ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలతో సమానంగా ఎన్‌ఎఫ్‌టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్)పై భారీ ఆదరణ లభిస్తోంది. నాన్ ఫంజిబుల్ టోకెన్స్‌ను ఆదరించే వాటిలో ప్రముఖ దిగ్గజ కంపెనీలు కూడా చేరాయి. ఇప్పటికే పెప్సీ, టాకో బెల్, బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్ వంటి కంపెనీలు తమ ప్రత్యేక ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్లను తీసుకువచ్చాయి. తాజాగా వీటి సరసన బ్రిటన్ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్స్ కూడా చేరింది.
మొట్టమొదటి కంపెనీగా ఎంజీ మోటార్స్..!
ఎంజీ మోటార్స్ భారత్‌లో నాన్-ఫంజిబుల్ టోకెన్ల సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత ఆటోమొబైల్ సెక్టార్‌లో ఎన్‌ఎఫ్‌టీలను పరిచయం చేసిన మొట్టమొదటి కంపెనీగా ఎంజీ మోటార్స్ నిలవనుంది. సుమారు 1,111 యూనిట్ల డిజిటల్ క్రియేటివ్ ఎన్‌ఎఫ్‌టీలను ఎంజీ మోటార్స్ విడుదల చేయనుంది. డిసెంబర్ 28 నుంచి ఎంజీ మోటార్స్ ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఎన్‌ఎఫ్‌టీ అమ్మకాల కోసం KoineArthకు చెందిన NgageN ప్లాట్‌ఫారమ్ ఎంజీమోటార్స్ కలిసి పనిచేయనుంది. ఈ ఎన్‌ఎఫ్‌టీలు ఫోటోస్, గిఫ్, స్టాటిక్ ఇమేజ్స్ రూపంలో ఉండనున్నాయి.
చదవండి: ఎన్‌ఎఫ్‌టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే..
నాలుగు రకాలైన ఎన్‌ఎఫ్‌టీలు..!
1111 యూనిట్ల డిజిటల్ క్రియేటివ్ ఎన్‌ఎఫ్‌టీలను ఎంజీ మోటార్స్ 4 "C" విభాగాలుగా విభజించింది. కలెక్టబుల్స్, కమ్యూనిటీ అండ్ డైవర్సిటీ, కోల్బరేటివ్ ఆర్ట్, కార్ యాజ్ ఏ ప్లాట్ ఫాం ఎన్‌ఎఫ్‌టీలుగా విభజించిన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
విరాళంగా బాలికల కోసం..!
ఈ ఎన్‌ఎఫ్‌టీలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బాలికల విద్య కోసం ఖర్చు చేస్తామని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా రేషన్, వైద్య సహాయాన్ని అందించనుంది.
గత త్రైమాసికంతో పోలిస్తే 8 రెట్లు అధికం..!
ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్స్ గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. 2021 మూడో త్రైమాసికంలో ఎన్‌ఎఫ్‌టీల అమ్మకాల పరిమాణం గత త్రైమాసికంతో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగింది. సుమారు 10.7 బిలియన్ డాలర్లకు(రూ. 79,820 కోట్లు) చేరిందని ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్ ట్రాకర్ DappRadar ఒక నివేదికలో వెల్లడించింది.
చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! అది కూడా మన కోసమే..
Comments
Please login to add a commentAdd a comment