సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయూలి
Published Sun, Nov 24 2013 3:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయూలని సమైక్య ఉద్యమ జెడ్పీ ఉద్యోగ సంఘ నాయకుడు కిలారి నారాయణరావు పిలుపునిచ్చారు. జెడ్పీ కార్యాలయం ఎదురుగా శనివారం భోజన విరామ సమయంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించారు. జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ సౌరభ్ గౌర్ జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో సమైక్య నినాదాలు వినిపించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ ప్యాకేజీలంటూ కృపారాణితో పాటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం వద్ద గొంతెత్తడం దారుణమన్నారు. వీరికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అనంతరం విభజన కారులకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై నినదించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలు డి.సుందరరావు, కె.అప్పలనాయుడు, శోభారాణి, పార్వతి, ఎస్.సోమశేఖర్, వి.శ్రీనివాస్, ఎన్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement