పెరవలి : పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడులో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలోని హుండీ దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గుడి పూజారులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.