సాక్షి, అమరావతి: సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు (93) మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రైతుల బాగు కోసం నిరంతరం శ్రమించిన కృషీవలుడిగా, రైతు బాంధవుడిగా వాసిరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని సీఎం గుర్తు చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఛాతి నొప్పితో బాధపడుతూ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరిన వాసిరెడ్డి నారాయణరావు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కృష్ణా జిల్లా వీరులపాడులో ఆయన జన్మించారు. పశుసంవర్థక శాఖలో చేసిన కృషికి గాను వాసిరెడ్డి 1994లో డాక్టర్ నాయుడమ్మ పురస్కారం అందుకున్నారు.
Hon'ble CM @ysjagan has expressed grief over the demise Vasireddy Narayana Rao garu, former Editor of Anna Daata Telugu magazine & winner of the prestigious Dr. Nayudamma Award. He conveyed his condolences to the bereaved family members.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 12, 2020
Comments
Please login to add a commentAdd a comment