అనారోగ్య కారణాలతో ఈ రోజు ఉదయం మరణించిన సీనియర్ దర్శకులు విజయ బాపినీడుకు మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపినీడుతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన అభిమానులకు కూడా విజయ బాపినీడు అంటే ఎంతో ఇష్టం మన్న చిరు, తన కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన తమ్ముడిలా ఆదరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.