కరుణానిధి మృతిపై బాలయ్య స్పందన | Balakrishna Condolence on Karunanidhi Demise | Sakshi
Sakshi News home page

Aug 8 2018 12:37 PM | Updated on Aug 29 2018 1:59 PM

Balakrishna Condolence on  Karunanidhi Demise - Sakshi

సుదీర్ఘ రాజకీయనుభవం ఉన్న మహానుభావుడు...

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ దిగ్గజం, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణంపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. కరుణానిధి మృతి రాజకీయాలకు మాత్రమే కాకుండా.. చిత్రసీమకూ కూడా తీరని లోటని పేర్కొన్నారు. ఓ అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిది’ అని విచారం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ తెలియజేయజేశారు. మరోవైపు మోహన్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ తదితర టాలీవుడ్‌ ప్రముఖులు కూడా కరుణానిధి మృతిపై సంతాపం తెలియజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement