వెంకన్నను దర్శించుకున్నరకుల్
తిరుమల: ఏడుకొండలపై కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం పలువురు, రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శ్రీవస్రసాద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.