
రాజమండ్రి: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రధానాలయం నుంచి పల్లకిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, మధు పర్కప్రాసన, కన్యాధానం కార్యక్రమాలను వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.