ఉక్రెయిన్-రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో, చాలా మంది పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్న్యాయంగా లభిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా కూడా ఈ-వాహనాలకు భారీగానే డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రముఖ ఆటో-మొబైల్ తయారీ సంస్థ ఎంజి మోటార్స్ త్వరలోనే ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్దం అవుతుంది. మన దేశంలో కూడా త్వరలో లాంచ్ చేయనున్నారు. దీని ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఎంజి మోటార్స్ చైనాకు చెందిన వులింగ్ గ్లోబల్ కంపెనీతో కలిసి ఈ కారును విడుదల చేయనుంది. ఎంజి నుంచి వస్తున్న ఈ కారుకి రెండు డోర్స్ మాత్రమే ఉండనున్నాయి. ఇది చూడటానికి వులింగ్ కంపెనీక చెందిన హాంగ్ గ్వాంగ్ మీని(Hongguang Mini EV) కారు లాగా ఉండనుంది. ఈ వాహనంలో 20కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. చైనాలో ఇలాంటి అత్యంత ప్రజాదరణ లభిస్తుంది. అందుకే, బ్రిటిష్ తయారీదారు ఎంజి మోటార్స్ అలాంటి ఒక వాహనాన్ని మన దేశంలో విడుదల చేయలని నిర్ణయించుకుంటోంది. దీనిని 2023 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా టాటా టిగోర్ ఈవీ ఉంది. దీని ధర రూ.11.99 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment