narayana rao
-
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచే ప్రసక్తే లేదు..
-
సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ‘నీది నాది ఒకే కథ’, గర్ల్ ఫ్రెండు’సినిమాల నిర్మాత అట్లూరి నారాయణరావును ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దందా కేసులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కేసులో అసలు సూత్రధారి గుధే రాంబాబు హైదరాబాద్‌లో ఎఫ్ఎంసీజీ స్థాపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) పేరిట అధిక వడ్డీలు ఆశ చూపి వందలాది మంది నుంచి రూ.540 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. బాధితుల ఒత్తిళ్ల నేపథ్యంలో రాంబాబు ఓ చార్టెట్ అకౌంటెంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, తన పలుకుబడితో కేసు లేకుండా చేస్తానని, ఇందుకు అన్ని ఖర్చులకు గానూ రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాత రూ.2 కోట్లకు అంగీకరించిన నారాయణరావు అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు, రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. నారాయణరావును అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత బంగారం రికవరీ చేయాలని భావిస్తున్నారు. -
ముధోల్ బరిలో అన్నదమ్ముళ్లు! ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రజలు!
సాక్షి, ఆదిలాబాద్: భైంసా మండలం బడ్గాం గ్రామానికి చెందిన బోస్లే గోపాల్‌రావుపటేల్ – కమలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. బోస్లే నారాయణరావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్. భైంసాలో జిన్నింగ్ ఫ్యాక్టరీ నడిపే ఇరువురు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1994 ఎన్నికల్లో టీడీపీ నుంచి మొదటిసారి బరిలో దిగిన నారాయణరావుపటేల్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డెన్నపై గెలుపొందారు. అలాగే పవార్ శ్యాంరావుపటేల్ – రాధాబాయిల కుమారుడైన పవార్ రామారావుపటేల్ ఇద్దరికీ వరుసకు సోదరుడు. అక్కాచెల్లెల్ల పిల్లలైన ఈ ముగ్గురు కలిసి వ్యాపారం చేసేవారు. ఒకేచోట ఉన్న వీరు పరిస్థితులతో రాజకీయ పార్టీలు వేరై ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. ఆసక్తికరంగా పోటీ.. ముధోల్ అసెంబ్లీ బరిలో ఇద్దరు అన్నదమ్ములు నిలిచారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పవార్ రామారావుపటేల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోస్లే నారాయణరావుపటేల్ పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లోనూ ఇద్దరు అన్నదమ్ముళ్లు బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పవార్ రామారావుపటేల్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోస్లే నారాయణరావుపటేల్లు బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో బోస్లే నారాయణరావుపటేల్, బోస్లే మోహన్రావుపటేల్లు నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటర్ల వద్దకు ప్రచారానికి వెళ్లారు. 2023 ఎన్నికల్లో బోస్లే మోహన్‌రావుపటేల్ పవార్ రామారావుపటేల్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఒకప్పుడు ముగ్గురు ఒక్కటే.. 1994 ఎన్నికల నుంచి 2009 ఎన్నికల వరకు ముగ్గురు అన్నదమ్ముళ్లు ఏకతాటిపైనే ఉండేవారు. 1994 ఎన్నికల్లో బోస్లే నారాయణరావుపటేల్ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో వ్యాపారాలు పవార్ రామారావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్ చూసుకునేవారు. ముగ్గురు అన్నదమ్ముళ్లు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉండేవారు. గడిచిన పదేళ్లలో రాజకీయ వైరుధ్యాలతో వేర్వేరుగా పోటీచేస్తున్నారు. అన్నదమ్ముళ్లే ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఇరువురు సోదరులు రెండు జాతీయ పార్టీల నుంచి పోటీచేస్తున్నారు. -
సినీ నిర్మాత కోసం.. సీసీఎస్ వేట! అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో చాక్లెట్ల వ్యాపారంతో మొదలు పెట్టి, హైదరాబాద్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దందా స్థాపించి, మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) దందాలోకి దిగి, డిపాజిట్ల పేరుతో వందల మంది నుంచి రూ.540 కోట్లు వసూలు చేసిన కేసులో తెలుగు సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు నిందితుడిగా మారారు. ఈ స్కామ్ సూత్రధారి రాంబాబు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నారాయణరావును మూడో నిందితుడిగా చేర్చిన సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం ఈ కేసులో అరెస్టు అయిన రాంబాబు, పెనుమత్స కృష్ణం రాజులను తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఎంసీజీ దందా చేసేందుకు రాంబాబు రాధారామ్ ఏజెన్సీస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇద్దరు నిందితులు తమ వ్యాపార విస్తరణ కోసమంటూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. వీరికి 6 నుంచి 13 శాతం వడ్డీతో డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఓ దశలో వ్యాపారంలో వచ్చే లాభాలు పంచడానికి, వడ్డీలు చెల్లించడానికి సరిపోలేదు. దీంతో తమ వద్ద కొత్తగా పెట్టుబడి పెట్టే వారి సొమ్మును పాత ఇన్వెస్టర్లకు చెల్లించడం మొదలెట్టారు. చివరకు చెల్లింపులు చేయలేక డిపాజిటర్లను మోసం చేశారు. తమ కోసం బాధితులు తిరుగుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశారనే విషయం తెలియడంతో రాంబాబు తన కంపెనీ చార్టెట్ అకౌంటెంట్ ద్వారా అట్లూరి నారాయణరావును సంప్రదించాడు. సినీ నిర్మాతగా ఉన్న అతను తనకు రాజకీయాలతో పాటు పోలీసు విభాగంలో చాలా పలుకుబడి ఉందని, అది వినియోగించి కేసు లేకుండా చేస్తానని రాంబాబుకు హామీ ఇచ్చాడు. ఇందుకుగాను రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసాల తర్వాత రూ.2 కోట్లకు అంగీకరించిన నారాయణ రావు అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆపై కొన్ని ప్రయత్నాలు చేసినా నిందితులకు కేసు విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోయాడు. దీంతో ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి బయటపడదామని రాంబాబుకు సలహా ఇచ్చాడు. అతడు అంగీకరించడంతో ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ కథ నడపాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడతో పాటు నగరంలోనే ఈ స్కామ్ మొత్తం జరిగింది. బాధితులు సైతం ఇక్కడి వారే ఉన్నారు. అయితే నారాయణరావు మాత్రం ఖమ్మం కోర్టులో అక్కడి న్యాయవాదితో ఐపీ దాఖలు చేయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఓపక్క ఈ పనులు చేస్తూనే మరోపక్క రాంబాబు నుంచి వీలైనంత మొత్తం వసూలు చేసుకోవాలని భావించాడు. అతడి నుంచి రూ.కోటి విలువైన బంగారు ఆఖరణాలు తీసుకున్న నారాయణరావు వాటిని పాతబస్తీలో కరిగించి, రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు లోతుగా విచారించడంతో అట్లూరి నారాయణ రావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో ఇతడిని మూడో నిందితుడిగా చేర్చిన అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. -
నువ్వెవరు.. ఇక్కడ పెత్తనం మాది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించి... కమ్మ, కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదుటే ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుని వీరంగం సృష్టించారు. హనుమాన్‌జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు హాజరైన ఈ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది.నియోజకవర్గ పరిశీలకుడు హరిబాబు నాయుడుపై గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఖర్చు మాది... మేం లోకల్.. నువ్వు నాన్‌లోకల్. మామీద నీ పెత్తనం ఏమిటీ. నాకు నేరుగా చంద్రబాబుతోనే సంబంధాలు ఉన్నాయి. నువ్వెంత. ఇక్కడ మాదే పెత్తనం...’ అంటూ జాస్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హరిబాబు నాయుడుపై జాస్తి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు నాయకులు దాడి చేసేందుకు దూసుకెళ్లారు. దీంతో హరిబాబు నాయుడు సైతం తీవ్రంగా స్పందించడంతో సమావేశంలో పాల్గొన్న నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతలు రెండు వైపులకు చేరి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. హరిబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడిని సైతం స్థానిక నేతలు రెచ్చగొట్టారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో కొనకళ్ల నారాయణరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఇరువర్గాలు వినకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వికటించిన చంద్రబాబు ప్రయోగం... టీడీపీ గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడిగా గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేత వడ్రాం హరిబాబు నాయుడును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించాడు. నియోజకవర్గంలోని కాపులను సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనకు పరిశీలకుడి బాధ్యతలు అప్పగించారు. అయితే, హరిబాబు నియామకం తొలి నుంచి ఇక్కడ కొందరు నాయకులకు నచ్చలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరులుగా ఉంటూ మట్టిదోపిడీ, సెటిల్మెంట్లు చేసినవారికి హరిబాబు నియామకం మింగుడు పడలేదు. దీంతో ఆధిపత్యం కోసం పోరు జరుగుతూనే ఉంది. ఇటీవల నిర్వహించిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సుయాత్రలో హరిబాబు నాయుడు యాక్టివ్‌గా వ్యవహరించడాన్ని స్థానిక నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే గురువారం జాస్తి వెంకటేశ్వరరావు గొడవకు దిగడంతోపాటు ఆ తర్వాత ఉంగుటూరు మండల అధ్యక్షుడు కూడా నిరసన తెలియజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో కొందరు నేతల ఆధిపత్య, అహంకారపూరిత ధోరణి వల్లే ఈ గొడవ జరిగిందని, వీరి వైఖరి వల్ల అన్ని సామాజికవర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. -
కాంగ్రెస్‌కు క్యూ కడుతున్న నేతలు.. హస్తంలో ఇమడగలరా?
ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇతర పార్టీల వారిని రమ్మంటే పారిపోయారు. కాని కర్నాటక ఫలితాలు కాంగ్రెస్ జాతకాన్ని మార్చేశాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందేమో అన్న ఆశ వారిని ఆ పార్టీ వైపు నడిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పరిస్థితి అలాగే ఉంది. గతంలో వెళ్ళిపోయినవారు, కొత్తగా కొంతమంది కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు బారులు తీరారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ నిన్నా మొన్నటి వరకు కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా ఉండేది. పార్టీ నుంచి బయటకు వెళ్ళేవారే తప్ప వచ్చేవారే లేరు. కానీ, కర్నాటక ఎన్నికల ఫలితాలు టీకాంగ్రెస్ ఫేట్ మార్చేశాయి. ఇతర పార్టీలకు వెళ్ళివారు వచ్చేస్తామంటున్నారు. ప్రత్యర్థి పార్టీలోని వారు కూడా హస్తానికి జై కొడుతున్నారు. తాజా పరిణామాలు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌కు జీవం పోస్తున్నాయి. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ బయటకు వెళ్ళిపోయారు. టిక్కెట్ లభించిన రామారావు పటేల్ ఓడిపోయి తర్వాత బీజేపీలో చేరిపోయారు. అలా ముథోల్ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు పార్టీని వీడిపోయారు. రామారావు పటేల్ వెళ్ళిపోవడంతో బీఆర్ఎస్లో ఉన్న నారాయణరావు పటేల్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించగా నిరాకరించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేందుకు నారాయణరావు పటేల్ ఆసక్తిగా ఉన్నారట. వయస్సు మీరిపోవడంతో తాను పోటీ చేయకపోయినా తన కుమారుడు అఖిలేష్ పటేల్‌ను ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానంటే కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధమంటున్నారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూప్‌తో పాటు హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారట నారాయణరావు పటేల్. అదేవిధంగా నిర్మల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దమవుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీద తిరుగుబాటు చేసిన శ్రీహరిరావు ఎలాగైనా ఆయన్ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే పొంగులేటి వర్గంతో పాటు కారు దిగి చేయి పట్టుకుని నడవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సింగరేణిలో డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజా రమేష్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. చెన్నూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఈ డాక్టర్ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి భారీగా ముందుకు వస్తున్నట్లు టాక్. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఆమడ దూరం పారిపోయినవారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే దిక్కని వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూప్‌తో పాటు వీరంతా ఒకేసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. కర్నాటక ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపింది నిజమే. కానీ ఆ జోష్‌ను ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎంతవరకు నిలుపుకుంటారన్నదే ప్రశ్న. మూడు ముఠాలు, ఆరు గ్రూప్‌లుగా వర్ధిల్లుతున్న కాంగ్రెస్‌లోకి కొత్తవారు వచ్చి ఇమడగలరా? టిక్కెట్ల విషయంలో పాతవారితో పోటీ పడగలరా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: సునీల్ కనుగోలు రిపోర్టులో ఏముంది?.. టీకాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్! -
బాగున్నావా అవ్వా..!
శ్రీకాకుళం (వజ్రపుకొత్తూరు): బాతుపురం పంచాయతీ పెదవంక గ్రామానికి చెందిన మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు(ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు) కుటుంబ సభ్యులను ఎస్పీ జి.ఆర్.రాధిక కలిశారు. వజ్రపుకొత్తూరు మండలంలో మంగళవారం పర్యటించిన ఆమె రాజాంలో ఉంటున్న నారాయణరావు తల్లి నీలమ్మను కలిసి అవ్వా.. నీ అరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ నేపథ్యం, ప్రస్తుత జీవన విధానం అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులకు పోలీసులు ఉండగా ఉంటారని, ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించాలని సూచించారు. అనంతరం కొంత నగదు, పండ్లు అందజేశారు. ఆమెతో పాటు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, కాశీబుగ్గ సీఐ డి.రాము, ఎస్సై కూన గోవిందరావు తదితరులు ఉన్నారు. -
వేల్చేరుకు అత్యున్నత సాహిత్య అకాడమీ ఫెలోషిప్
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/శ్రీకాకుళం/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు విశిష్ట పండితుడు, రచయిత, అనువాదకులు, విమర్శకులు ప్రొఫెసర్ వేల్చేరు నారాయణరావు ఎంపికయ్యారు. అకాడమీ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ 92వ సమావేశంలో వేల్చేరు నారాయణరావును ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేశారు. ఆయన సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు ఎన్నికైన 14వ పండితుడని అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేల్చేరు నారాయణరావు తెలుగు సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందించారు. గరల్స్ ఫర్ సేల్ : కన్యాశుల్కం, ఏ ప్లే ఫ్రమ్ కొలొనియల్ ఇండియా, గాడ్ ఆన్ హిల్ : టెంపుల్ సాంగ్స్ ఫ్రమ్ తిరుపతి, టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ : రైటింగ్ హిస్టరీ ఇన్ సౌత్ ఇండియా, హైబిస్కస్ ఆన్ ది లేక్ : ట్వంటీయత్ సెంచరీ తెలుగు పోయెట్రీ ఫ్రమ్ ఇండియా వంటి ఆంగ్ల పుస్తకాలు రాశారు. దక్షిణ భారత సాహిత్యాన్ని, ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. జెరూసలేంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఆఫ్ హిబ్రూ యూనివర్సిటీలో, మాడిసన్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ హ్యుమానిటీస్‌లో ఫెలోగా ఉన్నారు. అనువాద రచనలకు గాను ఆయన ఏకే రామానుజన్ బహుమతి అందుకున్నారు. అలాగే, రాధాకృష్ణన్ మెమోరియల్ పురస్కారాన్ని స్వీకరించారు. తెలుగు సాహిత్యాన్ని ఆయన ఆంగ్లంలోకి అనువాదం చేసి తెలుగు భాష ఘనతను విశ్వవ్యాప్తం చేశారు. అలాగే, అనేక వర్శిటీలు ఆయన పుస్తకాలకు గుర్తింపునిచ్చి వాటి లైబ్రరీల్లో స్థానం కల్పించాయి. కాగా, ఫెలోషిప్‌కు ఎంపిక కావడంపై వేల్చూరి నారాయణరావు సంతోషం వ్యక్తంచేశారు. సాహితీరంగానికి వేల్చూరి విశేష కృషి : గవర్నర్ సాహితీ రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమి గౌరవ ఫెలోషిప్‌కు ఎంపికైన వేల్చూరి నారాయణరావును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. తెలుగు, సంస్కృత సాహితీరంగాల్లో ఆయన విశేష కృషిచేశారని కొనియాడారు. సాహితీ పరిశోధన రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారని శుక్రవారం ఓ ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు. ఆంగ్లంలోకి అనువదించడం ద్వారా తెలుగు, సంస్కృత సాహిత్య గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేశారన్నారు. సీఎం జగన్ అభినందనలు వేల్చేరు నారాయణరావును సీఎం వైఎస్ జగన్ కూడా అభినందించారు. సాహిత్య రంగానికి ఆయన విశేష సేవలు అందించారని ప్రశంసించారు. ఈ మేరకు శుక్రవారం సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అనువాదాలు, సాహితీ పరిశోధన రంగంలో ఆయన విశేష కృషిచేశారని కొనియాడారు. ఫెలోషిప్‌కు ఆయన తగిన వ్యక్తి ఇదిలా ఉంటే.. వేల్చేరు నారాయణరావు ఈ అరుదైన ఫెలోషిప్‌కు ఎంపిక కావడంపై ప్రముఖ సాహితీవేత్తలు, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు బోర్డు కన్వీనర్ శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్‌లు అభినందించారు. అలాగే, నారాయణరావు తెలుగు నుంచి ఇంగ్లి‹Ùకు చాలా అనువాదాలు చేశారని.. ముఖ్యంగా శ్రీశ్రీ మహాప్రస్థానం, గురజాడ కన్యాశుల్కాన్ని ఆంగ్లంలోకి అనువదించారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన ముఖ్య భూమిక వహించారని.. ఈ పురస్కారానికి ఆయన ఎంతైనా తగిన వ్యక్తి అని ప్రశంసించారు. సాహిత్య అకాడమీ ఫెలోషిప్.. దేశంలోని ఉద్ధండ సాహితీవేత్తలను మాత్రమే సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికచేస్తారు. ఈ పురస్కారాలు ప్రకటించే ప్రతీసారి ఇరవై మంది లేదా అంతకు తక్కువ మందిని ఎంపిక చేస్తారు. 1968 నుంచి 2018 వరకు సుమారు వంద మంది వరకు ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. సాహిత్య అకాడమీ అవార్డు.. దేశంలోని సాహితీవేత్తలు రచించిన అత్యుత్తమ రచనలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. దేశం లో ని 24 ప్రధాన భాషల్లో మాత్రమే రచనలై ఉండాలి. గౌరవ ఫెలోషిప్‌లు ఎవరికి ఇస్తారంటే.. ఇది సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్న వారికి సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత పురస్కారం. భారత పౌరులు కాని వారిని మాత్రమే ఇందుకు ఎంపిక చేస్తారు. ఈ ఫెలోషిప్‌కు ఇప్పటివరకు 13మంది ఎంపికయ్యారు. వారు.. 1) కట్సూర కోగ (2015), 2) ప్రొ.కిమ్‌యాంగ్ షిక్ (2014), 3) డా. జిన్ దిన్ హాన్ (2014), 4) డా. అభిమన్యు ఉన్నుత్ (2013), 5) సర్ విఎస్ నైపాల్ (2010), 6) ప్రొ. ఆర్ఈ ఆషెర్ (2007), 7) డా.వాస్సిలిస్ విట్సాక్సిస్ (2002), 8) ప్రొ. ఇ.పి. చెలిషెవ్ (2002), 9) ప్రొ. ఎడ్వర్డ్ సి. డిమొక్ (1996), 10) ప్రొ. డేనియల్ హెచ్‌హెచ్ ఇంగాల్స్ (1996), 11) ప్రొ. కామిల్ వి.జ్వెలెబిల్ (1996), 12) ప్రొ.జి జియాంగ్ లిన్ (1996), 13) లియోపోల్డ్ సేదర్ సెన్‌ఘర్ (1974). 14వ వ్యక్తిగా ‘వేల్చేరు’ గుర్తింపు పొందారు. ఏలూరు టు అమెరికా.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన వేల్చేరు నారాయణరావు 1933లో శ్రీకాకుళం జిల్లా అంబఖండి గ్రామంలో జన్మించారు. ఏలూరులోని మేనమామ ఇంటి వద్ద ఉంటూ ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకూ ఏలూరు సీఆర్ఆర్ కళాశాలలో చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ చేసి, ఏలూరు సీఆర్‌ఆర్‌లోనే అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. -
వాసిరెడ్డి నారాయణరావు కన్నుమూత
వీరులపాడు (నందిగామ): రైతు ఉద్యమ నేత, అన్నదాత మాసపత్రిక మాజీ సంపాదకుడు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు (93) హైదరాబాద్‌లో శుక్రవారం గుండెపోటుతో కన్ను మూశారు. 1927, ఆగస్టు 13న వాసిరెడ్డి లక్ష్మయ్య, నాగరాజమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నందిగామ మండలం వీరుల పాడులో ఆయన జన్మించారు. 1952లో మద్రాసు వెటర్నరీ కళాశాల నుంచి డిగ్రీ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి పీజీ పూర్తి చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక శాఖలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. పశుపోషణ లో అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆస్ట్రేలియా పంపింది. 1985లో పశుసంవర్థక శాఖ సంచాలకులుగా పదవీ విరమణ పొందారు. రైతుల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పశుసంవర్థక రంగానికి సంబంధించి రైతులకు మేలు కలిగేలా ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు రాశారు. రైతుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక డాక్టర్ నాయుడమ్మ అవార్డు, డా.సీకే రావు ట్రస్టు పురస్కారంతోపాలు పలు అవా ర్డులు అందుకున్నారు. నారాయణరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: రైతు ఉద్యమ నేత వాసిరెడ్డి నారాయణరావు మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ నాయుడమ్మ అవార్డు గ్రహీత అయిన నారాయణరావు రైతులకు సంబంధించిన అనేక అంశాలపై ప్రయోజనకరమైన వ్యాసాలు రాశారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
వాసిరెడ్డి నారాయణరావు మృతి; సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు (93) మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రైతుల బాగు కోసం నిరంతరం శ్రమించిన కృషీవలుడిగా, రైతు బాంధవుడిగా వాసిరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని సీఎం గుర్తు చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఛాతి నొప్పితో బాధపడుతూ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరిన వాసిరెడ్డి నారాయణరావు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కృష్ణా జిల్లా వీరులపాడులో ఆయన జన్మించారు. పశుసంవర్థక శాఖలో చేసిన కృషికి గాను వాసిరెడ్డి 1994లో డాక్టర్ నాయుడమ్మ పురస్కారం అందుకున్నారు. Hon'ble CM @ysjagan has expressed grief over the demise Vasireddy Narayana Rao garu, former Editor of Anna Daata Telugu magazine & winner of the prestigious Dr. Nayudamma Award. He conveyed his condolences to the bereaved family members. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 12, 2020 -
ధిక్కార స్వరం గిరీష్
నాటక రచయిత, సినిమా నటుడు, ప్రముఖ సామాజికవేత్త గిరీష్ కర్నాడ్ దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూ శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో సోమవారం ఉదయం బెంగళూరులోని ఆసుపత్రిలో మృతిచెందారు. మహారాష్ట్రలో మే 19, 1938లో జన్మించిన గిరీష్ కర్నాడ్ 1958లో కర్ణాటక యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. 1963లో ఎం.ఏ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, పొలిటికల్ సైన్స్, అర్ధశాస్త్రాలను అభ్యసించారు. సామాజిక విలువల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తూ హిందుత్వవాదుల నుంచి నిర్భంధాన్ని ఎదుర్కొన్నారు. కన్నడ సినిమాలో రచయితగా, ఫిలింమేకర్‌గా, సామాజిక ఉద్యమకారుడిగా సమాజంలో తన బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించారు. 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 1998లో జ్ఞాన పీఠ అవార్డును స్వీకరించారు. 2017లో ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య అనంతరం ఆ హింసను ఖండించడంలో ముందు వరుసలో నిలబడ్డారు. ఒక గౌరీని హత్య చేస్తే మేమందరం గౌరీలుగా మారతామని ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చారు. గిరీష్ కర్నాడ్ చాలా నాటకాలు రాశారు. 1961లో యయాతి, 1972లో హయ వదన, 1988లో నాగమందాల రచించారు. తెలుగు, కన్నడ సహా పలు భాషల్లోని సినిమాల్లో నటించారు. అంతేకాక పలు హిందీ సినిమాల్లో కూడా నటిం చాడు. దేశంలో 300 సంస్థలతో పుణేలో ఎల్గార్ పరిషత్ ఏర్పడి భీమాకొరేగాంలో దళితులు తమ ఉద్యమ ఆకాంక్షను ప్రకటిస్తే.. దాన్ని అణచివేయడం కోసం హిందుత్వ శక్తులు హింసకు పాల్పడి, ఇద్దరు దళితులను హత్య చేశాయి. హిందుత్వ శక్తులపై చట్టబద్ధ చర్యలు తీసుకోలేని ప్రభుత్వం, దోషులను విడిచిపెట్టి, ప్రజాస్వామిక వాదులైనటువంటి మేధావులను, ప్రొఫెసర్లను, న్యాయవాదులను అక్రమంగా అరెస్టు చేసి ఏడాది కాలంగా బెయిల్ రాకుండా పుణేలోని ఎరవాడ జైల్లో నిర్బంధించారు. ఈ నిర్బంధాల వెనుక ప్రధాన కారణంగా అర్బన్ నక్సల్ అనే పదాన్ని తీసుకువచ్చి అందరిమీద క్రూర నిర్బంధాన్ని అమలుచేస్తోంది. దీన్ని నిరసిస్తూ తానూ అర్బన్ నక్సల్‌నేనని మెడలో బోర్డు వేసుకొని ప్రపంచానికి తెలియజేశారు, ప్రభుత్వాలను సవాల్ చేశారు. ప్రజాస్వామికవాదులపై జరుగుతున్న దాడులను నిలదీయడంలో తనవంతు బాధ్యతను నిర్వహించిన గిరీష్ కర్నాడ్ జీవితం చాలా విలువైనదని భావిస్తున్నాం. అలాగే హక్కుల కోసం పోరాడే ఏ ప్రజాస్వామిక గొంతుకలకైనా మద్దతుగా పౌరహక్కుల సంఘం నిలబడుతుందని తెలియ జేస్తూ గిరీష్ కర్నాడ్లాగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఆయన స్ఫూర్తితో ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్. నారాయణరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌరహక్కులసంఘం మొబైల్ : 98667 34867 -
‘మోదీ పెళ్లి చేసుకోగలడు.. కానీ పిల్లల్ని కనలేడు’
బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీ పిల్లల్ని కనలేని అసమర్థుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే. వివరాలు.. బసవకళ్యాణి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రావు ఓ బహిరంగ సభలో మోదీని ఉద్దేశిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ అసమర్థుడు. ఇలాంటి వాడిని మా భాషలో ‘నమర్ద్’ అంటారు. అంటే పెళ్లి చేసుకోగలడు.. కానీ పిల్లల్ని కనలేడు. మోదీ కూడా అంతే.. వివాహం చేసుకోగలడు.. కానీ పిల్లల్ని కనలేడు. మోదీ చేతల ప్రధాని కాదు.. అబద్దాల ప్రధాని’ అంటూ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మోదీని టెర్రరిస్ట్ అని విమర్శించిన సంగతి తెలిసింది. ఇదే సభలో రాహుల్ కూడా మోదీపై విమర్శలు చేశారు. ఈ ప్రధాని రెండు ఇండియాలను తయారు చేస్తాడని.. ఒకటి పేదల కోసం.. మరోటి ధనికుల కోసమంటూ ఆరోపించారు. -
‘గాంధీ భవన్ పటేల్ రాజ్యంగా మారింది’
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నారయణరావు మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ మొత్తం పటేల్ రాజ్యంగా మారిందని అన్నారు. అక్కడ బీసీలను, సీనియర్ నాయకులను తొక్కి పడేస్తున్నారని వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. గాంధీ భవన్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టటమే తన ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయిందని, రాష్ట్రంలో 46 స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని జోష్యం చెప్పారు. బీసీలకు అన్యాయం చేయటం వల్లనే కాంగ్రెస్ ఓటమి పాలవుతుందని పేర్కొన్నారు. స్వతంత్ర్య అభ్యర్థిగా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
టికెట్ల లొల్లి.. కాంగ్రెస్‌కు మరో షాక్
నెలన్నరపాటు ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎట్టకేలకు 65 మందితో కూడిన తొలి జాబితానైతే సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది కానీ ఈ జాబితానే కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నేతలు ఈ జాబితాతో నిట్టూర్చారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలేదని పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నేతలు ఆందోళనకు దిగగా మరి కొంత మంది రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 46 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తూ వస్తున్న తనను కాదని ఇటీవల పార్టీలో చేరిన రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెరుగుతున్న నిరసనలు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో టికెట్లపై ఆశ పెట్టుకున్న నేతలు, వారి మద్దతుతారులు నిరసనలకు దిగారు. పలు నియోజకవర్గాల్లో పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కొత్తగూడెం స్థానాన్ని వనమా వెంకటేశ్వర్రావుకు కేటాయించడంతో ఆ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎడవల్లి కృష్ణ ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఎడవల్లి కృష్ణ వర్గీయులు ఆందోళన చేపట్టారు. పాల్యంచలోని అంబేద్కర్‌సెంటర్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భద్రాచలం అసెంబ్లీ సీటును స్థానికేతరుడైన పోడెం వీరయ్యకు కేటాయించడం పట్ల వెంకటాపురం మండల కాంగ్రెస్ కమిటీ నిరసన తెలిపింది. భద్రాచలం సీటును స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేసింది. జయశంకర్ భూపాలపల్లిని స్థానికులకే కేటాయించాలని కోరుతూ ఏఐసీసీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులకు స్థానిక కాంగ్రెస్ నేతలు వినతి పత్రాలు అందజేశారు. లేని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును సర్వే సత్యనారాయణకు కేటాయించడం పట్ల స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సీటును సర్వేకు కేటాయించడంతో టికెట్ ఆశించిన గణేష్ రెబల్‌గా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. సూర్యాపేట కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. టికెట్ దక్కకపోవడంతో పటేల్ రమేశ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తొలిజాబితాలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు చోటు లభించకపోవడం ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొలి జాబితాలోనే బీసీ నాయకుడిని పక్కన పెట్టడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. తనకు ఎంపీ సీటు వద్దని ఎమ్మెల్యే సీటే కావాలని అదీ కూడా జనగామ నుంచే పోటీ చేస్తానని పట్టుపడుతున్నారు. జాబితాలో తన పేరు ప్రకటించనందుకు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో...
చిత్రం: అంతులేని కథ రచన: ఆత్రేయ సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ గానం: ఎస్. పి. బాలు ఎన్నో పాటలు వస్తాయి, ఎన్నో పాటలు పోతాయి. కాని కొన్ని పాటలు మాత్రమే బతికుంటాయి. నేటికీ సజీవంగా ఉన్న పాట ‘అంతులేని కథ’ చిత్రంలోని ‘తాళికట్టు శుభవేళ’. తమిళంలో కణ్నదాసన్ రచించిన పాటను ఆత్రేయ ఎంతో అందంగా తెనిగించారు. ‘ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో’ అంటూ మెడలో తాళికట్టడం మన చేతిలో ఉండదని, ఎవరికి ఎవరితో ముడి పడుతుందనేది బ్రహ్మ దేవుడు రాసి పంపుతాడని రాశారు మనసు కవి ఆత్రేయ. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ పాటంతా మిమిక్రీతో కలిసి ఉంటుంది. ‘‘వికటకవిని నేను వినండి ఒక కథ చెబుతాను/కాకులు దూరని కారడవి /అందులో కాలం ఎరుగని మానొకటి/ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో/చక్కని చిలుకలు అక్కాచెల్లెలు పక్కన గోరింకలు/ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మా/బావా రావా నన్నేలుకోవా’’ అంటూ వచ్చే మొదటి చరణంలో ప్రతి వాక్యం తరవాత మిమిక్రీ వస్తుంది. ‘కాకులు దూరని కారడవి’ తర్వాత వచ్చే పక్షుల శబ్దాలలో కొన్ని శబ్దాలు, చిలుక గొంతులో ‘బావా బావా నన్నేలుకోవా’ అనే మాటలు స్వయంగా బాలునే మిమిక్రీ చేశారు. ఈ పాటలో మిమిక్రీకి ఎలా నటించాలో నాకు అర్థం కాలేదు. ప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు ‘నేరెళ్ల వేణుమాధవ్’ మా గురువులు రాజారామ్దాస్కి సన్నిహితులు. ఆయన ద్వారా వేణుమాధవ్‌గారిని కలిసి ఎలా నటించాలో నేర్చుకున్నాను. ఈ పాట ఎంతోమంది మిమిక్రీ కళాకారులకు స్ఫూర్తి. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ‘నర్తనశాల’ చిత్రంలో బృహన్నల పాత్ర కోసం ఎన్.టి. రామారావు, ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం గారిని ఇంటికి పిలిపించుకుని నాట్యం నేర్చుకున్నారు. అదేవిధంగా నేను మిమిక్రీ కళాకారుడిగా నటించడం కోసం నేరెళ్ల వేణుమాధవ్ గారి దగ్గర నేర్చుకున్నాను. ‘‘మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా/వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా/ఊరేగుదారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా/శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా/గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవిం^è వచ్చెనమ్మా/కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా/నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా’’ అని సాగే చరణంలో ప్రతి వాక్యం పూర్తి కాగానే మిమిక్రీ బిట్ వస్తుంది. వీణ శబ్దం వచ్చే చోట మిస్టర్ అయ్యర్ తన గొంతులో పలికించారు. బాలచందర్ దగ్గర అసోసియేట్‌గా చేస్తున్న ఈరంకి శర్మ దగ్గరుండి నటన నేర్పించారు. ‘చేయీచేయిగ చిలుకగోరింక శయ్యకు తరలిరమ్మా/చెల్లెలి కోసం త్యాగం చేసిన చిలకమ్మ తొలగెనమ్మా/తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా/అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మా’ అనే చరణంతో పాట ముగుస్తుంది. ఇందులో ‘చేయీచేయిగ చిలుకగోరింక’ అనే వాక్యాలకు ముందు వచ్చే మాండొలిన్లాంటి శబ్దం కూడా బాలు గారే అనుకరించారు. మిగతా శబ్దాలను ఎం.ఎస్. విశ్వనాథన్ వాద్య బృందంలోని మురుగేష్, సాయిబాబా, సదాశివం ఉరఫ్ సదన్ వారి వారి గొంతుల్లో పలికించారు. ఈ చిత్ర కథ మొత్తం ఈ పాటలో వచ్చేస్తుంది. ఈ పాటకు నలభై సంవత్సరాలు నిండినా నేటికీ కొత్తగానే ఉంటుంది. ఈ పాటను వేదిక మీద పాడేటప్పుడు మాత్రం అన్ని శబ్దాలను ఎస్. పి. బాలు స్వయంగా చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరిగింది. నేను బాగానే నటించానని బాలచందర్ మెచ్చుకున్నారు. నా నటనలో ఏఎన్ఆర్ స్టయిల్ వస్తోందని, నా సొంత స్టైల్ డెవలప్ చేసుకోమని సూచించారు. నేను నటించిన మొదటి చిత్రంలోని నా మొదటి పాట ఇంత పెద్ద హిట్ కావడం నా జన్మలో మరచిపోలేను. నారాయణరావు సినీ నటుడు - ఇంటర్వ్యూ: వైజయంతి పురాణపండ -
ఏసీబీ వలలో రాజమండ్రి సౌత్‌జోన్ డీఎస్పీ
-
రేస్‌క్లబ్ ట్రయినర్ బలవన్మరణం
మలక్‌పేట్‌లోని హైదరాబాద్ రేస్‌క్లబ్(హెచ్చార్సీ)లో ట్రయినర్‌గా పనిచేసే నారాయణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి హెచ్చార్సీలోని తన గదిలో ఆయన ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం గమనించిన సిబ్బంది నిర్వాహకులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న ఛాదర్‌ఘాట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, నారాయణరావు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
కారు బీభత్సం: ఐదుగురికి తీవ్రగాయాలు
రోడ్డు పక్కన కూర్చున్న వారిపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమూరు సమీపంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన కొందరు పెడన మండలం ఉప్పలకలవగుంట గ్రామానికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నారు. వారు మంగళవారం వేమూరు వచ్చి కొండాలమ్మ గుడి వద్ద పూజలు చేశారు. అనంతరం అక్కడే రోడ్డు పక్కన బెంచిపై కూర్చుని ప్రసాదం తింటున్నారు. అదే క్రమంలో రిజర్వు పోలీస్ కానిస్టేబుల్ నారాయణరావు కారు వేగంగా వచ్చి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ ఢీ - విద్యార్థి మృతి
స్కూలు నుంచి వస్తున్న విద్యార్థి ట్రాక్టర్ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల కేంద్రంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆర్.ఆముదాల వలస గ్రామానికి చెందిన సతివాడ నారాయణరావు(12) రేగిడిలో ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చ దువుతున్నాడు. అతడు బుధవారం సాయంత్రం సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా మూల మలుపులో ఎదురుగా చెరుకు లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటన విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. ఎస్సై కామేశ్వరరావు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఇకనైనా మారండి
అది హైదరాబాద్‌లోని ఓ నివాసం. పాస్‌పోర్ట్ విచారణకు వెళ్లిన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నారాయణరావుకు ఆ ఇంటి పెద్దాయన రూ.1500 ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. దాన్ని కానిస్టేబుల్ సున్నితంగా తిరస్కరించడంతో మరో రూ.వెయ్యి కలిపి ఇవ్వబోయాడు. కానీ, సదరు కానిస్టేబుల్... తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచారని, వాటితో సంతృప్తిగా ఉన్నామని ఎలాంటి డబ్బులు వద్దని వారించాడు. లంచం డబ్బులు తిరస్కరించి ఆదర్శంగా నిలిచిన ఆయనను సీఎం కేసీఆర్ మరుసటిరోజు సన్మానించారు. ఉద్యోగులకు వేతనాలు భారీగా పెంచామని, బాధ్యతగా పనిచేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం సూచించారు. కానీ, మన జిల్లాలోని పలువురు అధికారులు ఇంకా ఆ కక్కుర్తి వీడడం లేదు. సామాన్యులను లంచం పేరిట పీడిస్తున్నారు. వేలకు వేలు వేతనాలు తీసుకుంటూ పనికో రేటు చొప్పున వసూలు చేస్తున్నారు. చివరకు రోజువారీ కూలీల డబ్బుల్లోనూ కక్కుర్తి పడి వేధిస్తున్నారు. పెద్దపల్లి : ‘ఉద్యోగుల వేతనాలు పెంచితే అవినీతి ఆగుతుంది... ఇకపై ఎవరూ లంచం తీసుకోకుండా ప్రజలకు సేవలందించండి.... అన్న సీఎం కేసీఆర్ మాటలు పలువురు ఉద్యోగుల చెవికెక్కడం లేదు. పీఆర్సీతో అందరి వేతనాలు భారీగానే పెరిగినా... గడిచిన మూడు నెలల కాలంలో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ పరిధిలో 13 మంది అవినీతిపరులు పట్టుబడ్డారు. జిల్లాలో వారం రోజులకు ఓ అవినీతి ఉద్యోగి ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఇంతకాలంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పలానా పనికి ఇంత రేటు అంటూ ఉద్యోగులు డిమాండ్ చేసేవారు. పోలీస్‌స్టేషన్‌లో సివిల్ పంచాయితీల నుంచి క్రిమినల్ కేసుల వరకు నిందితులు, బాధితులు రెండు వైపులా ముడుపులు అందించాల్సిందే. రెవెన్యూలో అవినీతి బాగోతం గురించి చెప్పనక్కరనే లేదు. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు ఆ అవినీతి సొమ్ములో వాటా ఉంటుంది. అవినీతి ఆనవాళ్లు కనిపించే కొన్ని శాఖల గురించి చర్చిద్దాం. పోలీస్‌స్టేషన్ కథ గ్రానైట్ క్వారీలు, బ్రాంది షాపుల నుంచి భారీ నజరానాలు అందడం పరిపాటి. ఇక కాగితాల ఖర్చు నుంచి జీపు డీజిల్ వరకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే నిందితులు, బాధితులు భరించాల్సిందే. ప్రతి మండల పోలీస్‌స్టేషన్‌లో ఆటోడ్రైవర్లు, జీపు డ్రైవర్లు, ఫుట్‌పాత్ వ్యాపారులు ముడుపులతో జీపు ఖర్చు వెల్లదీస్తున్నారు. ఈవిషయం తెలిసిన ప్రభుత్వం ప్రతి పోలీస్‌స్టేషన్‌కు వాహనం కేటారుుంచింది. నిర్వహణ ఖర్చుల కింద పోలీస్టేషన్‌కు రూ.25వేలు, మున్సిపాలిటీ ఏరియా స్టేషన్‌కు రూ.75వేలు ప్రతి నెల చెల్లిస్తుంది. అరుునా వారు వెనకటి గుణమేలా మాన అన్నట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు. రెవెన్యూలో జిల్లాలో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఉద్యోగుల్లో 75శాతం మంది రెవెన్యూకు చెందినవారే. పహణీ నఖలు నుంచి పట్టాదారు పాసుబుక్కుల వరకు ప్రాజెక్ట్‌లు, గనుల్లో భూసేకరణ, పరిహారం చెల్లింపులో కింది నుంచి పైదాకా భారీ ముడుపులుంటాయి. వివాదాస్పద భూముల్లో తీర్పుల అమలుకు కాసుల వర్షం కురుస్తుంది. నగరపంచాయతీ, మున్సిపాలిటీలలో రియల్ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీ వాటాలు అందుతుంటారుు. ఇల్ల నిర్మాణ అనుమతులకు రూ.50 వేల నుంచి మొదలై ఇల్లును బట్టి రేట్లు మారుతుంటారుు. వారసత్వ వివాదాలుంటే ఇక పండుగే. ఏరియా బిల్ కలెక్టర్, కౌన్సిలర్ చివరికి మేయర్, కమిషనర్ల వరకు అమ్యామ్యాలు అందాల్సిందే. సెట్‌బ్యాక్‌లో గోల్మాల్, రోడ్ల నిర్మాణంలో వాటాలు చెప్పుకుంటే పోతే పెద్ద గ్రంథమే రాయవచ్చు. రోడ్లతో ఆర్ఆండ్బీకే లాభం గ్రామీణ రోడ్ల నుంచి ప్రధాన రోడ్లన్నీ ఆర్ఆండ్బి పరిధిలోనే ఉంటాయి. జిల్లాకు ఏ రూ.500కోట్ల విలువగల రోడ్లు ఆర్‌ఆండ్‌బీ కింద నిర్మాణమవుతాయి. ఆ శాఖకు నిధుల్లో రూ.7శాతం కమిషన్ వస్తుంది. అంటే ఏటా దాదాపు రూ.35లక్షల లంచం సొమ్ము వాటాగా వస్తుంటుంది. వ ర్క్ ఇన్స్పెక్టర్ మొదలు హైదరాబాద్‌లో అధికారి వరకు వాటాలు ముట్టుతారుు. క్వాలిటీ విజిలెన్స్‌లో ఫిర్యాదు వస్తే పండుగే రోడ్లు భవనాల నిర్మాణంలో నాణ్యత లేదని రాజకీయ నాయకుల నుంచి ఒక్క ఫిర్యాదు వస్తే చాలు విజిలెన్స్ అధికారులకు పండుగే.. పండుగ. కాంట్రాక్టర్లు, విజిలెన్స్ అధికారుల మధ్య ఒప్పందంతో వాటాలు చేతులు మారుతుంటారుు. దీంతో నాణ్యత లేని పనులను సైతం ‘మస్త్’గా ఉందంటూ కితాబు ఇస్తారు. ఒకవేట అమ్యామ్యాలు అందకపోతే అభివృద్ధి పనిమీద నాణ్యతలేదని జరిమానా వేస్తారు. ఆ జరిమానాలో పర్సేంటేజీని బట్టి జరిమానా శిక్ష ఉంటుంది. వాణిజ్య పన్నుల శాఖతీరే వేరు వ్యాపారంలో చెల్లించే పన్నులో అధికారుల చేతుల్లో బరువు పెడితే ప్రభుత్వానికి చెల్లించే భారం తగ్గుతుంది. ఇన్‌కం టాక్స్ దాడులన్నీ ముందే తెలుస్తాయి. సదరు వ్యాపారులకు వాణిజ్య పన్నుల శాఖ ఒప్పందాలన్నీ రహస్యంగా సాగుతాయి. ఇతరులకు బయటపడవు. అవినీతి ఆరోపణలు ఎక్కడా బయటకి కనిపించవు. అంగన్వాడీ... కాదేది అనర్హం సమగ్రశిశు సంక్షేమశాఖ పాలనలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కాదేది కక్కుర్తికి అనర్హం అన్నట్లు సాగుతుంది. నూనె ప్యాకెట్ నుంచి మొదలు పెడితే కోడిగుడ్ల వరకు కక్కుర్తి పడుడు. తనిఖీ కోసం ఉన్నతాధికారి వస్తే కందిపప్పు, శనగపప్పు అప్పగించి శాంతింపజేస్తారు. గండ్లు పడితే లాభాల జల్లే ఎస్సారెస్పీ అధికారుల లాభమంతా కాలువలకు పడ్డ గండ్లపైనే ఉంటుంది. ఏటా కాలువలు మరమ్మతు చేస్తుంటారు. బిల్లులు చేయడం చెల్లించడం ఆశాఖ చేస్తున్న పని. నీళ్లు రాకపోయినా నిధులు మాత్రం వస్తాయి. పనులు జరుగకపోవడంతో మిగతా శాఖలో 7, 8 శాతం ఉండగా ఎస్సారెస్పీలో 15 శాతం ముడుపుల కథ ఉంటుంది. ఇరిగేషన్ ఇదో పెట్ట పుట్ట ఇరిగేషన్‌శాఖ పరిధిలో చెరువులు ఉంటారుు. ఒక్కో చెరువు మరమ్మతుకు రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు నిధులు మంజూరవుతారుు. ఆ నిధుల్లో పావులా వంతు చెరువుకోసం ఖర్చుపెడితే మిగతాదంతా నొక్కేయడమే. అందులో సిబ్బంది నుంచి అధికారుల వాటాలు లెక్కేసి ఉంటారుు. ఏసీబీకి పదును పెట్టాలి ఉద్యోగులకు ఆశించినదానికంటే మెరుగైన జీతాలు పెరిగాయి. అవినీతిపై ఏసీబీ దూకుడు పెంచాలి. ఇది ప్రజలంతా నేర్చుకోవాలి. ఏసీబీని విస్తరించి అవినీతి అధికారులు, ఉద్యోగులకు సంకెళ్లు వేయాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. - కర్నె రాజు, ఉపాధ్యాయుడు ఏసీబీ స్థాయిని పెంచినప్పుడే ప్రయోజనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ పనిచేయలేం. సిబ్బందిని పెంచాలి. సమాచారం కోసం ఆధునిక పరికరాలను అందించాలి. 2013లో 53, 2014లో 41, 2015లో ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేశాం. సత్వరంగా విచారణ జరిపి శిక్షలు వేయాలి. అప్పుడే అవినీతి తగ్గుతుంది. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లిస్తున్న ప్రతి పైసా ప్రజలదేనని వారు గుర్తించాలి. అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వెంటనే పట్టుకుంటాం. కొందరు అవినీతిపరులు ఉద్యోగాల సర్వీస్ నుంచి తొలగింపబడ్డారు. - సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్ -
అందమున మొదటివారు...
అడివి బాపిరాజు అత్యుత్తమ వర్కుగా విమర్శకులు భావించే ‘నారాయణరావు’(1934) నవలలో భారతీయుల ఆహార్యం, ఆచారవ్యవహారాల గురించిన పరిశీలన ఒకటి ఇలా సాగుతుంది: ‘నారాయణరావు వివిధ దేశాల ప్రజల యాచార వ్యవహారములు, వివిధ దేశములలో బంటలు, ప్రజల కట్టుబొట్టులు, వర్తకసరళి మొదలైన విషయముల గూర్చి యుపన్యాసము నిచ్చినాడు. ఉత్తరదేశ ప్రజలు సిక్కులు, కాశ్మీర దేశస్థులు, పంజాబీయులు, పఠానులు, సరిహద్దు పరగణాలవారు చాలా బలమైనవారు. సంయుక్త పరగణాలవారు, మధ్య పరగణాలవారు, బిహారీయులు, రాజపుత్రులు, మహారాష్ట్రులు, ఆంధ్రులు రెండవరకమువారు. ఆఖరిరకము వంగము, అరవ, మళయాళిములవారు. కన్నడులు రెండవరకమునకు, ఆఖరి రకమునకు మధ్యనుందురు. అందమున మొదటివారు కాశ్మీరదేశ స్త్రీలు. మంగుళూరువారు, మైసూరు వైష్ణవులు తరువాత. తర్వాత మళయాళివారు, రాజపుత్ర స్త్రీలు. కొంకణీయులు, గుజరాతీ, మహారాష్ట్ర, ఆంధ్ర, వంగ మొదలైన తక్కిన దేశములవారు తర్వాత, దాక్షిణాత్య స్త్రీ లాఖరున వచ్చెదరు. కట్టులలో ఆంధ్రస్త్రీల నేటి కట్టు చాలా అందమైనది. తర్వాత మహారాష్ట్రపు కట్టు, అయ్యంగారి కట్టు తర్వాత. కథైవారీలు, రాజపుత్రస్థాన స్త్రీలు పరికిణిలు కట్టెదరు. సిక్కులు, కాశ్మీరదేశస్థ వనితామణులు లాగులు తొడుగుకొనెదరు. గుజరాతీ, ఉత్తరహిందూస్థానం, వంగదేశముల లలనలు చిన్న చీరలు కట్టెదరు. ఒక శాలువ పైన కప్పుకొనెదరు. అందరికట్టుకన్న అసహ్యమగు కట్టు ఒరియాదేశ స్త్రీలు కట్టెదరు’. -
శభాష్ పోలీసన్నా..
* కానిస్టేబుల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు * పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో డబ్బులు ఇవ్వజూపినా * తిరస్కరించిన నారాయణరావు సాక్షి, హైదరాబాద్: శభాష్ పోలీసన్నా.. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు ఇవ్వజూపిన డబ్బును తిరస్కరించి పోలీసుల నిజాయతీని పెంచిన నగర స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.నారాయణరావును ఉద్దేశించి కేసీఆర్ అన్న మాట ఇది. ఆదివారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని కానిస్టేబుల్ నారాయణరావును సీఎం అభినందించారు. వెస్ట్‌జోన్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నారాయణరావు విధి నిర్వహణలో భాగంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం జూబ్లీహిల్స్‌లోని ఓ దరఖాస్తుదారుడి ఇంటికి శనివారం ఉదయం వెళ్లాడు. పని పూర్తిచేసుకుని తిరిగివెళ్తున్న నారాయణరావును దరఖాస్తుదారుడి తండ్రి ఆపి.. కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా సున్నితంగా తిరస్కరించాడు. అయినా మరికొంత మొత్తాన్ని ఇవ్వబోగా ‘‘మా జీతాలను ముఖ్యమంత్రిగారు పెద్ద మొత్తంలో పెంచారు. మా బాగోగులను మంచిగా చూసుకున్నారు. కాబట్టి మాకు మీరిచ్చే డబ్బు అక్కర్లేదు’’ అనడంతో అశ్చర్యానికి గురైన సదరు వ్యక్తి నారాయణరావును ప్రశంసించారు. కాగా ఆ వ్యక్తే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి ‘‘మీ పోలీసులు నిజాయతీగా పనిచేస్తున్నారు. డబ్బులు తీసుకోవాలని బల వంతం చేసినా తీసుకోలేదని’’ జరిగిన విషయం వివరించారు. కాగా ఆదివారం సీఎం కేసీఆర్ కానిస్టేబుల్ నారాయణరావును క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించి నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ వై.నాగిరెడ్డి, అదనపు డీసీపీ గోవర్ధన్‌రెడ్డి, ఏసీపీ కె.ప్రసాద్, ఇన్స్పెక్టర్ సంతోష్కిరణ్ల సమక్షంలో ప్రశంసించారు. పోలీసుల పనితీరును మెరుగుపరిచేం దుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని ఈ ఘటన వెల్లడించిందని, పోలీసులందరు నారాయణరావును ఆదర్శంగా తీసుకుని నిజాయతీగా పని చేయాలని కేసీఆర్ సూచించారు. నగర పోలీసులు చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని, దానికి సాక్షిగా నిలిచిన నారాయణరావును సీఎం ప్రశంసించడం నిజాయతీపరులైన పోలీసులందరిని ప్రశంసించినట్లేనని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. -
తాండూరు కాంగ్రెస్‌లో అయోమయం!
* నియోజకవర్గ కొత్త ఇన్చార్జిగా నారాయణరావు * ఇన్‌ఛార్జి మార్పుతో రమేష్ అసంతృప్తి? * సబితారెడ్డి వర్గానికి ఊరట తాండూరు: తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మార్పు ఆ పార్టీలో అయోమయానికి దారితీసింది. రాష్ట్ర మాజీ మంత్రి ఎం.మాణిక్‌రావు తనయుడు ఎం.రమేష్ ఇన్చార్జిగా కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఇన్చార్జి మార్పు పరిణామం పార్టీలో కొందరికి ఆశ్చర్యాన్ని.. మరికొందరికి ఊరటను కలిగించింది. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పార్టీ ఇన్చార్జి అని పట్టణ శాఖ ప్రకటించింది. శాసన సభ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా మినహా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇన్చార్జిగా తను ఉండాలనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ నారాయణరావు అప్పట్లో తోసిపుచ్చారు. అధిష్టానం ప్రకటించే వరకు రమేష్యే ఇన్చార్జిగా కొనసాగుతారని నారాయణరావు అప్పట్లో ప్రకటించారు. మరి ఉన్నట్టుండి నారాయణరావు ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నారాయణరావుకు పార్టీ పగ్గాలు దక్కడంతో రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి వర్గీయులు ఊరట చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరు నాయకులు, రమేష్ వర్గీయులు ఆయనను బాధ్యతలను తప్పించడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో కుట్ర దాగి ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇది నిజమనో.. కాదనో రమేష్ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో ఆయన ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకొన్నారా.. లేదా? అనే సందేహాలు ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే కొంత కాలంగా రమేష్ వైఖరిని వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రమేష్‌కు సదరు నాయకుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. రమేష్ ఇన్చార్జిగా కొనసాగితే పార్టీలో తమ పలుకుడి ఏమీ ఉండదని భావించిన సదరు నాయకులు పార్టీలో తమ ఆధిపత్యం కోసం నారాయణరావు ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించేలా ఒత్తిడి తీసుకువచ్చినట్టు ప్రచారం సాగుతోంది. పార్టీని బలోపేతం చేయడంతోపాటు నాయకులందరినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళతాడనే కారణంతో అధిష్టానం నారాయణరావుకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినట్టు పట్టణ శాఖ చెబుతోంది. పార్టీలో కొందరు నాయకులు తమ ‘పనులు’ చేయించుకోవాలనే కుట్రలో భాగంగానే అర్ధంతరంగా ఇన్చార్జి మార్పు పరిణామం చోటుచేసుకుందనే అభిప్రాయం రమేష్ వర్గీయుల్లో వ్యక్తమవడం గమనార్హం. ఇన్చార్జి మార్పుపై రమేష్ కూడా అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తమ్మీద తాండూరు కాంగ్రెస్‌లో తాజా పరిణామంతో అయోయమ పరిస్థితి నెలకొంది. -
ఎట్టకేలకు టీడీపీ తొలిజాబితా
తాండూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో తాండూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దాదాపు 20ఏళ్ల క్రితం అన్నదమ్ములు రాష్ట్ర మాజీ మంత్రి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో బాబాయ్ నారాయణరావు కాంగ్రెస్ నుంచి, అబ్బాయి నరేష్ (నారాయణరావు సోదరుడు చంద్రశేఖర్ కుమారుడు) టీడీపీ నుంచి ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఇంత కాలం ఒకే పార్టీ (కాంగ్రెస్) ..ఒకే కుటుంబంగా ఉన్న మహరాజ్‌లు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఎన్నికల సమరంలో బాబాయ్, అబ్బాయ్ తలపడుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. 2009 సార్వత్రిక ఎన్నికల తరువాత మాజీ ఎమ్మెల్యే నారాయణరావు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో ఆయన రాజకీయ పునరాగమనం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని వీడిన నరేష్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు నారాయణరావు, నరేష్‌లకు సోమవారం టికెట్లను ఖరారు చేశాయి. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్‌కు అధిష్టానం మరో అవకాశాన్ని ఇచ్చినా ఆయన సుముఖత చూపలేదు. తనకు బదులు బాబాయ్ నారాయణరావుకు టికెట్ ఇవ్వాలని విన్నవించారు. చివరికి రమేష్ విన్నపాన్ని అధిష్టానం ఆమోదించింది. దాంతో నారాయణరావు తెరపైకి వచ్చారు. ఇదే విధంగా 1994లో నారాయణరావు, ఆయన సోదరుడు మాణిక్‌రావు కాంగ్రెస్ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు పోటీ చేశారు. దాదాపు 20ఏళ్ల తరువాత ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్, అబ్బాయ్ తలపడుతుండటం గమనార్హం. ఈనేపథ్యంలో వీరి కుటుంబసభ్యులు ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలబడతారనే సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
సంగ్రామం: పోస్టర్ల ప్రపంచ యుద్ధం
పద్దెనిమిదో శతాబ్దం ఆఖరికి లితో గ్రాఫిక్ అచ్చు విధానం సంపూర్ణ రూపం తెచ్చుకుంది. ఈ ఆకర్షణీయమైన, రంగుల ప్రచారాస్త్రాన్ని సైన్య విస్తరణకు మొదటిగా యూరప్ పాలకులు గ్రేట్‌వార్ వేళ విస్తృతంగా వినియోగించుకున్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యుద్ధాన్ని నడిపించే దివ్యాస్త్రంగా మారిపోవడం మొదటి ప్రపంచయుద్ధంతోనే ఆరంభమైంది. ఆజ్ఞల కింద అణగారి పోయి ఉండే తన ఆత్మనీ, క్రమశిక్షణకు బందీగా తప్ప ఉండలేని తన ఆలోచననీ కూడా సైనికుడు దానికి అప్పగించవలసి వచ్చింది. నాటి యూరప్ పాలకులు యుద్ధోన్మాదాన్నీ, సామ్రాజ్య కాంక్షనీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో, కళాదృష్టి మాటున యువతరం మెదళ్ల మీదకు ‘దేశరక్షణ’ పేరుతో దాడికి పంపారు. గ్రేట్‌వార్ (మొదటి ప్రపంచ యుద్ధం)లో సైనికుడంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రణభూమిలో ఆడించిన ఓ మరబొమ్మ. ఆ ఆట... గోడల మీద బొమ్మలతో మొదలయింది. చూడగానే గగుర్పొడిచేటట్టు శతఘ్ని నోళ్లలా తెల్లని పోస్టర్ మీద నల్లటి పెద్ద పెద్ద అక్షరాలు. లేదా పసుపు రంగు బ్యాక్‌డ్రాప్‌తో రక్తవర్ణ అక్షరాలు- ‘బ్రిటన్ నీ సేవ కోరుతోంది! వెంటనే సైన్యంలో చేరు!’ అంటూ. ఇలాంటి నినాదాలతో బ్రిటన్ అంతటా ఏ మూల, ఏ గోడ చూసినా 1914 సెప్టెంబర్ నాటికి వాల్‌పోస్టర్లు వెలిశాయి. గ్రేట్‌వార్‌కు లక్షల కొద్దీ సైన్యాన్ని పంపదలిచిన, పంపిన ప్రతిదేశంలోను- బ్రిటన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా... ఇలాంటి 5.4 కోట్ల పోస్టర్లను 200 రకాల డిజైన్లలో ముద్రించి గోడల నిండా అతికించాయి. కళాకారుల నేర్పు మేరకు వాటికి రకరకాల ఆకృతులు. అన్నీ యుద్ధంలో చేరమంటూ పిలుపునిచ్చినవే. యుద్ధం చేస్తున్న సొంత దేశం ఆర్థిక వనరుల కోసం బాండ్లు కొనమని కోరినవే. యుద్ధ వ్యయానికి ప్రజల నుంచే రుణాలు సేకరించారు. అందుకు హామీగా ఇచ్చిన పత్రాలకు ‘లిబర్టీ బాండ్లు’ అని పేరు పెట్టారు. పద్దెనిమిదో శతాబ్దం ఆఖరికి లితో గ్రాఫిక్ అచ్చు విధానం సంపూర్ణ రూపం తెచ్చుకుంది. ఈ ఆకర్షణీయమైన, రంగుల ప్రచారాస్త్రాన్ని సైన్య విస్తరణకు మొదటిగా యూరప్ పాలకులు గ్రేట్‌వార్ వేళ విస్తృతంగా వినియోగించుకున్నారు. రెండడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు ఉండే ఈ పోస్టర్లు ఇప్పటికీ యూరప్‌లో కొన్నిచోట్ల భద్రంగా ఉన్నాయి. విలియం రెడీ అనే వ్యక్తి వ్యక్తిగత గ్రంథాలయంలోనే యాభయ్ వరకు ఇవి ఉన్నాయి. అల్ఫోన్సో మచా, టులోజ్ లాట్రెక్, లీటెన్ వంటి కళాకారులు ఈ ప్రక్రియకు ఎంతో ఆకర్షణనూ, ప్రచారాన్నీ తెచ్చారు. ‘బ్రిటన్ పిలుస్తోంది!’ అన్న నినాదంతో ఉన్న పోస్టర్ మీద అడవి దున్న కొమ్ములను గుర్తుకు తెస్తున్న మీసాలతో ఒక మొహం దర్శనమిస్తుంది. అది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లండ్ ప్రభుత్వ యుద్ధ కార్యదర్శిగా నియమితుడైన హొరాషియో హెర్బర్ట్ కిష్నర్ది. అతడే ఫీల్డ్‌మార్షల్ లార్డ్ కిష్నర్. ఇతడు ఎవరో కాదు. బెంగాల్‌ను విభజించిన కర్జన్ (1899-1905) కాలంలో భారతదేశానికి వచ్చి, 1909 వరకు సర్వసైన్యాధ్యక్ష పదవిని నిర్వహించినవాడే. 1911-14 మధ్య కిష్నర్ ఈజిప్ట్ కౌన్సిల్ జనరల్‌గా ఉన్నాడు. యుద్ధం ప్రారంభం కాగానే ప్రధాని హెర్బర్ట్ హెన్రీ ఏస్క్విత్ యుద్ధ కార్యదర్శిగా లార్డ్ కిష్నర్ను నియమించాడు. ఆగస్టు 4న జర్మనీ మీద బ్రిటన్ యుద్ధం ప్రకటించిన తరువాత ఆరో తేదీన పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని ఇతడే. కర్జన్కూ బ్రిటన్ యుద్ధ కేబినెట్లో చోటు దక్కడం మరో విశేషం. నిజానికి ఇంగ్లండ్‌లో చాలామంది, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలలో కూడా క్రిస్మస్ నాటికి (1914) యుద్ధం ముగిసిపోతుందని అంచనాకు వచ్చారు. కానీ అది సాధ్యం కాదని ఊహించినవాడు కిష్నర్. అందుకు సాక్ష్యం అతడి సైనిక సన్నాహం. తర్జని చూపుతూ కిష్నర్ ముఖంతో ప్రచురించిన వాల్‌పోస్టర్ అంత సంచలనం సృష్టిస్తుందని అతడు కూడా ఊహించలేదు. మోన్స్ యుద్ధంలో ఇంగ్లండ్ పలాయనం చిత్తగించే సమయానికి బ్రిటిష్ సేన ఇరవై డివిజన్లు. దీనిని కిష్నర్ 70 డివిజన్లకు పెంచాడు. బ్రిటిష్ సర్వసైన్యాధ్యక్షుడు సర్ జాన్ఫ్రెంచ్కు మించి ఇతడికి పలుకుబడి ఉండేది. కిష్నర్ అప్పుడు ఇంగ్లండ్‌కు ఆరాధ్యదైవం. ‘‘కిష్నర్ పిలుపునిచ్చిన తరువాత యుద్ధానికి రావాలి కాబట్టి సైన్యంలో చేరాను’’ అని టామీ గ్రే అనే బాల సైనికుడు ఒక ఉత్తరంలో రాయడమే ఇందుకు నిదర్శనం. గ్రే వయసు పదహారేళ్లు. కానీ పద్దెనిమిదేళ్లని అబద్ధం చెప్పి మరీ సైన్యంలో చేరాడు. ఇలా కొన్ని లక్షల మంది కుర్రాళ్లు యుద్ధంలో చేరిపోయారు. ఇతడి పిలుపుతోనే యుద్ధం ముగిసే నాటికి బ్రిటన్ పౌరులు ప్రతి నలుగురిలో ఒకరు యుద్ధానికి వెళ్లారు. యుద్ధం ఆరంభం అయ్యే నాటికి బ్రిటన్ సైన్యం 7,10,000. ఇందులో రెగ్యులర్ సైనికులు 80,000. వీరే సదా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. మోన్స్ ఓటమి దేశాన్ని కుదిపేసింది. తరువాతే మరో ఐదు లక్షల సైన్యం కావాలని, అర్హులంతా యుద్ధంలో చేరాలని పార్లమెంట్ చేత కిష్నర్ పిలుపునిప్పించాడు. ఎంపిక కోసం ఒక పార్లమెంటరీ కమిటీనే నియమించేటట్టు చేశాడు. ఆ పిలుపు ఒక ప్రభంజనంలా దేశాన్ని తాకిందంటే అతిశయోక్తి కాదు. ఒక దశలో రోజుకు సగటున 33,000 మంది సైన్యంలో చేరారు. అనుకున్నట్టే ఐదు లక్షల మంది స్వచ్ఛందంగా దేశం కోసం యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం అయిపోయిన తరువాత వీరికీ సైన్యానికీ సంబంధం ఉండదు. వీరినే ప్రైవేటు సైనికులు అనేవారు. కిష్నర్ పిలుపు బ్రిటన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే, యుద్ధంలో చేరడానికి ఏ కొన్ని అర్హతలు కనిపించినా అలాంటి యువకులకి ఎవరూ ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు. సైన్యంలోకి వెళ్లమని ఒత్తిడి చేసేవారు. హ్యారీ లాడర్ అనే ఒక గాయకుడు దేశమంతా తిరుగుతూ పాటల ద్వారా సైన్యంలో చేరమని ప్రచారం చేసేవాడు. ఆ పాటలతో ఉత్తేజితులై కొందరు యువకులు ముందుకు వచ్చేవారు. వాళ్లని వేదిక ఎక్కించి తాను సైన్యంలో చేరుతున్నట్టు ప్రకటన ఇప్పించేవాడు. ఇలా మొదట వచ్చిన కుర్రాడికి పది పౌండ్లు బహుమానం ఇచ్చేవాడు. ఇంకొక గాయకుడు మారీ లాయిడ్ ఒక పాట రాశాడు. ‘యుద్ధంలో చేరకముందు నువ్వంటే నాకు అనిష్టం. ఇప్పుడు ఒంటి మీదకు ఖాకీ దుస్తులు వచ్చాయి. నిన్ను తప్పక ప్రేమిస్తా!’ ఇదీ పాట. ఇక ఆ పోస్టర్ల మీద ఒక విహంగ వీక్షణం: సైనిక జనరల్ పెట్టుకునే టోపీని ముద్రించి దానికి పైన, కింద అక్షరాలు రాశారు. ఇలా-‘ఈ టోపీ నీ తలకు సరిపోతే, ఈ రోజే యుద్ధంలో చేరు!’ ఇటలీ వేయించిన ఒక పోస్టర్లో జర్మన్ చాన్సలర్ విల్హెల్మ్ భూగోళాన్ని పండులా కొరుక్కుతింటున్నట్టు చిత్రించారు. రక్తసిక్త బ్రిటిష్ సైనికుడి శవాన్ని భుజం మీద వేసుకుని ప్రళయభీకరంగా అరుస్తూ వస్తున్న ఒక భల్లూకాన్ని చిత్రించి, ‘ఈ ఉన్మాద పీడిత మృగాన్ని నాశనం చేయండి! సైన్యంలో చేరండి!’ అంటూ ఇంగ్లండ్ మరో పోస్టర్‌ను ముద్రించింది. ఆ భల్లూకం జర్మనీకి ప్రతీక. ‘అమెరికా వైమానికదళంలో చేరు. అమెరికా మృగరాజువనిపించుకో’ అని మరో పోస్టర్లో కనిపిస్తుంది. యుద్ధ రంగం నుంచి ఒక సైన్యాధికారి ఫోన్ చేస్తున్నట్టు మరో పోస్టర్ కూడా ముద్రించారు. ‘మరింత సేనను పంపండి!’ అని ఆ అధికారి అంటూ ఉంటాడు. కింద వ్యాఖ్య ఇది: ‘ఈ పిలుపునకు స్పందించవలసిన అవసరం లేదా?’ బాయ్స్ స్కౌట్స్ వ్యవస్థాపకుడు బేడెన్పాల్ తయారు చేయించిన ఒక పోస్టర్ గురించి కూడా పేర్కొనాలి. ‘బాలల్లారా! బాలికల్లారా! మీ అంకుల్ శామ్ యుద్ధంలో విజయం సాధించడానికి మీరూ సహకరించగలరు’ అన్న నినాదంతో దీనిని రంగుల్లో ముద్రించారు. ఇంగ్లండ్ ముద్రించిన ఒక పోస్టర్లో, ఏసుక్రీస్తు జర్మనీని వీడి వస్తున్నట్టు చిత్రించారు. మా భూమిని వీడి వెళ్లవద్దంటూ చాన్సలర్ విల్హెల్మ్ కింద పడి రోదిస్తున్నట్టు కూడా చిత్రించారు. జర్మనీ పోస్టర్లు మరింత ‘కళాత్మకం’ అని పేరు తెచ్చుకున్నాయి. డేవిడ్ పోలాక్ అనే కళాకారుడు వీటిని తయారు చేశాడు. నిజానికి జర్మనీకి ప్రత్యేకంగా సైనికులను నియమించుకోవలసిన అవసరం లేదు. ఏప్రిల్ 16, 1871న అమలులోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రతి జర్మన్ పౌరుడు జీవితకాలంలో మూడేళ్లు సైన్యంలో పనిచేయడం అనివార్యం. 17-45 సంవత్సరాల మధ్య ఏదో ఒక కాలంలో ఈ బాధ్యతను పూర్తిచేయవలసిందే. సాంకేతిక పరిజ్ఞానం రీత్యా 1900 నాటికి జర్మన్ సేన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం. సంఖ్యాపరంగా పెద్ద సైన్యం రష్యాది. - డా॥నారాయణరావు