Gaurav Gupta
-
తళుక్కుమని మెరిసిపోతున్న కృతి శెట్టి (ఫోటోలు)
-
అమ్మకాల్లో పావు వంతు ఈవీలే
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కైవసం చేసుకుంటాయని భావిస్తోంది. ఈవీ విభాగంలో కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనుండడం ఇందుకు కారణమని ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ ఎండీ గౌరవ్ గుప్తా తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 10,000 పైచిలుకు ఈవీలు విక్రయించామని వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా 2023 జనవరి–జూన్‌లో 20.62 శాతం వృద్ధితో మొత్తం 29,040 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో ఈ సంఖ్య 48,063 యూనిట్లు నమోదైంది’ అని వివరించారు. కొత్త వేరియంట్ ఫీచర్లు ఇవే.. జడ్ఎస్ ఈవీ టాప్ ఎండ్ వేరియంట్ అటానమస్ లెవెల్–2తో (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) రూపుదిద్దుకుంది. ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వార్డ్ కొలిషన్ వారి్నంగ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ అలర్ట్స్, లేన్ ఫంక్షన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి 17 రకాల ఫీచర్లను జోడించారు. ఇందులోని 176 పీఎస్ పవర్‌తో కూడిన 50.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 461 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పరిమిత కాల ఆఫర్లో ఎక్స్‌షోరూం ధర రూ.27.89 లక్షలు ఉంది. కంపెనీ నుంచి రెండవ ఈవీ అయిన కామెట్ ఎక్స్‌షోరూం ధర రూ.7.98 లక్షలు పలుకుతోంది. భారత్‌లో ఇదే చవకైన ఈవీ. -
Zomato: జొమాటోలో అనూహ్య పరిణామాలు
Gaurav Gupta Quit Zomato: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, జొమాటో కీలక వ్యవహారాలన్నీ చూసుకునే గౌరవ్ గుప్తా(38).. కంపెనీని వీడినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా హౌజ్‌లలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ పరిణామంతో జొమాటో షేర్లు స్వల్ఫంగా పతనం అయ్యాయి. ఫుడ్ టెక్ ప్లాట్‌ఫామ్ అయిన జొమాటోలో కీలక నిర్ణయాల నుంచి, ఐపీవోకి వెళ్లడం, ఇన్వెస్టర్లతో చర్చలు, మీడియాతో ఇంటెరాక్షన్ లాంటి వ్యవహారాలన్నీ గౌరవ్ గుప్తానే ఇంతకాలం చూసుకున్నారు. ఇదిలా ఉంటే జొమాటో ఐపీవో వెళ్లిన రెండు నెలల తర్వాత.. నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలోనే గౌరవ్ బయటకు వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Zomato IPO.. సినిమా చూపిస్తారంట! కాగా, గౌరవ్ జొమాటో నుంచి బయటకు వచ్చేయడం వెనుక కారణాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మంగళవారం జొమాటోలో ఆయన ఆఖరి వర్కింగ్ డేగా తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా ఆయన ఉద్యోగుల్ని ఉద్దేశించి మెయిల్ పెట్టినట్లు సమాచారం. ఆరేళ్ల జొమాటోతో తన ప్రయాణం ముగిసిందని, ఇంక కొత్త జర్నీ ఆరంభించబోతున్నట్లు ఆయన పేరు మీద ఒక ప్రకటన వైరల్ అవుతోంది. నిత్యావసర సరుకుల డెలివరీ, న్యూట్రాస్యూటికల్ వ్యాపారం రెండూ గౌరవ్ ఐడియాలే. పైగా ఓవర్సీస్లో జొమాటో విస్తరణ కూడా ఆయన అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే గుప్తా.. 2015లో జొమాటోలో చేరగా.. 2018 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా వ్యవహరిస్తుండగా.. 2019లో ఆయనకు జొమాటో ఫౌండర్ హోదా దక్కింది. జొమాటో నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో సొంతంగా మరేదైనా స్టార్టప్ ప్రారంభిస్తారా? అనే చర్చ అప్పుడే మొదలైంది. చదవండి: జొమాటో ప్రస్థానం.. ఇలా మొదలైంది! -
మీరు చూసింది ట్రైలరే, నేను ఏకంగా సినిమా చూపిస్తా
న్యూఢిల్లీ: రూ. 9,375 కోట్ల సేకరించే లక్క్ష్యంతో ప్రారంభమైన జొమాటో ఐపీవోలో రికార్డ్ స్థాయిల్ని క్రియేట్ చేస్తోంది. అమెరికా, చైనాలో ఫుడ్ డెలివరీ సంస్థ ఐపీఓల కంటే భారత్ కు చెందిన జొమాటో ఐపీఓ మార్కెట్లో సత్తా చాటుతోంది. జొమాటో ఇష్యూ ప్రైస్‌బాండ్ ఒక్కో షేరుకు రూ.72-76గా నిర్ణయిస్తూ రంగంలోకి దిగిన జొమాటోకి ఇన్వెస్టర్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. బీఎస్ఈ లెక్కల ప్రకారం జొమాటో ఐపీవో రెండో రోజు ఇప్పటి వరకు ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ 98శాతం సబ్ స్క్రిప్షన్ (నమోదు) , నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 13శాతం, వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు.3.62 శాతం, ఉద్యోగులు 18శాతం మంది సబ్ స్క్రిప్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో జొమాటో ప్రతినిథులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఓ ప్రారంభానికి ముందే సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఐపీవో ఒత్తిడిలో మూడు సార్లు బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేశానంటూ గోయల్ ట్వీట్ చేయడం వ్యాపార దిగ్గజాలు స్పందిస్తూ తమదైన స్టైల్లో గోయల్‌కి అభినందనలు చెప్పారు. గోయల్‌కు అభినందనలు వెల్లువెత్తుతుంటే జొమాటో కో ఫౌండర్ గౌరవ్ గుప్తా అభి బాకి హై మేరీ దోస్త్ అంటూ "ఇప్పటి వరకు మీరు చూసి కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా చూపిస్తానంటూ ఓ టీవీ చర్చా వేదికలో డైలాగ్స్ పేల్చారు. ఆ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఐపీఓలో ఊహించని విధంగా జొమాటోకి విశేష స్పందన లభించడంతో ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలు సైతం ఐపీఓల దిశగా అడుగులు వేస్తున్నాయి. మరి అవి ఏమేరకు ఫలితాల్ని సాధిస్తాయో వేచి చూడాల్సి ఉంది. చదవండి: వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది -
లోన్ కావాలా నాయనా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణం విషయంలో సిబిల్ స్కోర్, బ్యాంక్ బ్యాలెన్స్, స్టేట్మెంట్ ప్రతి ఒక్కటీ కౌంట్ అవుతుంది. అందుకే వ్యాపారస్తులు, పెద్దలకు వచ్చినంత సులువుగా సామాన్యులకు, ఎస్ఎంఈలకు రుణాలు రావు. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది గుర్గావ్కు చెందిన మైలోన్‌కేర్.ఇన్. దేశంలోని ప్రముఖ బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందం చేసుకొని గృహ, బంగారు, వ్యాపార వంటి అన్ని రకాల రుణాలను అందిస్తుంది. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ గౌరవ్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. వడ్డీ రేట్లు 8.65 శాతం నుంచి.. ‘‘ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, బజాజ్ ఫిన్సర్వ్, మణప్పురం, టాటా క్యాపిటల్ వంటి 24 బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వడ్డీ రేట్లు లోన్‌ను బట్టి 8.65 శాతం నుంచి 13.50 శాతం వరకున్నాయి. గృహ, వ్యక్తిగత, బంగారు, ప్రాపర్టీ, వ్యాపారం వంటి అన్ని రకాల రుణాలతో పాటూ ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్స్ క్రెడిట్ కార్డులను కూడా అందిస్తాం. రూ.5 వేల నుంచి రూ.25 కోట్ల వరకు రుణాలుంటాయి. ప్రస్తుతం 25 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 శాతం మంది ఉంటారు. ఈ ఏడాది రూ. 2,500 కోట్ల రుణాల లక్ష్యం.. కస్టమర్లు మైలోన్‌కేర్‌లో లాగిన్ అయి కావాల్సిన రుణ విభాగాన్ని ఎంచుకొని వ్యక్తిగత వివరాలు, రుణ అవసరాలను తెలిపితే.. ఆల్గరిథం ద్వారా కస్టమర్లకు 2–3 రకాల బ్యాంక్ రుణ అప్షన్లను ఇస్తుంది. వడ్డీ రేటు, కాలపరిమితిని బట్టి కస్టమర్ తనకు కావాల్సింది ఎంచుకోవచ్చు. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.1000 కోట్ల రుణాలను అందించాం. ఈ ఏడాది రూ.2,500 కోట్ల రుణాలను అందించాలని లక్షి్యంచాం. ప్రస్తుతం నెలకు లక్ష ఎంక్వైరీలు వస్తున్నాయి. రుణాన్ని బట్టి 0.5 నుంచి 3 శాతం వరకు కమీషన్, మార్కెటింగ్ ఫీజు ఉంటుంది. ప్రతి ఏటా 40 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది 150 శాతాన్ని లక్షి్యంచాం. మా మొత్తం ఆదాయంలో 17 శాతం తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నదే. ఎంఎఫ్, ట్యాక్స్ ప్లానింగ్‌లోకి.. ప్రస్తుతం మా కంపెనీలో 150 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేస్తాం. సేల్స్, టెక్నాలజీ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.8 కోట్ల నిధులను సమీకరించాం. ఎన్‌క్యుబేట్ క్యాపిటల్ వెంచర్, ఎస్ఏఆర్ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టాయి. ‘‘త్వరలోనే డిజిటల్ క్రెడిట్ కార్డ్‌లు, యాప్ ఆధారిత పర్సనల్ లోన్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ ప్లానింగ్ విభాగాల్లోకి విస్తరిస్తామని’’ గౌరవ్ వివరించారు. -
భర్తపై గృహహింస కేసు పెట్టిన నటి
ముంబై: 'బిగ్‌బాస్-9' పోటీదారు, మోడల్, నటి మందనా కరిమీ భర్త గౌరవగుప్తాపై గృహహింస కేసు నమోదు చేసింది. వీరు గత జనవరి 25న పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలు తిరగకముందే వీరి మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. తన జీవనవ్యయానికిగాను భర్త గౌరవ్ ప్రతి నెలా రూ. 10 లక్షలు చెల్లించాలని, తనను మానసికంగా వేధించి క్షోభకు గురిచేసినందుకు, తన కెరీర్‌కు, బిజినెస్‌కు నష్టం కలిగించినందుకు రూ. 2 కోట్లు పరిహారం ఇవ్వాలని ఆమె అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి ముందు తనను హిందూమతంలోకి మారాల్సిందిగా భర్త గౌరవ్ ఒత్తిడి తెచ్చాడని, పెళ్లయిన తర్వాత నటనను వదిలిపెట్టాలని, ఆ వృత్తి సమాజంలో తమ కుటుంబ హోదాకు భంగం కలిగిస్తుందని చెప్పాడని ఇరాన్‌కు చెందిన ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అత్త కూడా తనను వేధించినట్టు ఆమె తెలిపారు. 'ఏడువారాల కిందట మా అత్తవారి ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టారు. వారితో రాజీ చేసుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా మా అత్తవాళ్లు నన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. గౌరవ్ కూడా నాతో సంబంధాలు తెంపుకున్నాడు' అని ఆమె మీడియాకు తెలిపింది. ఈ వ్యవహారాన్ని కోర్టు ఆదేశాల ప్రకారమే తేల్చుకుంటామని ఆమె లాయర్ చెప్పారు. ఈ విషయమై స్పందించడానికి గౌరవ్ గుప్తా పీఆర్ నిరాకరించారు. -
‘పాషాణం’ కరిగిన వేళ..
న్యూఢిల్లీ: ‘గౌరవ్ గుప్తా ఒక బ్యాంక్ ఉద్యోగి.. మధ్యాహ్నం ఒక ఎయిర్ కండిషనింగ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.. వెయిటర్ వచ్చి వినయంగా అభివాదం చేసి ఏంకావాలో ప్రశ్నించాడు.. ఆయన ‘తాలి’ ఆర్డర్ ఇచ్చారు.. పదినిమిషాల్లో రోటీ, అన్నం,రెండు కూరలు, చెట్నీ, పెరుగు తో కూడిన భోజనాన్ని వెయిటర్ తీసుకువచ్చి గుప్తా ముందుంచాడు..’ ఇదంతా చదవడానికి సాదాసీదాగా ఉందికదూ.. కాని ఆ వెయిటర్ ఎవరో తెలుసా.. తీహార్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న కరడుగట్టిన నేరస్తుడు..ఇప్పుడర్థమైందా ఆ హోటల్ ప్రత్యేకత.. ఇందులో క్లీనింగ్ నుంచి కుకింగ్ వరకూ అన్ని పనులూ ఖైదీలే నిర్వహిస్తున్నారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఖైదీలకు పునరావాసం కల్పించే దిశలో జైలు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ‘తీహార్ ఫుడ్ కోర్ట్’ను జూలై మొదటి వారంలో ప్రారంభించారు. ఇది తీహార్ జైలులోని ఖైదీల విడిదికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఈ హోటల్లో మొత్తం ఫర్నిచర్‌ను ఖైదీలో తయారుచేశారు. 50 మంది ఒకేసారి కూర్చోగలిగేంత విస్తీర్ణం ఉన్న ఈ హోటల్లో ఇంటీరియర్ డెకరేషన్ చూస్తే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే.. హోటల్‌కు వచ్చిన వినియోగదారులతో ఎలా మసులుకోవాలనే విషయమై వెయిటర్లకు జైలుకు దగ్గర్లోనే ఉన్న ఒక హోటల్ మేనేజమెంట్ స్కూల్ శిక్షణ ఇచ్చింది. ఇక్కడ ఎక్కువగా ఉత్తర భారత దేశానికి చెందిన ఆహారమే దొరుకుతుంది. రూ.150కు డీలక్స్ తాలి దొరుకుతుండగా, అతి చౌకగా సమోసాలు కేవలం రూ.10కు ఇక్కడ లభ్యమవుతాయి. ఈ హోటల్ మేనేజర్ మహమ్మద్ అసిమ్ మాట్లాడుతూ రోజూ ఇక్కడ 50 మంది వరకు వినియోగదారులు వస్తుంటారన్నారు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి రోజుకు రూ.74 లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి తమ హోటల్‌కు వచ్చి భోజనం చేసిన కస్టమర్ మళ్లీ భోజనానికి రావాల్సిందే..’ అంటూ అసిమ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ అసిమ్ ఒక హత్య కేసులో తీహార్ జైలులోనే 14 ఏళ్ల 6 నెలలపాటు శిక్షను అనుభవించాడు. కనీసం హైస్కూలు చదివి, 12 శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నవారెవరైనా ఈ హోటల్లో పనిచేసేందుకు అర్హులే. పారిపోవడానికి అంతగా ఆసక్తి చూపించరని ఇంకా రెండేళ్లలోపు శిక్షా కాలం ఉన్నవారికే ఈ హోటల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించారు. వారికి మరింత నమ్మకం కలిగించేందుకు ఎటువంటి ఎస్కార్ట్ లేకుండా జైలు నుంచి సైకిల్ పైనైనా, లేదా నడుచుకుంటూ హోటల్‌కు వెళ్లేందుకు జైలు అధికారులు ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా వీరి సేవలపై కస్టమర్ల అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ‘భోజనం మామూలుగానే ఉంది.. అయితే అక్కడ వెయిటర్ ప్రవర్తన, వారు కస్టమర్లకు ఇస్తున్న మర్యాద, పరిశుభ్రత నిర్వహణ చాలా బాగున్నాయి..’ అంటూ గుప్తా తన కామెంట్ రాశారు. ‘భోజనం చాలా బాగుంది.. హోటల్‌ను వంద శాతం శుభ్రంగా ఉంచారు.. వెయిటర్ మర్యాదకరంగా మెసలుకుంటున్నారు. మెనూలో మరిన్ని వెరైటీలు పెడితే ఇంకా బాగుంటుంది..’ అని భూమికా దాబాస్ తన వ్యాఖ్యలో పేర్కొన్నారు. లాభాపేక్షలేని ఈ హోటల్లో తాజ్ బ్రాండ్ భోజనాన్ని ఖైదీలు అందజేస్తున్నారని తీహార్ జైలు ప్రతినిధి సునీల్ గుప్తా తెలిపారు. ఈ జైలులో 13,552 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కరడుగట్టిన వారే. అధికశాతం జీవిత ఖైదును అనుభవిస్తున్నవారే. వీరిలో మానసిక పరివర్తన కలిగించేందుకు జైలు ప్రాంగణంలో పలు వృత్తినైపుణ్య కోర్సులు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నట్లు గుప్తా వివరించారు. జైలులో చేపడుతున్న సంస్కరణలు, వాటి ఫలాలను బయట ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటుచేసి అందులో ఖైదీలనే సిబ్బందిగా నియమించామని గుప్తా తెలిపారు. ఇటువంటి ప్రయోగం రెండేళ్లుగా కేరళలో చేపడుతున్నారని, అక్కడ మంచి ఫలితాలు సాధించడంతో తీహార్ జైలులో దాన్ని ఆచరిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ శిక్ష పూర్తయిన తర్వాత ఖైదీలు స్వయంగా ఉపాధిని పొందేందుకు వీలుగా ఈ శిక్షణ కార్యక్రమాలను చేపట్టామని ఆయన వివరించారు. ‘పలువురు ఖైదీలను దగ్గరగా గమనించిన అధికారులు, వారిలో మానసిక పరివర్తన సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే బయట ప్రపంచానికి దగ్గరగా తీసుకువచ్చేందుకు ఈ ప్రయోగం చేస్తున్నారని నాకనిపించింది.. ఏదేమైనా ఈ హోటల్లో పనిచేస్తోంది కరడుగట్టిన నేరస్తులేనా అని వారి ప్రవర్తన చూశాక మనకు అనిపించకమానదు.. అధికారులు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనిస్తుందనే ఆశిద్దాం..’ అంటూ ఈ హోటల్‌కు మొదటిసారి తినడానికి వచ్చిన అతుల్‌సింగ్ అనే వ్యక్తి వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఇందులో వెయిటర్‌గా పనిచేస్తున్న బాల్ కిషన్ గ్రోవర్ (49) మాట్లాడుతూ తాను క్షణికావేశంలో చేసిన హత్య కేసులో 13 యేళ్లుగాతీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నానని తెలిపాడు. ఇక్కడికి రాకముందు తాను ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడినని, విడుదలై వెళ్లిన తర్వాత తీహార్ రెస్టారెంట్‌కు అనుబంధంగా ఒక శాఖను ఏర్పాటుచేస్తానని ధీమాగా చెప్పాడు.