ప్రముఖ బ్రిటిష్ ఆటోమొబైల్ దిగ్గజం మోరిస్‌గ్యారేజ్ భారత్ మార్కెట్లలోకి ఎమ్‌జీ ఆస్టర్‌ను అక్టోబర్ 11న లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్‌జీ ఆస్టర్ కార్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ ప్రీ బుకింగ్స్ నేడు (అక్టోబర్ 21) ప్రారంభమయ్యాయి. ప్రి బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఎమ్‌జీ ఆస్టర్‌ను కొనుగోలుదారులు ఎగబడి కొన్నారు. బుకింగ్స్ ఒపెన్ చేసిన 20 నిమిషాల్లో 5 వేల ఎమ్‌జీ ఆస్టర్ హాట్‌కేకుల్లా అమ్ముడైనాయి. ఈ కార్లను వచ్చే నెల నవంబర్‌లో డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రి బుకింగ్స్ సమయంలో కొనుగోలుదారులు రూ. 25 వేలను చెల్లించారు. ఈ ఏడాదిగాను 5 వేల ఎమ్‌జీ ఆస్టర్ కార్లను కంపెనీ ప్రి-బుకింగ్స్‌ను ఉంచింది. ఈ ఏడాదిగాను ఎమ్‌జీ ఆస్టర్ కార్ సేల్స్ పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎమ్‌జీ ఆస్టర్‌ను కొనాలంటే వచ్చే ఏడాది వరకు నిరీక్షించాల్సిందే. ఎమ్‌జీ ఆస్టర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ 9.78 లక్షల నుంచి రూ. 17.38 లక్షలకు అందుబాటులో ఉంది.
భారత తొలి ఏఐ పవర్డ్ కార్..!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారుగా ఎమ్‌జీ ఆస్టర్ నిలవనున్నట్లు తెలుస్తోంది. కారు ఇంటిరియర్స్‌లో భాగంగా 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఈ కారు జియో ఈ-సిమ్‌తో కనెక్టింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. కారులో ఏర్పాటుచేసిన ఏఐ ఆధారిత రోబోట్ వ్యక్తిగత సహాయకుడిగా వినియోగదారుడికి వాయిస్ ఆదేశాలతో సమాధానమిస్తుంది. వికీపీడియా, జోక్స్, న్యూస్, ఎమోజి, చిట్-చాట్, ఫెస్విల్లే గిఫ్ట్, నావిగేషన్, మ్యూజిక్ సెలెక్ట్, వంటి ఫీచర్‌లు కారులో ఉన్నాయి.
ఎమ్‌జీ గ్లోస్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీలోని అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్(ఎడీఎఎస్) తో రానుంది. ఎమ్‌జీ ఆస్టర్‌లో లేన్ చేంజ్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌లను, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, వంటి భద్రతా ఫీచర్‌లు కూడా ఉన్నాయి.
MG ఆస్టర్ ఇంజన్ విషయానికి వస్తే
రెండు పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ఆప్షన్లతో రానుంది. మొదటి వేరియంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 110 హెచ్‌పీ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే ఆటో, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది. రెండో వేరియంట్ 1.3లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 140 హెచ్‌పీ సామర్థ్యంతో 220 టార్క్‌ను ఉత్పతి చేస్తోంది. ఈ వేరియంట్‌లో 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్ అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment