స్కూలు నుంచి వస్తున్న విద్యార్థి ట్రాక్టర్ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల కేంద్రంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆర్.ఆముదాల వలస గ్రామానికి చెందిన సతివాడ నారాయణరావు(12) రేగిడిలో ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చ దువుతున్నాడు. అతడు బుధవారం సాయంత్రం సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా మూల మలుపులో ఎదురుగా చెరుకు లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటన విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. ఎస్సై కామేశ్వరరావు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.