మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు. ‘అజాత శత్రువు’ను కడసారిగా చూసేందుకు బంధువులు, సన్నిహితులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సజల నేత్రాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. ఊహించని దారుణంతో వైఎస్సార్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.