ఉత్తరాంధ్రలో ప్రకంపనలు సృష్టించాలి
Published Thu, Feb 6 2014 3:26 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: శ్రీకాకుళంలో ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించనున్న సభ ఉత్తరాంధ్రలో ప్రకంపనలు సృష్టించేలా జరగాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి పాల్గొనే ఈ సభ విజయవంతంలో అందరూ భాగస్వాములు కావా లన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ జగ న్ కీర్తి పతాకం రాష్ట్రవ్యాప్తంగా ఎగురవేసేందుకు ఈ సభ నాంది కావాలన్నారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేరనున్న నేపధ్యంలో ఆయన రాకను ప్రతిఒక్కరూ స్వాగతించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందో.. ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకునేలా మనమంతా కృషి చేయాలన్నారు.
ఇతర రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టేలా తొమ్మిదో తేదీ సభ నిర్వహించాలన్నారు. సమైక్యాంధ్ర కోసం మొదటినుంచి ఉద్యమిస్తున్న పార్టీ వైఎస్‌ఆర్‌సీపీయేనన్నారు. నిరంతరం ప్రజా సమస్య లపై పోరాడే పార్టీగా గుర్తింపు పొందిందని, అందుకే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు వైఎస్‌ఆర్ సీపీలోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ 9వ తేదీన నిర్వహించనున్న సభలో పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి పాల్గొంటారన్నారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణుులకు పిలుపునిచ్చారు.
త్వరలో జరగనున్న ఎన్నికల ముందు నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉన్నట్టు భావించాలన్నారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సును కాంక్షించే పార్టీ వైఎస్‌ఆర్ సీపీ అన్నా రు. రాష్ట్రాన్ని విభజించేందుకు చంద్రబాబు యత్నిస్తు న్నారని, అదేబాటలో ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. ధర్మానలాంటి నాయ కుడు రావడం ద్వారా పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అవుతోందన్నారు. శ్రీకాకు ళం నియోజక వర్గ సమన్వయకర్త వై.వి.సూర్య నారా యణ మాట్లాడుతూ ధర్మాన చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందనడంలో సందేహం లేదన్నా రు.
ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ మాట్లాడుతూ బహిరంగసభను విజయ వంతం చేయడం ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ సత్తాను చాటాలన్నారు. రాజాం సమన్వయకర్త పీఎంజే బాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ఎవరు వచ్చినా వారిని స్వాగతించాలన్నారు. పాలకొండ సమన్వయకర్త పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ధర్మాన వంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి వైఎస్‌ఆర్‌సీపీలో చేరితే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయ మన్నారు. పలాస సమన్వయకర్త వజ్జ బాబూరావు మాట్లాడుతూ ధర్మాన రాకతో జిల్లాలో పార్టీకి ఎదురులేకుండా ఉంటుందన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్ మాట్లాడుతూ జగన్‌పై, పార్టీపై దుష్ర్పచారం చేస్తున్న తరుణంలో ఈ సభ ద్వారా వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ టెక్కలి, పాలకొం డ,పాతపట్నం, సమన్వయకర్తలు దువ్వాడ శ్రీనివాస్, విశ్వసరాయి కళావతి, కలమట వెంకటరమణ, పార్టీ కేంద్రకార్య నిర్వాహకమండలి సభ్యులు కిల్లి రామ్మోహనరావు, బొడ్డేపల్లి మాధురి, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బల్లాడ హేమమాలినీరెడ్డి, నాయకులు ధర్మాన ఉదయ్ భాస్కర్, గేదెల పురుషొత్తం, టి.కామేశ్వరి, డాక్టర్ పైడి మహేశ్వరరావు, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీధర్, అబ్దుల్ రెహమాన్, అంధవరపు సూరిబాబు, జి.టి.నాయుడు, శిమ్మ వెంకట్రావు, వి.ధనలక్ష్మి, రవిప్రసాద్, కరిమి రాజేశ్వరరావు, మహమ్మద్ సిరాజుద్దీన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement