సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో జరిగిన లాంచీ ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి లాంచీ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి, ప్రభుత్వం 25లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.
బోట్లు నది, సముద్రంలోకి వెళ్లే ముందు ప్రత్యేకంగా తనిఖీలు జరపాల్సి ఉంటుందని, అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారంటూ విమర్శించారు. ప్రమాదాలను ముందుగానే పసిగట్టేందుకు రియల్ టైం బేసిన్‌లా వాతావరణ పరిస్థితులను కనిపెట్టే యంత్రాంగం ఉండాలని అన్నారు. ఏదైనా వాహనానికి అనుమతులు ఇచ్చే సమయంలో వత్తిడిలు ఉండరాదని, కానీ ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమయ్యారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment