విశాఖ.. మంచి రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది | Dronamraju Srinivas Demise: Swaroopanandendra Express Condolences | Sakshi
Sakshi News home page

ద్రోణంరాజు మృతిపై స్వరూపానందేంద్ర సంతాపం

Published Sun, Oct 4 2020 5:35 PM | Last Updated on Sun, Oct 4 2020 7:38 PM

Dronamraju Srinivas Demise: Swaroopanandendra Express Condolences - Sakshi

సాక్షి, విశాఖపట్నం : మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతిపట్ల విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సంతాపం ప్రకటించారు. ద్రోణంరాజు శివైక్యం చెందారన్న వార్తను తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మంచి రాజనీతిజ్ఞుడిని విశాఖ నరగం కోల్పోయిందని పేర్కొన్నారు. విశాఖ శారదాపీఠంతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు.
(చదవండి : మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత)

సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ద్రోణం రాజు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలతోనే ద్రోణంరాజు జీవించారని కొనియాడారు. ద్రోణంరాజు కుటుంబానికి  ధైర్యం ప్రసాదించాలని రాజశ్యామల అమ్మవారిని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement