన ఆభరణాల్లో గరుడ మేరు పచ్చ ఉంది. దీని బరువు 500 గ్రాములు.
⇒ స్వామివారికి అధికారికంగా ముఖ్యమైన ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటితోపాటు వినియోగంలోలేని పురాతన కిరీటాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్రకిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఒకేరకమైన ఆభరణాలు రెండు నుంచి మూడు సెట్లలో అనేక ఆభరణాలు ఉన్నాయి.