ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం చోటుచేసుకుంది.
ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం చోటుచేసుకుంది. చేవెళ్లలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ గుండం(పుష్కరిణి) వద్ద ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాయితో మోది హత్య చేసినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల జాడను తెలుసుకునేందుకు జాగిలాలను రప్పించారు. మృతుడి వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.