శివ్వంపేట, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవిని హస్తగతం చేసుకుంటామని మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా మండల పరిధి దొంతి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఆమె పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన మాజీ మంత్రి ప్రత్యేక పూజల అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
దొంతి, గుండ్లపల్లి, కొంతాన్‌పల్లి, దంతాన్‌పల్లి, పోతులబోగూడ, పాంబండ, ఉసిరికపల్లి, చెంది, గంగాయిపల్లి, శేభాష్‌పల్లి గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వే యాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని, పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సందర్భంగా కొంతాన్‌పల్లి పంచాయతీ టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఉప సర్పంచ్ కొండల్‌రావు ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు.
జెడ్పీ పీఠం కాంగ్రెస్‌దే
Published Thu, Mar 27 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement