
సాక్షి, అమరావతి: విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడారి తులసీరావు డెయిరీ రంగానికి ఎనలేని సేవ చేశారన్నారు. తులసీరావు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆడారి తులసీరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. 1939 ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. సుమారు 35 ఏళ్లపాటు విశాఖ డైరీ చైర్మన్‌గా కొనసాగిన ఆయన విశాఖ డెయిరీని ప్రగతి పథంలో నడిపించారు. రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.
చదవండి: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు
Comments
Please login to add a commentAdd a comment