తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం: వైవీ సుబ్బారెడ్డి | Yv Subba Reddy Fires On Chandrababu Comments On Tirumala Prasadam | Sakshi
Sakshi News home page

తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం: వైవీ సుబ్బారెడ్డి

Published Wed, Sep 18 2024 9:23 PM | Last Updated on Wed, Sep 18 2024 9:43 PM

Yv Subba Reddy Fires On Chandrababu Comments On Tirumala Prasadam

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపితం అయ్యింది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ విసిరారు.

ఇదీ చదవండి: పవన్‌.. గొంతు ఎందుకు పెగలడం లేదు?

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement