ఆ విషయం చెప్పాల్సిందే.. ప్రధానికి పోస్టుకార్డు ఉద్యమం | Hyderabad: Tpcc Leaders Write Letter To Pm Modi Over Adani Assets | Sakshi
Sakshi News home page

ఆ విషయం చెప్పాల్సిందే.. ప్రధానికి పోస్టుకార్డు ఉద్యమం

Published Tue, Apr 4 2023 10:07 AM | Last Updated on Tue, Apr 4 2023 11:34 AM

Hyderabad: Tpcc Leaders Write Letter To Pm Modi Over Adani Assets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సంపన్నుల జాబితాలో 609వ స్థానంలో ఉన్న వ్యక్తి ఎనిమిదేళ్లలో రెండో స్థానా­నికి ఎలా రావచ్చనే ఫార్ములా ఏంటో తమకూ చెప్పాలని టీపీసీసీ నేతలు ప్రధాని మోదీని కోరా రు. తమ పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి ఈ ప్రశ్నలను పార్లమెంటులో అడిగేందుకు అవకాశమివ్వాల­ని, దేశంలో ఓటర్లయిన తమకైనా బదులివ్వాలంటూ సోమవారం ఆయనకు లేఖ రాశా­రు. 

అదానీ స్కాంపై జేపీసీ ఏర్పాటు చేయా­లన్న డిమాండ్‌తో టీపీసీసీ చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమాన్ని సోమవారం గాంధీభవన్‌లో ప్రారంభించారు. ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌జావెద్, ఎమ్మె­ల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్, అను­బంధ సంఘాల అధ్యక్షులు శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్, నాగరిగారి ప్రీతం, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్‌ యాదవ్‌తోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement