
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. సులోచనారాణి తెలుగు పాఠకలోకాన్ని, నవలా రంగాన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేశారని వైఎస్ జగన్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
సులోచనారాణి మృతిపట్ల కేసీఆర్ సంతాపం
సాహిత్య ప్రపంచంలో సులోచనారాణిది సుస్థిర స్థానం
ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతి వృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయని ఆయన అన్నారు. తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి సులోచనారాణి చేసిన రచనలు ఉపయోగపడ్డాయన్నారు. ఆమె కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.