సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో తెల్లారిపోతుందనగా వారి జీవితాలు తెల్లారిపోయాయి. పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చిన కార్మికుల బతుకుల బుగ్గిపాలైంది. బోయిగూడ స్క్రాప్ గోడౌన్ అగ్ని ప్రమాదం పెను నగరంలో విషాదాన్ని నింపింది. అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
కాగా బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుందది. భారీగా మంటలు చెలరేగడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో గోడౌన్ పైకప్పు కూలింది. ఈ ఘటనలో బీహార్ చెందిన 11మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
హైదరాబాద్లోని భోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వబడుతుంది: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 23, 2022
Comments
Please login to add a commentAdd a comment