
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కైవసం చేసుకుంటాయని భావిస్తోంది. ఈవీ విభాగంలో కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనుండడం ఇందుకు కారణమని ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ ఎండీ గౌరవ్ గుప్తా తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 10,000 పైచిలుకు ఈవీలు విక్రయించామని వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా 2023 జనవరి–జూన్‌లో 20.62 శాతం వృద్ధితో మొత్తం 29,040 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో ఈ సంఖ్య 48,063 యూనిట్లు నమోదైంది’ అని వివరించారు.
కొత్త వేరియంట్ ఫీచర్లు ఇవే..
జడ్‌ఎస్ ఈవీ టాప్ ఎండ్ వేరియంట్ అటానమస్ లెవెల్–2తో (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) రూపుదిద్దుకుంది. ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వార్డ్ కొలిషన్ వారి్నంగ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ అలర్ట్స్, లేన్ ఫంక్షన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి 17 రకాల ఫీచర్లను జోడించారు. ఇందులోని 176 పీఎస్ పవర్‌తో కూడిన 50.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 461 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పరిమిత కాల ఆఫర్‌లో ఎక్స్‌షోరూం ధర రూ.27.89 లక్షలు ఉంది. కంపెనీ నుంచి రెండవ ఈవీ అయిన కామెట్ ఎక్స్‌షోరూం ధర రూ.7.98 లక్షలు పలుకుతోంది. భారత్‌లో ఇదే చవకైన ఈవీ.
Comments
Please login to add a commentAdd a comment