
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై జరిగిన సంఘటనకు కారణమైన నిండితునిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, అబ్దుల్లాపూర్ మెట్టు తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడిపై ఐపీసీ 302, 333, 307 సెక్షన్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment