sunita reddy
-
అండ చూసుకుని ఆగడాలు మితిమీరి పోతున్న దస్తగిరి
-
హస్తం గూటికి జెడ్పీ సారథులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా, తాండూరు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ అధిష్టానానికి షాక్‌లిస్తున్నారు. ఓ వైపు లోక్‌సభ ఎన్నిక లు దగ్గర పడుతుండగా, మరో వైపు గులాబీ పార్టీ కి గుడ్ బై చెప్పేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కారు దిగి హ స్తం గూటికి చేరుకోగా, తాజాగా వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి శుక్రవారం గాందీభవన్ వేదికగా హస్తం గూటిలో చేరనున్నారు. ముందుగా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్‌మున్షీ, మంత్రుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆమెతో పాటు కుమారుడు రినీష్ రెడ్డి కూడా పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిరువురినీ పార్టీలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి.. తాను మాత్రం త్వరలో చెవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ కండువా వేసుకోనున్నట్టు చెబుతున్నారు. సునీత దారిలోనే అనిత.. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌ను కలిశారు. అధికారికంగా పార్టీ కండువా కప్పుకోక పోయినా.. పార్టీ మార్పుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కృష్ణారెడ్డి కోడలు, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా త్వరలో కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎప్పుడు పార్టీ లో చేరనున్నారనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 20న జెడ్పీ సర్వసభ్య సమావే శం ముగిసిన తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. కాగా, అనితారెడ్డి మరోసారి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సారి మహేశ్వరం నుంచి కాకుండా కందుకూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జెడ్పీ పీఠాన్ని మళ్లీ ఆమెకే కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
హస్తం గూటికి పట్నం దంపతులు!
వికారాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో త్వర లో నిర్వహించనున్న బహిరంగ సభలో వీరు హస్తం కండువా వేసుకోనున్నట్లు సమాచారం. మహేందర్‌రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, సీనియర్ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే వెళ్లాలని భావించినా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అప్పట్లో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించటంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్ఎస్కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. చేవెళ్ల ఎంపీ సీటు కమిట్‌మెంటుతోనే..? మరో నాలుగు నెలల్లో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, మహేందర్‌రెడ్డి సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ‘సాక్షి’కి తెలిపారు. -
మౌనం వీడేనా!
వికారాబాద్: ఎన్నికల ప్రచారానికి జెడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఆమె ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు. బీఆర్ఎస్ అధిష్టానం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి 15 రోజులు దాటింది. బరిలో నిలిచిన వారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే జెడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డి ఇప్పటి వరకే ఏ నియోజకవర్గంలో కూడా అభ్యర్థి తరఫున ప్రచారం చేయలేదు. గతంలో ఎమ్మెల్యేలతో తలెత్తిన వివాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల్లోని చిన్న చిన్న కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలు సునితారెడ్డిని మాత్రం ప్రచారానికి పిలువలేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. పెరుగుతున్న గ్యాప్ ఏడాది క్రితం నుంచి ఎమ్మెల్యేలు, వారి వర్గీయులు జెడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డితో అంటీముట్టనట్లు ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం మర్పల్లిలో ఆమె కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై కలత చెందిన ఆమె ఎమ్మెల్యేలు, వారి వర్గీయులను దూరం పెడుతూ వచ్చారు. ప్రధానంగా వికారాబాద్, తాండూరు ఎమ్మెల్యేలతో ఏడాది కాలంగా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల్లో ఒక వర్గం సునితారెడ్డికి అండగా నిలవగా, మరో వర్గం వ్యతిరేకంగా ఉంది. ఈ వర్గమే ఆమె కాన్వాయ్‌పై దాడికి యత్నించింది. ఈ గొడవలు ఎన్నికల నాటికి సద్దుమనుగుతాయని అనుకుంటే మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. అయితే ఆమె వర్గంలోని మెజార్టీ నాయకులు ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అసమ్మతి నేతలను బుజ్జగించి, ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డి.. సునితారెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఆ రెండు చోట్ల ప్రచారం చేసే అవకాశం పరిగి ఎమ్మెల్యేతో జెడ్పీ చైర్‌పర్సన్‌కు పెద్దగా అభిప్రాయ బేధాలు లేకపోవడం, కొడంగల్ ఎమ్మెల్యే స్వయాన ఆమె మరిది కావటంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఆమె అధిష్టానం పెద్దలకు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే సన్నిహితుల వద్ద మాత్రం అసలు విషయం చెబుతూ.. ఇతరులు ఎవరైనా అడిగితే మాత్రం తన ఆరోగ్యం సహకరించక పోవడం వల్లే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు చెబుతూ వస్తోంది. -
బీ–ఫారాలు ఇవ్వనున్న బీఆర్ఎస్.. అయినా మదన్‌రెడ్డికి అందని పిలుపు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టిక్కెట్టు దక్కని నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో అధినేత కేసీఆర్ చర్చించేందుకు సుముఖంగా లేరా..? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మదన్‌రెడ్డితో మాట్లాడుతుండటమే ఇందుకు కారణమా..? అవుననే అంటున్నాయని రాజకీయ వర్గాలు. సీఎం కేసీఆర్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బరిలో ఉంటానని మదన్‌రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఆయనతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆయన పట్టు వీడటం లేదు. సీఎంతో ఉన్న సన్నిహితంతో కాస్త వెనక్కి తగ్గే యోచనలో ఉన్నప్పటికీ, ఆయన అనుచరులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. దీంతో నర్సాపూర్ అభ్యర్థిత్వంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా, ఈనెల 15వ తేదీన బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ ప్రక్రియకు ఇంకా ఒక రోజే గడువుంది. అయినప్పటికీ మదన్‌రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రాకపోవడంతో ఆయన ఎటూ తేల్చు కోలేకపోతున్నారు. పెండింగ్‌లో కాంగ్రెస్ టిక్కెట్? ఆర్ఎస్ అభ్యర్థిత్వం విషయంలో సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ టిక్కెట్టు ప్రకటన విషయంలో వేచి చూసే ధోరణిలో ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంకా ఏ నియోజకవర్గానికి అభ్యర్థిత్వాలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ, చాలా చోట్ల అభ్యర్థులకు పరోక్షంగా టిక్కెట్లపై సంకేతాలిచ్చింది. నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని, ప్రజలను కలిసి మద్దతు కూడగట్టాలని అనధికారికంగా అభ్యర్థులకు ఆదేశాలిచ్చింది. ఈ సంకేతాలున్న ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ, నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఈ సంకేతాలు ఎవరికీ లేవనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. దీంతో మదన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందనే చర్చ స్థానికంగా జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, గట్టి క్యాడర్ ఉన్న మదన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా సునీతా లక్ష్మారెడ్డిపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్న క్యాడర్ నర్సాపూర్ అభ్యర్థిత్వం ఎటూ తేలకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్లో అయోమయం నెలకొంది. జనగామ టిక్కెట్టు విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన అధినాయకత్వం నర్సాపూర్ విషయంలో ఇంకా ఈదిశగా చర్యలు చేపట్టకపోవడంతో క్యాడర్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. మదన్‌రెడ్డితో ఉండాలా, సునీతారెడ్డి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. అయితే మదన్‌రెడ్డి అనుచరుల్లో కొందరు సునీతాలక్ష్మారెడ్డి వైపు క్రమంగా మొగ్గు చూపుతుండటం ఆసక్తిగా మారింది. సునీతారెడ్డికి పరోక్షంగా సంకేతాలు.. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై అధినేత నుంచి సంకేతాలు రావడంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి స్థానిక ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఆమె గ్రామాల్లో పర్యటిస్తూ అందరినీ కలుసుకుంటున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. గురువారం కూడా చిలప్‌చెడ్, నర్సాపూర్ మండలాల్లో పర్యటించారు. -
మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో విషాదం
హైదరాబాద్: 14 ఏళ్లుగా తమ కుటుంబంలో ఒకటిగా మెలిగి తమకు ఎన్నో ఆనందాలు పంచిన పెంపుడు కుక్క మృతితో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12 కమాన్‌లో నివసించే మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఇంట్లో పెంపుడు శునకం బ్రూనో మృతి చెందింది. దీంతో ఇంటిల్లిపాది తల్లడిల్లిపోయారు. తమ ఇంట్లో ఒకరిగా మెలిగిన బ్రూనో మృతి మహేందర్ రెడ్డి సతీమణి, జెడ్పీ చైర్మన్ పట్నం సునీతారెడ్డిని తీవ్రంగా కలచివేసింది. తాను బ్రూనో మృతితో తీవ్ర మనోవేదనకు గురైన విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. తమ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన అంత్యక్రియలను ఫొటోలను షేర్ చేసుకున్నారు. -
పుట్టెడు దుఃఖంలో ఉన్న మాపై తప్పుడు వార్తలా?
సాక్షి ప్రతినిధి, కడప: నాన్నను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తి గురించి అవమానకరంగా మాట్లాడటం చాలా బాధ కలిగిస్తోందన్నారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానాలు చేయొద్దని.. పూర్తి నిష్పక్షపాత విచారణకు అవకాశమివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బుధవారం పులివెందులలోని తమ ఇంటి ఆవరణలో భర్త రాజశేఖరరెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘మానాన్న ప్రజల మనిషి. పులివెందుల అన్నా.. పులివెందుల ప్రజలన్నా ఆయనకు చాలా ఇష్టం. తొలి ప్రాధాన్యత ప్రజలే. ఆ తర్వాతే కుటుంబం ఆయనకు. మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. తరచూ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో అమ్మ నా దగ్గరే ఉండేది. పులివెందులలో ఉంటున్న నాన్న బాగోగులను ఆయన సన్నిహితులు చూసుకుంటూ ఉండేవారు. ఉదయం 5.30 నుంచి నాన్న పడుకునే వరకూ ఎవరో ఒకరు ఆయనతో ఉండేవారు. ఇప్పుడు నాన్న చనిపోయారు. మేమంతా చాలా దుఃఖంలో ఉన్నాం. ఘటన తర్వాత పేపర్లలో, టీవీల్లో వస్తున్న వార్తలు చూస్తుంటే ఇంకా ఎక్కువ బాధ కలుగుతోంది. మా నాన్న చాలా గొప్పవ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. మీకందరీకి తెలుసు ఆయన హుందాతనం. కానీ ఆయన చనిపోవడంతో ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరైనా చనిపోతే వారి గురించి చెడుగా మాట్లాడొద్దని చెబుతాం. కానీ అవేమీ పట్టించుకోకుండా మా నాన్న గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. నిష్పక్షపాత విచారణకు అవకాశం ఇవ్వండి.. నాకు గానీ, మీకు గానీ ఈ కిరాతకమైన పని ఎవరు చేశారో వెలికి తీయడమే కావాలి. అది జరగాలంటే నిష్పక్షపాత విచారణకు అవకాశమివ్వాలి. దర్యాప్తు కోసం సిట్‌ను నియమించారు. అయినా కూడా విచారణను ప్రభావితం చేసేలా కొందరు మాట్లాడుతున్నారు. పెద్ద మనుషులు మీరు.. పెద్ద హోదాలో ఉండే మీరే ఏవి పడితే అవి మాట్లాడి విచారణను ప్రభావితం చేస్తే ఎలా? ఇక నిష్పక్షపాత విచారణ ఎట్లా జరుగుతుంది? కేసును పూర్తిగా పక్క దారి పట్టించే యత్నం చేస్తున్నారు. మీడియా, రాజకీయ నేతలు.. మీ అందరినీ ఒక్కటే కోరుతున్నా.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించొద్దు. నిష్పక్షపాత విచారణ జరిగితేనే కదా.. వాస్తవాలు వెలుగులోకి వచ్చేది. మా గురించి తెలుసుకొని మాట్లాడండి.. జగనన్న ముఖ్యమంత్రి కావాలని మా నాన్న చాలా కష్టపడ్డారు. ఇంతలో ఇలా జరిగిపోయింది. కొందరు మా కుటుంబం గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. మా గురించి అవగాహన లేనివారే విమర్శలు చేస్తున్నారు. మా కుటుంబంలో 700 మందికి పైగా ఉన్నారు. వారిలో వివిధ అభిప్రాయాలుంటాయి.. వివిధ రకాల మనుషులుంటారు. వారంతా వివిధ మతాల్లో.. వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్నారు. అయినా మేమంతా పరస్పరం గౌరవించుకుంటాం. వీలున్న ప్రతి ఒక్కరం ఏటా ఒక్కసారైనా కలుస్తాం. ఈ ఏడాది రెండుసార్లు కలిశాం. మా గురించి తెలుసుకొని మాట్లాడండి. వారికి, నాకు తేడా ఏముంటుంది? ఊహాగానాలు చెబుతూ దానిపై చర్చలు కొనసాగిస్తే విచారణ ఎలా సాధ్యం? అప్పుడు నాకు, పెద్దవాళ్లకు తేడా ఏముంటుంది? నేను ఒకమాట చెబితే దాని గురించి ప్రపంచమంతా ప్రచారం చేస్తారు. అప్పుడు నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యమవుతుంది. పెద్దవాళ్లు కూడా అలా చేయకండి? మాకు నిష్పక్షపాత విచారణ కావాలి. దర్యాప్తు సంస్థ పేరు ఏదైనా కానీయండి.. మీరు ఎవరి కోసమో కాకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి’ అని సునీత కోరారు. నా బాధను అర్థం చేసుకోండి.. సన్నిహితులే ఆధారాలు చెరిపేశారంటూ సీఎం చంద్రబాబు తదితరులు చేస్తున్న ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు సునీత స్పందిస్తూ.. ‘నాన్నకు చాలా మంది సన్నిహితులున్నారు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో మేము ఇక్కడ లేము. ఎవరికైనా క్లియర్‌గా ఆలోచించే పరిస్థితి ఉంటుందా? క్లారిటీ మైండ్ ఉంటుందా? చనిపోయిన వ్యక్తి గురించి రకరకాలుగా ఆరోపిస్తుంటే కూతురిగా చాలా బాధపడుతున్నా. నా బాధను అర్థం చేసుకోండి. నిష్పక్షపాత విచారణకు ఆస్కారం ఇవ్వండి’ అని వివేకానందరెడ్డి కుమార్తె సునీత విజ్ఞప్తి చేశారు. -
మా కుటుంబంపై అసత్య ప్రచారాలు మానుకోండి
-
మేం బాధలో ఉంటే తప్పుడు వార్తలా?: వైఎస్ సునీతా రెడ్డి
సాక్షి, పులివెందుల : తన తండ్రి చనిపోయిన దుఃఖంలో తాముంటే, ఆయనపై మీడియా, పేపర్లలో వచ్చిన వార్తలు మరింత బాధ కలిగిస్తున్నాయని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి అన్నారు. ఆమె బుధవారం పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ...’ పులివెందులతో నాన్నకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడి ప్రజలంటే ఆయనకు చాలా ఇష్టం. నాన్నకు ప్రజలే ముందు, ఆ తర్వాతే కుటుంబం. అన్న వైఎస్ జగన్‌మోహనన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని నాన్న కోరిక. అందుకోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలారోజుల నుంచి పులివెందులలో ఒక్కరే ఉంటున్నారు. పార్టీ కోసం ఆయన అహర్నిశలు ప్రచారం కూడా చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారు. మా నాన్నను అందరూ అభిమానిస్తారు. గత కొంతకాలంగా అమ్మకు ఆరోగ్యం బాగుండటం లేదు. అందుకే ఆమె నా దగ్గరే ఎక్కువగా ఉంటున్నారు. నాన్న బతికినంత కాలం చాలా హుందాగా బతికారు. ఆయన చనిపోయిన బాధలో మేముంటే...మరోవైపు ఆయనపై వస్తున్న కథనాలు మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి అవమానకరంగా మాట్లాడటం కూతురుగా చాలా బాధపడ్డాను. మా నాన్నను అతి కిరాతంగా హత్య చేశారు. ఆయన హత్యకు సంబంధించి సరైన విచారణ జరగడం లేదు. కేసు విచారణలో ఉన్నప్పుడు మేము మాట్లాడటం సరికాదు. సిట్ తన పని తాను చేసుకోనివ్వాలి. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. మా ఫ్యామిలీలో సుమారు 700మందికి పైగా ఉన్నారు. అన్ని ప్రాంతాలకు చెందినవారు మా కుటుంబంలో ఉన్నారు. అభిప్రాయలు వేరుగా ఉన్నా, అందరం కలిసే ఉంటాం. ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తాం. అధికారంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు సిట్ విచారణ పూర్తి కాకముందే నిర్ణయాలు చెప్పేస్తున్నారు. అలా చేస్తే అది సిట్ విచారణపై ప్రభావం చూపిస్తుంది. నాన్న రాసిన లేఖ గురించి ఫోరెన్సిక్ నివేదికలో తెలుస్తుంది. సిట్ నుంచి నిష్పాక్షిమైన విచారణను మేం కోరుతున్నాం. నాన్న చనిపోవడమే పెద్ద షాక్, ఆ సమయంలో నాన్న మృతి తెలిసిన సన్నిహితులు చాలామంది ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వాళ్లు తప్పు చేశారని ముందే ఎలా చెబుతారు?. దోషులు ఎంత పెద్దవాళ్లు అయినా శిక్ష పడాల్సిందే. దర్యాప్తు విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా?’ అని ప్రశ్నించారు. -
‘ఉమ్మడి’గానే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాల పునర్విభజనతో సుమారు ఏడాదిన్నర క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా మూడు కొత్త జిల్లాలుగా విడిపోయింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలు ఏర్పాటైనా ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేటికీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే పార్టీ రాజకీయాలు నడుపుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, కార్యవర్గంపై టీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసినా, చివరి నిమిషంలో ఆలోచన విరమించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నర్సాపూర్‌కు చెందిన మురళీ యాదవ్ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులు, కార్యవర్గాలను ప్రకటిస్తుందనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. కొత్త జిల్లాలకు కార్యవర్గాన్ని ప్రకటించడంపై టీపీసీసీ ఒకటి రెండు దఫాలు జిల్లా కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరిపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ కొత్త జిల్లాలకు కార్యవర్గ ఏర్పాటుపై జరిపిన అభిప్రాయ సేకరణలో మిశ్రమ స్పందన వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డీసీసీ అధ్యక్షులను ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మరోమారు కొనసాగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓటమి తర్వాత సునీతదే భారం 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో కేవలం జహీరాబాద్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపుతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2014 ఆగస్టులో జరిగిన మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి సునీతా రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చివరి నిమిషంలో బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్ర పునర్విభజ , సాధారణ ఎన్నికల్లో ఓటమి తదితర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి 2014 అక్టోబర్‌లో డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్ మినహా మిగతా చోట్ల పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో కేడర్ లేని పరిస్థితి. కొన్ని చోట్ల బలహీన బహుళ నాయకత్వం ఉండడంతో నేతల నడుమ విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మూడున్నరేళ్లుగా సునీతా లక్ష్మారెడ్డి పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ వస్తున్నారు. గ్రూపు తగాదాలు, విభేదాలకు దూరంగా ఉండడం, వివాదాలకు అతీతంగా ఉండడంతో సునీత నాయకత్వంపై పెద్దగా ఫిర్యాదులు కూడా లేవు. తన అసెంబ్లీ నియోజకవకర్గం నర్సాపూర్‌కే పరిమితమవుతూ.. జిల్లా కేంద్రం సంగారెడ్డితో పాటు ఇతర చోట్ల స్థానిక నేతల ఆహ్వానిస్తేనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ఏడాదిలో పగ్గాలు త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది ఆరంభంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో సునీతా లక్ష్మారెడ్డిని మరోమారు డీసీసీ అధ్యక్షురాలిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, ముత్యంరెడ్డి మినహా సునీత కంటే సీనియర్ నేతలెవరూ లేరు. మెదక్, పటాన్చెరు, దుబ్బాక, సిద్దిపేట, నారాయణఖేడ్‌లో బహుళ నాయకత్వం ఉన్నా, నేతలందరూ నియోజకవర్గానికే పరిమితం అవుతూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో కలుపుగోలు వ్యక్తిగా పేరున్న సునీత లక్ష్మారెడ్డికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయవచ్చనే ఆలోచనతో అధిష్టానం మరోమారు డీసీసీ పీఠాన్ని అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో అప్పగించిన బాధ్యతను సునీత లక్ష్మారెడ్డి ఎంత మేర నెరవేరుస్తారనే అంశంపై అటు కాంగ్రెస్‌లో, ఇటు బయటా ఆసక్తి నెలకొంది. -
జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
నర్సాపూర్: జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ కేవలం 8 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించడం సమంజసం కాదన్నారు. అలాగే అన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టి రైతు కూలీలను ఆదుకోవాలన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని ఉండడంతో రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గోదాముల్లో స్థలం లేదంటూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయడంతో దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతుల వద్ద ధాన్యం ఉన్నంత వరకు కొనుగోలు చేయాలని, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 72 గంటల్లో ధాన్యం విక్రయించిన సొమ్ము వారి ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలన్నారు. అలాగే చెరకు మద్దతు ధరను టన్నుకు రూ.మూడు వేలుగా ప్రకటించాలన్నారు. చెరకు క్రషింగ్ చేస్తారో చేయరో తెలియని పరిస్థితి నెలకొందని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. విచారణ పేరుతో కాలయాపన.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున ప్రభుత్వం విచారణల పేరుతో కాలయాపన చేయవద్దని సునీతారెడ్డి ప్రభత్వాన్ని కోరారు. ఆత్మహత్యలపై డీఎస్పీ, ఆర్డీఓ, తహశీల్దార్లు విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుందని, విచారణలో జాప్యం జరగడంతో రైతు కుటుంబాలకు నష్టం జరగుతోందన్నారు. పార్టీ సభ్యత్వంపై రేపు సమీక్ష జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని సునీతారెడ్డి పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆదివారం జహీరాబాద్‌కు, డిసెంబరు 3న నారాయణఖేడ్‌కు పార్టీ ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. డిసెంబరు 1న జిల్లాలో సభ్యత్వ నమోదును సమీక్షించేందుకు అందోలులో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సమీక్షలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరవుతారన్నారు. సమీక్షకు జిల్లాలోని పార్టీ మండల స్థాయి నాయకులు తదితరులు హాజరు కావాలని కోరారు. జిల్లాలో లక్షా 20వేల సభ్యత్వ నమోదు లక్ష ్యంగా నిర్ణయించామన్నారు. -
పవర్‌పైనే వార్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దాదాపు మూడున్నరేళ్ల తర్వాత జిల్లా పరిషత్ పాలక మండలి శుక్రవారం భేటీ కానుంది. ఎన్నికల జాప్యంతో మూడేళ్లపాటు పాలకమండలి లేకపోవడంతో జిల్లా పరిషత్ ప్రత్యేక పాలనలో సాగింది. తాజాగా పాలకవర్గం ఏర్పాటైన తర్వాత శుక్రవారం తొలిసారిగా సమావేశం కానుంది. పాలకవర్గం ఎన్నికైన అనంతరం మన ఊరు-మన ప్రణాళిక నేపథ్యంలో ఓసారి సమావేశం జరిగినప్పటికీ.. స్థాయి సంఘాల ఏర్పాటు, వాటి సమావేశాల తర్వాత జరుగుతున్న భేటీ కానుండడంతో సమావేశానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. దరఖాస్తులు.. విద్యుత్ సమస్య జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు చైర్పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు కలెక్టర్ ఎన్.శ్రీధర్, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం జిల్లా రైతాంగం విద్యుత్ సమస్యనెదుర్కొంటోంది. ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తు అంశంపైనా వాడీవేడి చర్చ జరగనుంది. దరఖాస్తు ప్రక్రియలో గ్రామాల్లో గంటల తరబడి వేచిచూడాల్సి రావడం.. దరఖాస్తు పత్రం తీసుకునే అంశంలో అధికారుల వైఖరి తదితర అంశాలు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారాయి. ఈ సమస్యలను తాజా సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ప్రస్తావించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. మరోవైపు నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్య వైఖరితో వాటి పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ముంది. కొత్త పాలకవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కొత్తవారే కావడంతో జెడ్పీలో సమావేశంలో దాదాపు అందరూ కూడా తమ ప్రాంత సమస్యలపై గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. -
అందరి అభీష్టం మేరకే సునీతకు డీసీసీ పగ్గాలు
నర్సాపూర్: ఇటీవల జరిగిన మెదక్ ఉప ఎన్నికలో పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేకూరిందని, సునీతారెడ్డి అన్ని వర్గాల నాయకులను, కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగుతారని, ఆమెకే డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని జిల్లా కాంగ్రెస్ నాయకుల కోరిన మేరకు ఆమెకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డికి శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సునీతారెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఏ సమ స్య వచ్చినా ముఖ్య నాయకుల సహకారంతో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ఇతర నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని నాయకుల సహకారంతో పార్టీకి పూ ర్వ వైభవం తెచ్చి 2019 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచెందుకు పార్టీని సిద్ధ చేసేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే గీతారెడ్డి, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్, శశిధర్‌రెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదతరులు పాల్గొని సునీతారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తరలివెళ్లిన నాయకులు మాజీ మంత్రి సునీతారెడ్డికి శుక్రవారం హైదరాబాద్‌లో డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే కార్యక్రమానికి నర్సాపూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. నర్సాపూర్ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, బ్లాక్ అధ్యక్షుడు సత్యంగౌడ్, ఆంజనేయులుగౌడ్, అశోక్, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు తరలివెళ్లారు. -
సునీతారెడ్డికి డీసీసీ పగ్గాలు
నేడు అధికారికంగా అందనున్న ఉత్తర్వులు నర్సాపూర్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలిగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వాటికి సునీతారెడ్డి ఎన్నికయ్యారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలతో తెలంగాణ పీసీసీ ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సూచనల మేరకు తెలంగాణ పీసీసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సునీతారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించడంతో పాటు ఆమెకు నియామక ఉత్తర్వులు అందివ్వనున్నారు. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలకు ముందు డీసీసీ అధ్యక్షునిగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రకటించిన టీపీసీసీ ఒక్కరోజులోనే ఆయన నియామకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా, సునీతారెడ్డికి డీసీసీ పగ్గాలు దక్కనుండడం పట్ల టీపీసీసీ అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనూహ్యంగా వచ్చి... హ్యాట్రిక్ సాధించి శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన వాకిటి సునీతారెడ్డి 1999 సంవత్సరంలో భర్త లకా్ష్మరెడ్డి అకాల మృతితో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చిలుముల విఠల్‌రెడ్డిపై విజయం సాధించారు. ఆతర్వాత వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇటీవల జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మెదక్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసిన సునీతారెడ్డి రెండోస్థానంలో నిలిచారు. జెడ్పీపై కాంగ్రెస్ జెండా పాతిన సునీతారెడ్డి సునీతారెడ్డి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం 2000 సంవత్సరంలో జిల్లా డీసీసీ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుమారు 16 నెలల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె, ఆ సమయంలో జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు కైవసం చేసుకుని జెడ్పీ పీఠం దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పీసీసీ సభ్యురాలిగా, ఏఐసీసీ సభ్యురాలిగా కొనసాగుతున్న సునీతారెడ్డి గతంలో పీసీసీ మహిళా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగారు. పార్టీ బలోపేతమే లక్ష్యం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే నా ముందున్న ప్రస్తుత లక్ష్యం. జిల్లాలోని నాయకులందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్తా. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ శ్రేయస్సుకోసం పనిచేస్తా. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలన్నీ స్వాగతిస్తాం. కానీ ప్రజావ్యతిరేక విధానాలను మాత్రం పార్టీ తరఫున అడ్డుకుంటాం. చివరగా నన్ను డీసీసీ అధ్యక్షురాలిగా ప్రతిపాదించిన వారందరికీ ధన్యవాదాలు. -సునీతారెడ్డి, మాజీమంత్రి -
స్థానిక సంస్థలకు నిధులు పెంచండి
14వ ఆర్థిక సంఘానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి వినతి సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే నిధుల మొత్తాన్ని మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి 14వ ఆర్థిక సంఘానికి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ గ్రాండ్ కాకతీయలో 14వ ఆర్థిక సంఘం సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చెర్‌పర్సన్ సంఘ సభ్యులను కలిసి ఆర్థిక సంఘ నిధుల వినియోగాన్ని వివరించారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు వచ్చిన నిధులు ఏ మూలకూ చాలలేదని, దీంతో అభివృద్ధి ఆశించినంతగా లేదన్నారు. రాజధాని చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ అనుసంధాన రోడ్లు లేని పల్లెలున్నాయన్నారు. అదేవిధంగా పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్యానికి సంబంధించి పలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధుల మొత్తాన్ని రెట్టింపు చేయాలని ఆమె కోరగా.. సంఘ సభ్యులు పరిశీలిస్తామన్నారు. -
భారీ మెజార్టీతో గెలుస్తా
హత్నూర: టీఆర్ఎస్ కార్యకర్తల కృషి, నాయకుల పట్టుదలతో పనిచేశారని, అందువల్ల తాను భారీ మెజార్టీతో ఎంపీగా గెలుస్తానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని దౌల్తాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి అధికారంలో ఉన్న పదిహేను సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో రోడ్లు కూడ ఆధ్వానంగా ఉన్నాయన్నారు. ఇక తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పనున్నట్లు ఆయన తెలిపారు.విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మురళీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె తీర్పువిలక్షణం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉద్యమాల పురిటిగడ్డ, టీఆర్ఎస్ పుట్టినిల్లు అయిన మెతుకుసీమ పల్లెల్లో హోరాహోరి పోరు కొనసాగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. రాత్రి పొద్దుపోయాక ప్రకటించిన కడపటి ఫలితాల్లో 272 ఎంపీటీసీ స్థానాలను సాధించి కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతలో ఉండగా, .. జెడ్పీటీసీల్లో మాత్రం హంగ్ ఏర్పడింది. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దక్కించుకునేంత స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకీ రాలేదు. కడపటి ఫలితాలు అందే సమయానికి కాంగ్రెస్, టీఆర్ఎస్లు చెరో 21 జెడ్పీటీసీ స్థానాలను సాధించగా, టీడీపీ మాత్రం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరిచినప్పటికీ, మంత్రి సునీతారెడ్డి నియోజకవర్గమైన నర్సాపూర్, మరో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గం దుబ్బాకలో పార్టీ పూర్తిగా చేతులెత్తేయడంతో హంగ్ ఏర్పడింది. ఇక గజ్వేల్ అసెంబ్లీ బరిలో ఉన్న గులాబీ దళపతి కేసీఆర్‌కు ప్రమాద ఘంటికలు మోగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేసులో ఉన్న దామోదర రాజనర్సింహ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అత్యంత కీలకమైన గజ్వేల్ జెడ్పీటీసీని, కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న జగదేవ్‌పూర్ జెడ్పీటీసీతో పాటు మరో జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకోగా.. టీఆర్ఎస్కు పూర్తి పట్టున్న కొండపాక జెడ్పీటీసీతో పాటు మరో రెండు జెడ్పీటీసీలను కలిపి మొత్తం 3 స్థానాలలో కాంగ్రెస్ గెలవడంతో టీఆర్ఎస్ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం ఆరు జెడ్పీటీసీలు ఉండగా టీఆర్ఎస్ బోణి కోట్టలేకపోయింది. ఇక్కడ ఎంపీటీసీ స్థానాల్లో కూడా ఆ రెండు పార్టీలు ముందంజలో ఉన్నాయి. ముందునుంచి ఊహిస్తున్నట్టుగానే టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి సొంత ఇమేజ్‌తో టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. కేసీఆర్ ఏప్రిల్ 9న గజ్వేల్ అసెంబ్లీకి నామినేషన్ వేయగా.. 11న ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. దామోదర రాజనర్సింహ నియోజకవర్గం అందోల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష మెజార్టీ సాధించింది. ఏడు జెడ్పీటీసీ స్థానాల్లో 6 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 7 ఎంపీపీ స్థానాల్లో 5 స్థానాలు కాంగ్రెస్, రెండు స్థానాల్లో టీఆర్ఎస్కు వచ్చాయి. జిల్లాలో 46 జెడ్పీటీసీలకు, 685 ఎంపీటీపీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 6న 24 మండలాల్లో, ఏప్రిల్ 11న 22 మండలాల్లో బ్యాలెట్ పద్ధతిలోఎన్నికలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాలెట్లను వేరు చేసి, కట్టలుకట్టి, ఓట్లు లెక్కించాల్సి రావడంతో లెక్కింపు ప్రక్రియ బాగా అలస్యమవుతోంది. విలక్షణ తీర్పు.... పల్లె ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. మూకుమ్మడిగా ఒకే పార్టీ వైపునకు మొగ్గు చూపకుండా ఆచితూచి ఓట్లు వేశారు. నిజానికి గ్రామాలపై టీఆర్ఎస్ పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. సర్వేలు కూడా ఫలితాలు కారుకు అనుకూలంగా ఉంటాయని తేల్చాయి. తీరా బాక్స్‌లు విప్పి చూస్తే... ఎవరి అంచనాకు అందకుండా ఓటరు తీర్పు నిచ్చారు. ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపగా.. జెడ్పీటీసీకి వచ్చేవరకు పరిస్థితి తారుమారు అయింది. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. సంగారెడ్డిలో, కొండాపూర్ మండలాల్లో మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. జెడ్పీటీసీలు మాత్రం విచిత్రంగా టీఆర్ఎస్ పార్టీకి దక్కాయి. మిలిగిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. మీసం మెలేసిన నర్సారెడ్డి... స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని, టీఆర్ఎస్ పార్టీ కంటే ఒక్క సీటు తక్కువగా వచ్చినా.. మీసం తీసుకుని, రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పల్లె పోరులో మీసం తిప్పారు. ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఒక్క స్థానం కూడా రాకపోగా కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు వచ్చాయి. ఎంపీటీసీ స్థానాల్లో కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతుండగా, టీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంది. -
తొలిదశ ‘ప్రాదేశిక’ ప్రచారానికి నేటితో తెర
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికలు జరగనున్న 24 మండలాల్లో ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుంది. దీంతో అన్ని రాజకీయపార్టీలు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ ముఖ్యనేతలు చివరిరోజున ముమ్మర ప్రచారం చేయనున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ ప్రభుగౌడ్, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, నందీశ్వర్‌గౌడ్, జయప్రకాశ్‌రెడ్డితోపాటు టీఆర్ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు, ఇటీవలే ఆ పార్టీలో చేరిన బాబూమోహన్, టీడీపీ నేతలు శుక్రవారం గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు. మొదటి విడతగా 24 జెడ్పీటీసీ, 353 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా మండలాల్లో ముఖ్యనేతలు శుక్రవారం సాయంత్రం వరకు ఓటర్ల వద్దకు వెళ్లి మద్దతు కోరనున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిందే తడవుగా రాజకీయ పార్టీలు గ్రామాల్లో స్థానిక ప్రచారం ప్రారంభించాయి. గురువారం మాజీ మంత్రి గీతారెడ్డి న్యాల్కల్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అలాగే ఆమె జహీరాబాద్ మండలంలో ప్రచారం చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే హరీష్‌రావు సంగారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మొదటి విడత ఎన్నికలు జరిగే సిద్దిపేట, గజ్వేల్‌లో మరోమారు పర్యటించనున్నారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన బాబూమోహన్ రేగోడ్ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉంటే జడ్పీ చైర్మన్ రేసులో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థుల మండలాల్లో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం జిల్లాలో ఈ నెల 6న మొదటి విడతగా 24 మండలాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆయా మండలాల్లో ఎన్నికల కేంద్రాలను సిద్ధం చేయటంతోపాటు గురువారం ఎన్నికల సిబ్బంది నియామకం పూర్తిచేశారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని అధికారులు చేరవేశారు. మరోవైపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. -
జెడ్పీ పీఠం కాంగ్రెస్‌దే
శివ్వంపేట, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవిని హస్తగతం చేసుకుంటామని మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా మండల పరిధి దొంతి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఆమె పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన మాజీ మంత్రి ప్రత్యేక పూజల అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. దొంతి, గుండ్లపల్లి, కొంతాన్‌పల్లి, దంతాన్పల్లి, పోతులబోగూడ, పాంబండ, ఉసిరికపల్లి, చెంది, గంగాయిపల్లి, శేభాష్పల్లి గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వే యాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని, పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సందర్భంగా కొంతాన్‌పల్లి పంచాయతీ టీఆర్ఎస్కు చెందిన మాజీ ఉప సర్పంచ్ కొండల్రావు ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. -
సిట్టింగ్‌లకు గ్రీన్ సిగ్నల్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జబితా కసరత్తు కొలిక్కి వచ్చింది. పార్టీ స్క్రీనింగ్ కమిటీ గురువారం తొలి జాబితాకు తుది రూపం ఇచ్చింది. ‘మిస్టర్ కూల్’ శివతాండవం.. ‘ఫైర్‌బ్రాండ్’ మౌనవ్రతం వంటివి మెతుకు సీమ కాంగ్రెస్‌కు సిట్టింగు ఎమ్మెల్యేలకు కలిసొచ్చాయి. నందీశ్వర్‌గౌడ్ విశ్వరూపాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కదిలించడానికి వెనుకడుగు వేసినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 8 మంది సిట్టింగుల్లో ఒక్క నారాయణఖేడ్ మినహా మిగిలిన అన్ని చోట్ల మళ్లీ పాతకాపులకే టికెట్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అందోల్- దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి- జగ్గారెడ్డి, పటాన్చెరు- నందీశ్వర్‌గౌడ్, దుబ్బాక- చెరుకు ముత్యంరెడ్డి, గజ్వేల్- నర్సారెడ్డి, జహీరాబాద్- గీతారెడ్డి, నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జాబితాలో మార్పు ఉండే అవకాశం లేదని కాంగ్రెస్ కరాఖండికండీగా చెప్తున్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ నుంచి ప్రస్తుత ఎంపీ సురేష్ షెట్కర్‌ను రంగంలోకి దింపి, జహీరాబాద్ ఎంపీ సీటు మైనార్టీ నాయకుడు ఫరీదుద్దిన్కు కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అందువల్లే నారాయణఖేడ్ అసెంబ్లీ సీటును ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వకుండా ఖాళీపెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సీపీఐ నేతలతో సమావేశమై పొత్తుల విషయంపై చర్చిస్తారు. అదే రోజు సీపీఐ అడిగిన సీట్ల జాబితాను ఢిల్లీ అధిష్టానం ముందుపెట్టనున్నట్లు సమాచారం. సీపీఐ కోరిన సీట్లను ఆ పార్టీకి వదిలేసి మరో జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. అయితే జిల్లా నుంచి సీపీఐకి సీట్లు ఇచ్చే అవకాశం లేదని ప్రాథమికంగా తెలుస్తోంది. ఒకేవేళ తప్పని పరిస్థితి తలెత్తితే ఆ పార్టీ బలంగా ఉన్న చోట సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతా సవ్యంగా సాగితే శనివారం సాయంత్రం, లేదా ఆదివారం రోజున తొలి జాబితా వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై అనేక ఊహాగానాలు, అనుమానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపురం, సీట్లపై పుకార్లు షికార్లు చేశాయి. సంగారెడ్డి నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. తన వర్గానికి చెందిన ఐకేపీ మహిళలతోనూ, అనుచరులతో కలిసి తూర్పు జగ్గారెడ్డిపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. సీటు దాదాపు పద్మినీరెడ్డికే ఖరారు అయిందని ప్రచారం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత మాజీ డిప్యూటీ స్పీకర్, సంగారెడ్డి నుంచి ఐదు పర్యాయాలు గెలిచిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కొడుకు నిరూప్‌రెడ్డికి టికెట్ వస్తుందని పుకార్లు వచ్చాయి. అన్ని అనుమాలకు తెర వేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగ్గారెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పటాన్చెరు నియోజకవర్గం నుంచి టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. రాహుల్ గాంధీని కలిసి తనకు సీటు ఇవ్వాలని కోరారు. డీసీసీ అధ్యక్షుని హోదాలో ఏఐసీసీకి పంపిన ముగ్గురు ప్రాపబుల్స్ పేర్లలో తన పేరుతో పాటు తన అనుచరుల పేర్లను మాత్రమే చేర్చి సిట్టింగు ఎమ్మెల్యే పేరు చేర్చక పోవడంతో ఆగ్రహించిన నందీశ్వర్‌గౌడ్ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో దిగివచ్చిన అధిష్టానం ఆయనకే కాదు సిట్టింగులందరికి టికెట్ ఇస్తామని సూచన ప్రాయంగా తెలిపింది. దుబ్బాక నియోజక వర్గంలో ఈసారి చెరుకు ముత్యంరెడ్డితో భూపతి మనోహర్‌రావు, బండి నర్సాగౌడ్ పోటీపడ్డారు. మనోహర్‌గౌడ్ రెండు సార్లు రాహుల్‌గాంధీని కలిసి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. ముత్యంరెడ్డిపై ఉన్న వ్యతిరేకతను ఎత్తిచూపించి అధిష్టానం ఒప్పించే ప్రయత్నం చేశారు. ఒక దశలో తనకు టికెట్ రాదేమోనని అనుమానించిన ముత్యంరెడ్డి తనకు కాకుంటే తన కుమారుడు శ్రీనివాసరెడ్డికైనా టికెట్ ఇవ్వాలనే వాదన తెరమీదకు తెచ్చారు. నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డికి పోటీగా ఎవరు లేనప్పటికీ సీపీఐ పార్టీతో పొత్తుల నేపథ్యంలో ఆమె సీటుకు ప్రమాదం ఉందనే సంకేతాలు వచ్చాయి. ఆమె సీటుకు ఢోకా లేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కాగా నర్సాపూర్ టికెట్ కోసం చివరి వరకు పట్టుబడతామని సీపీఐ జిల్లా కమిటీ చెప్తోంది. వారి మాటలను బట్టి చూస్తే సునీతారెడ్డి సీటుకు పొత్తుల ప్రమాదం ఇంకా పొంచి ఉందనే చెప్పొచ్చు. జిల్లాకే చెందిన మరో మాజీ మంత్రి గీతారెడ్డి తన కుటుంబం నుంచి రెండు సీట్ల కోసం ప్రయత్నం చేశారు. జహీరాబాద్ టికెట్‌ను తన కూతురు మేఘనారెడ్డికి, మల్కాజ్గిరి అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ దిశగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఆమె పాత సీటుకే టికెట్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంపైనే కొంత సందిగ్థత ఏర్పడింది. ప్రస్తుతం ఎంపీ సురేష్ షట్కర్ను ఎమ్మెల్యేగా పంపిచే అవకాశాలను అధిష్టానం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే నారాయణఖేడ్‌పై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని సమాచారం. -
పొత్తు.. సీటు చిత్తు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీ మంత్రి సునీతారెడ్డి సీటుకు సీపీఐ ఎసరు పెట్టింది. ఆమె సొంత నియోజకవర్గమైన నర్సాపూర్‌ను పొత్తులో భాగంగా ఈసారి తమకు ఇవ్వాలని సీపీఐ కోరింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర సమితి ప్రతిపాదించగా.. కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సునీతారెడ్డి తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తున్నందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ అధిష్టానం మెదక్ పార్లమెంటు స్థానాన్ని ఆఫర్ చేయగా.. ఆమె నిరాకరించినట్లు ఢిల్లీ నుంచి అందిన సమాచారం ద్వారా తెలుస్తోంది. పొత్తులపై స్పష్టత... కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తులపై ఒక స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ రెండు పార్టీల రాష్ట్ర నేతల మధ్య సోమవారం జరిగిన పొత్తులు, సీట్ల సర్దుబాటు చర్చలు అర్థవంతంగానే ముగిసినట్లు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా సమర్థించిన ఈ రెండు జాతీయ పార్టీల మధ్య మొదటి నుంచి భావసారూప్యత ఉంది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వీరికి ఉమ్మడి శత్రువు. రెండు పార్టీలు జత కట్టడం ద్వారా తెలంగాణ సానుకూల ఓటును ఒడిసి పట్టుకోవచ్చని నాయకుల భావన. సీట్ల పంపకాలలో పెద్దగా పేచీలు లేవని, పొత్తు దాదాపు ఖాయమని, ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సీపీఐ 22 అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంటు సీట్లను కోరగా... కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ పొత్తుల కమిటీతో నారాయణ బృందం చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు కొలిక్కి రానట్లు తెలిసింది. నర్సాపూర్ నియోజకవర్గం మొదటి నుంచి సీపీఐ పార్టీకి మంచి పట్టుంది. ఇక్కడ ఆ పార్టీ నుంచి చిలుముల విఠల్‌రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. 1999, 2004లో రెండు సార్లు విఠల్‌రెడ్డి మీద, 2009 ఆయన కుమారుడు కిషన్‌రెడ్డి మీద సునీతారెడ్డి విజయం సాధించారు. ఈసారి కూడా ఆమె గెలుపు ధీమాతోనే ఉన్నారు. కాగా నర్సాపూర్ సీటు తమకే ఇవ్వాలని సీపీఐ కోరటంతో కాంగ్రెస్ పార్టీ సునీతారెడ్డిని ఒప్పించే పనిలో పడ్డట్టు తెలిసింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆమెతో మాట్లాడినట్లు తెలిసింది. మెదక్ పార్లమెంటు నుంచి పోటీచేయాలని ఆయన సూచించగా... సునీతారెడ్డి నిరాకరించినట్లు తెలిసింది. పటాన్చెరు సీటు కూడా అడగాలని సీపీఐ జిల్లా నాయకత్వం కోరినప్పటికీ రాష్ట్ర నాయకులు అంతగా ఆసక్తి చూపనట్లు సమాచారం. పార్టీకి బలం లేని చోట సీటు కోరి ఓడిపోవడం ఎందుకని రాష్ట్ర నాయకులు అన్నట్లు సమాచారం. ఆత్మరక్షణలో సునీతారెడ్డి.. సొంత నియోజకవర్గం పొత్తుల పాలు కావడంతో సునీతారెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. ఒకవేళ సీటు తనకు దక్కకపోతే భవిష్యత్తు కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తమ పార్టీలోకి రావాలని ఇప్పటికే ఆమెకు టీఆర్ఎస్ ఆహ్వానం పంపినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే. ఆమె కూడా పార్టీ మారుతున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే సునీతారెడ్డి మాత్రం మీడియా ముందుకు వచ్చి తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఇంతలోనే అనూహ్యంగా సీపీఐతో పొత్తులు తెరమీదకు రావడం, వాళ్లు నర్సాపూర్ కోసమే పట్టుబట్టడంతో మళ్లీ ఆమె ఆత్మరక్షణలో పడ్డారు. -
ముగిసిన ఏఐసీసీ పరిశీలన
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుల మూడు రోజుల పర్యటన ముగిసింది. చివరిరోజైన ఆదివారం ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌తో సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి సునీతారెడ్డి, ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఏఐసీసీ పరిశీలకుడిని కలుసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విప్ జయప్రకాశ్‌రెడ్డి కోరగా జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యే అయిన తనకు మారో మారు పటాన్చెరు నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కోరారు. మరోవైపు పటాన్చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ పరిశీలకున్ని కలిశారు. ఇదిలాఉండగా.. డిప్యూటీ సీఎం సతీమణి పద్మినీదామోదర ఏఐసీసీ పరిశీలకుడిని కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావించారు. అయితే పద్మినీ దామోదర కానీ, ఆమె మద్దతుదారులు కానీ ఏఐసీసీ పరిశీలకుడిని కలవలేదు. దీంతో ఆమె సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడినట్టేనని పలువురు భావిస్తున్నారు. పార్టీ పరిస్థితి ఆరా మంత్రి సునీతారెడ్డి తన మద్దతుదారులతో ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌ను కలిశారు. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు తమ నియోజకవర్గం నుంచి సునీతారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాల్సిందిగా కోరారు. మంత్రి సునీతారెడ్డితో భేటీ అయిన ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీసినట్టు సమాచారం. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందని బస్వరాజ్‌పాటిల్ అడుగగా డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీకి లాభిస్తుందని మంత్రి సూచించినట్టు తెలిసింది. విప్ మద్దతుదారుల హల్చల్ విప్ జయప్రకాశ్‌రెడ్డి మద్దతుదారులు హల్చల్ చేశారు. తోపాజీ అనంతకిషన్, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, బొంగుల రవి, గోవర్ధన్‌నాయక్, షేక్‌సాబేర్, మండల పార్టీ అధ్యక్షులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి స్థానం నుంచి జయప్రకాశ్‌రెడ్డికి మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఇదిలా ఉంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజయ్య సంగారెడ్డి నుంచి టికెట్ కోరేందుకు ఏఐసీసీ పరిశీలకుడిని కలిసేందుకు ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చారు. అయితే విషయం తెలుసుకున్న విప్ జయప్రకాశ్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డితో కలిసి రాజయ్యను కలిసినట్లు సమాచారం. విరమించుకోవాలని రాజయ్యకు నచ్చజెప్పినట్లు తెలిసింది. పటాన్చెరు టికెట్ కోసం పోటీ పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తోపాటు పలువురు నాయకులు పరిశీలకుడిని కలిశారు. మరోమారు అవకాశం ఇవ్వాలని నందీశ్వర్‌గౌడ్ కోరగా డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, మరికొం దరు మద్దతుతెలిపినట్టు సమాచారం. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆదర్శ్‌రెడ్డి యూత్‌కాంగ్రెస్ కోటాలో తనకు పటాన్చెరు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. కార్పొరేటర్ పుష్పనగేశ్ యాద వ్ కాంగ్రెస్ నాయకులు శంకర్‌యాదవ్, బాల్‌రెడ్డి, డోకూరి రామ్మోహన్‌రెడ్డి, బాశెట్టి అశోక్‌లు టికెట్ కోసం పోటీపడ్డారు. -
ఇదేం ‘వసతి’
అదొక శారీరక వికలాంగుల బాలుర వసతి గృహం. దీనిని జిల్లా స్థాయిలో గత జూన్ 28న నర్సాపూర్‌లో ప్రారంభించారు. వంద మంది వికలాంగ విద్యార్థులకు వసతి కల్పించాలన్న సంకల్పంతో ఈ గృహాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఇద్దరే వికలాంగ బోర్డర్లు అందులో చేరారు. చేరిన 15 రోజులకే వారూ వెళ్లిపోయారు. అదేమని ఆరా తీస్తే వసతి గృహానికి పాఠశాల చాలా దూరంగా ఉండటమే.. ఇలా జూలై మొదటి వారం నుంచి వసతి గృహంలో బోర్డర్లు లేక వెలవెలపోతోంది. నర్సాపూర్, న్యూస్‌లైన్: వికలాంగ వసతి గృహం.. ప్రభుత్వ బాలుర పాఠశాలకు చాలా దూరంలో ఉండడం తో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవు తున్నం దున వికలాంగ విద్యార్థులు అందులో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. వసతి గృహం ప్రభుత్వ పాఠశాలలకు దగ్గరలో ఉంటే వారు పాఠశాలకు వెళ్లి వచ్చేందుకు అనుకూలంగా ఉండేది. పాఠశాలకు దూరంగా ఉండడంతో వెళ్లడం రావడం కష్టమై ఉన్న ఇద్దరు విద్యార్థులూ తమ ఇంటికి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా మరి కొంత మంది బోర్డర్లు వచ్చే అవకాశాలున్నా హాస్టల్ పాఠశాలలకు దూరంగా ఉందన్న కారణంతో ఎవరూ రావడం లేదని తెలిసింది. ఇప్పటికైన పాఠశాలలకు దగ్గర్లో హాస్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నెలసరి వ్యయం యథాతథం జిల్లాస్థాయి వికలాంగ హాస్టల్లో ఒక్క బోర్డరు లేకపోయినా ప్రైవేటు భవనం కావడంతో నెలనెలా వేల రూపాయలు అద్దెను ప్రభుత్వం చెల్లిస్తోంది. అంతేగాక వాచ్‌మన్‌తో పాటు మ్యాట్రిన్‌కు జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వానికి వేల రూపాయల వ్యయం అవుతున్నా పాఠశాలకు దగ్గరలోకి హాస్టల్‌ను మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఐదు నెలలైనా ప్రారంభంకాని పనులు నర్సాపూర్‌లో శారీరక వికలాంగుల వసతి గృహం నిర్మించేందుకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. మంత్రి సునీతారెడ్డి గత జూలై 1న హాస్టల్ భవన నిర్మాణానికి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పక్కన గల ఖాళీ స్థలంలో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఐదు నెలలు దాటినా నిర్మాణ పనులు చేపట్టలేదు. భవనాన్ని సకాలంలో నిర్మిస్తే వికలాంగ విద్యార్థులకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి నెలనెలా అనవసర వ్యయం మిగులుతుంది. త్వరలో మారుస్తాం: పాఠశాలకు దూరంగా వికలాంగ హాస్టల్ ఉన్నందున పిల్లలు రావడం లేదని జిల్లా వికలాంగ సంక్షేమ విభాగం ఏడీ లక్ష్మణ్‌చారి చెప్పారు. పాఠశాలకు దగ్గరలో ఉన్న భవనంలోకి త్వరలో మారుస్తామన్నారు. కొత్త భవనం నిర్మాణ పనుల టెండర్లు పూర్తయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త భవనం పూర్తి కాగలదని ఆయన తెలిపారు.