
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ఎం. కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కరుణ కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకుల నడుమ డీఎంకే పార్టీని ఏకతాటిపై నడిపిన కరుణ ప్రతిభ అమోఘమని కొనియాడారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం నిరంతరం శ్రమించిన కరుణానిధిని తమిళ ప్రజలు ఎన్నటికీ తమ హృదయాల్లో దాచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ద్రవిడ రాజకీయాల్లో కరుణానిధి చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment