
హరికృష్ణ మృతితో సినీ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నందమూరి కుటుంబ సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు కామినేని ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. హరికృష్ణ సమాకలీనుడైన సీనియర్ నటుడు మోహన్ బాబు ‘ఈ రోజు నా సోదరుడిని కోల్పోయాను. ఇంతకన్నా ఏమి మాట్లాడలేను’ అంటూ ట్వీట్ చేశారు.
యువ కథానాయకులు కూడా హరికృష్ణ మరణం పట్ల సంతాపం తెలిపారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్, రానా దగ్గుబాటి, నాని, నవీన్ చంద్ర సీనియర్ నటుడు నరేష్ తమ సంతాపాన్ని తెలియజేశారు. నందమూరి కుటుంబానికి వీరాభిమాని, హరికృష్ణ హీరోగా పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వైవీయస్ చౌదరి ‘పొద్దున్నే.. నైరాశ్యం.. వైరాగ్యం.. మనసుతో పాటు శరీరంలోని అణువుణువు బాధపడ్తోంది. తీర్చేవారు.. ఒక్కొక్కొరిగా దూరమవుతున్నారు. ఈ రోజు.. తనకు నచ్చితే అచంచలమైన నమ్మకాన్ని పెంచుకునే నా ‘సీతయ్య’.. ఇట్లు ఆయన వైవీయస్ చౌదరి’ అంటూ భాదోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు :
నందమూరి హరికృష్ణ దుర్మరణం
హరికృష్ణ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
హరికృష్ణ మృతితో.. దిగ్ర్భాంతిలో టాలీవుడ్
అభిమానులకు హరికృష్ణ ఆఖరి లేఖ
Comments
Please login to add a commentAdd a comment