'రమేష్‌బాబు మృతి మాకు తీరని లోటు' | Condolence To RameshBabu From Ghattamaneni Family And Tollywood | Sakshi

రమేష్‌బాబు మృతి మాకు తీరని లోటు: ఘట్టమనేని కుటుంబం

Jan 9 2022 12:13 AM | Updated on Jan 9 2022 12:04 PM

Condolence To RameshBabu From Ghattamaneni Family And Tollywood - Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు మృతి పట్ల ఘట్టమనేని కుటుంబం విచారం వ్యక్తం చేసింది. ''రమేష్‌బాబు మృతి మాకు తీరని లోటు. రమేష్‌బాబు మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం రమేష్‌బాబు భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించనున్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్యా శ్రేయోభిలాషులందరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరుతున్నాం. అంతక్రియల సమయంలో గుమిగూడకుండా ఉండాలి.'' అని పేర్కొంది.

కాగా రమేష్‌బాబు మృతి పట్ల సినీపరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు రమేశ్‌బాబు మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

''రమేష్‌బాబు మృతిపట్ల ఆయన కుటుంబానికి నా ప్రగాడ సానభూతి. రమేష్‌బాబు మృతి కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా'' - దర్శకుడు మెహర్‌ రమేశ్‌

''నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్‌బాబు గారు కన్నుమూశారని తెలిసి దిగ్ర్బాంతికి లోనయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రముఖ నటులు కృష్ణగారి నట వారసత్వాన్ని కొనసాగించి అనంతరం చిత్ర నిర్మాణంలో వచ్చి మంచి విజయాలు సాధించారు. రమేష్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' - సినీహీరో పవన్‌ కళ్యాణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement