ముగిసిన ఏఐసీసీ పరిశీలన | AICC observation ended | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏఐసీసీ పరిశీలన

Published Sun, Jan 12 2014 11:56 PM | Last Updated on Fri, Aug 17 2018 6:00 PM

సునీతారెడ్డి - Sakshi

సునీతారెడ్డి

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఏఐసీసీ పరిశీలకుల మూడు రోజుల పర్యటన ముగిసింది. చివరిరోజైన ఆదివారం ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌తో సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి సునీతారెడ్డి, ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఏఐసీసీ పరిశీలకుడిని కలుసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విప్ జయప్రకాశ్‌రెడ్డి కోరగా జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యే అయిన తనకు మారో మారు పటాన్‌చెరు నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కోరారు.

మరోవైపు పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ పరిశీలకున్ని కలిశారు.  ఇదిలాఉండగా.. డిప్యూటీ సీఎం సతీమణి పద్మినీదామోదర ఏఐసీసీ పరిశీలకుడిని కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు  భావించారు. అయితే పద్మినీ దామోదర కానీ, ఆమె మద్దతుదారులు కానీ ఏఐసీసీ పరిశీలకుడిని కలవలేదు. దీంతో ఆమె సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడినట్టేనని పలువురు భావిస్తున్నారు.  

 పార్టీ పరిస్థితి ఆరా
 మంత్రి సునీతారెడ్డి తన మద్దతుదారులతో ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌ను కలిశారు. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు తమ నియోజకవర్గం నుంచి సునీతారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాల్సిందిగా కోరారు. మంత్రి సునీతారెడ్డితో భేటీ అయిన ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీసినట్టు సమాచారం. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందని  బస్వరాజ్‌పాటిల్ అడుగగా డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీకి లాభిస్తుందని మంత్రి సూచించినట్టు తెలిసింది.

 విప్ మద్దతుదారుల హల్‌చల్
 విప్ జయప్రకాశ్‌రెడ్డి మద్దతుదారులు హల్‌చల్ చేశారు. తోపాజీ అనంతకిషన్, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, బొంగుల రవి, గోవర్ధన్‌నాయక్, షేక్‌సాబేర్, మండల పార్టీ అధ్యక్షులతో కలిసి  ఏఐసీసీ పరిశీలకుడిని కలిశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి స్థానం నుంచి జయప్రకాశ్‌రెడ్డికి మరోమారు  అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఇదిలా ఉంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజయ్య సంగారెడ్డి నుంచి టికెట్ కోరేందుకు ఏఐసీసీ పరిశీలకుడిని కలిసేందుకు ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చారు. అయితే విషయం తెలుసుకున్న విప్ జయప్రకాశ్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డితో కలిసి రాజయ్యను కలిసినట్లు సమాచారం. విరమించుకోవాలని రాజయ్యకు నచ్చజెప్పినట్లు తెలిసింది.

 పటాన్‌చెరు టికెట్  కోసం పోటీ
 పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తోపాటు పలువురు నాయకులు పరిశీలకుడిని కలిశారు. మరోమారు అవకాశం ఇవ్వాలని నందీశ్వర్‌గౌడ్ కోరగా డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, మరికొం దరు మద్దతుతెలిపినట్టు సమాచారం. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆదర్శ్‌రెడ్డి యూత్‌కాంగ్రెస్ కోటాలో తనకు పటాన్‌చెరు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు.  కార్పొరేటర్ పుష్పనగేశ్ యాద వ్ కాంగ్రెస్ నాయకులు శంకర్‌యాదవ్, బాల్‌రెడ్డి, డోకూరి రామ్మోహన్‌రెడ్డి, బాశెట్టి అశోక్‌లు టికెట్ కోసం పోటీపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement