శ్రీవారి ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం
తిరుమల: శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రసాదాలు తయారు చేసే ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. మితిమీరిన వేడి వలన వ్యర్థాలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.