
హైదరాబాద్: 14 ఏళ్లుగా తమ కుటుంబంలో ఒకటిగా మెలిగి తమకు ఎన్నో ఆనందాలు పంచిన పెంపుడు కుక్క మృతితో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12 కమాన్‌లో నివసించే మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఇంట్లో పెంపుడు శునకం బ్రూనో మృతి చెందింది. దీంతో ఇంటిల్లిపాది తల్లడిల్లిపోయారు.
తమ ఇంట్లో ఒకరిగా మెలిగిన బ్రూనో మృతి మహేందర్ రెడ్డి సతీమణి, జెడ్పీ చైర్మన్ పట్నం సునీతారెడ్డిని తీవ్రంగా కలచివేసింది. తాను బ్రూనో మృతితో తీవ్ర మనోవేదనకు గురైన విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. తమ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన అంత్యక్రియలను ఫొటోలను షేర్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment