తన తండ్రి చనిపోయిన దుఃఖంలో తాముంటే, ఆయనపై మీడియా, పేపర్లలో వచ్చిన వార్తలు మరింత బాధ కలిగిస్తున్నాయని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి అన్నారు. ఆమె బుధవారం పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ...’ పులివెందులతో నాన్నకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడి ప్రజలంటే ఆయనకు చాలా ఇష్టం. నాన్నకు ప్రజలే ముందు, ఆ తర్వాతే కుటుంబం. అన్న వైఎస్ జగన్‌మోహనన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని నాన్న కోరిక. అందుకోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలారోజుల నుంచి పులివెందులలో ఒక్కరే ఉంటున్నారు. పార్టీ కోసం ఆయన అహర్నిశలు ప్రచారం కూడా చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారు. మా నాన్నను అందరూ అభిమానిస్తారు.