సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఓ లాడ్జిలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సెల్లార్‌లో ఈ-బైకులు పేలి.. ఆ అగ్నిప్రమాదంతో అదే కాంప్లెక్స్‌లోని లాడ్జిలో బస చేసిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్(ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ.2 లక్షలు, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఓ ట్వీట్ చేసింది.
Saddened by the loss of lives due to a fire in Secunderabad, Telangana. Condolences to the bereaved families. May the injured recover soon. Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each deceased. Rs. 50,000 would be paid to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 13, 2022
Comments
Please login to add a commentAdd a comment