సాక్షి, అమరావతి: పేదల పొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నాడని.. ఈ క్రమంలోనే పచ్చ మీడియాతో పిచ్చి రాతలు రాయిస్తున్నాడని.. అయితే వాస్తవాలు బయటపడడంతో ఇప్పుడు ఆ నోళ్లు మూతలు పడుతున్నాయని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ..
పది లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఏపీని అప్పుల పాలు చేశారని పచ్చ బ్యాచ్ సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారానికి దిగింది. పచ్చ పార్టీకి.. పిచ్చి రాతలు రాసే వాళ్ల నోళ్లు మూతలుబడేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే టైంకి రూ. 2.64 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో రూ. 1,77,991 కోట్ల అప్పులు మాత్రమే చేశారని పార్లమెంట్ సాక్షిగా వెల్లడైంది. ఒక పనికిమాలిన ఎంపి వేసిన ప్రశ్నతో వాస్తవం బట్టబయలైంది. టిడిపి తప్పుడు ప్రచారాలకి ఇది చెంప పెట్టు అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
► సీఎం జగన్ నాలుగేళ్లుగా సంక్షేమపాలన అందిస్తున్నారు.. ప్రజాభిమానమూ పెరిగింది. ఆ ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక రాష్ట్రం అప్పులపాలయ్యిందని.. శ్రీలంకలా మారిందని గోబెల్స్ ప్రచారం చేశారు. పేదలపొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేశారు. కానీ, వాస్తవాలు బయటపడటంతో నోళ్లు మూతబడుతున్నాయి అని అన్నారాయన.
► విశాఖలో వృద్దురాలు హత్యపైనా ఈనాడు పత్రిక అబద్దాలు ప్రచురించింది. మొత్తం వలంటరీ వ్యవస్థకు ముడిపెట్టి లేనిపోని రాద్ధాంతం చేస్తోంది. పనితీరు సక్రమంగా లేదని తొలగించిన వ్యక్తిని ఇంకా వలంటీర్ అని ఎలా రాస్తారు. కేవలం పిచ్చి రాతల్లో భాగంగానే ఆ కథనం ప్రచురించింది అని మంత్రి మండిపడ్డారు.
► చంద్రబాబు మూడు టర్మ్‌లలో రూ.7.50 లక్షల కోట్లు ఏం చేశారు? మూడు సార్లు సీఎంగా పని చేసి సంక్షేమాన్ని ఎందుకు అందించలేకపోయారు?. మా ప్రభుత్వం నాలుగేళ్లలో నేరుగా ప్రజలకి అందించిన సంక్షేమమే 2.50 లక్షల కోట్లపైనే. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలకు ఆస్కార్ ఇవ్వొచ్చు. సీఎంగా ఉండి ఏనాడైనా పోలవరం పేరు ఎత్తాడా?. పోలవరానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుపడ్డాడని చంద్రబాబు ఎలా అంటారు?. అసలు వైఎస్సార్ హయాంలో పోలవరం పనులు ప్రారంభయ్యాయి. కుడి, ఎడమ కాలువలు పూర్తి చేశారు. కమీషన్ కోసం కుక్కుర్తి పడి పోలవరాన్ని నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టలేదా?. ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి వందల కోట్ల పనులు అప్పనంగా అప్పగించలేదా? అని నిలదీశారు.
► చంద్రబాబు దుర్మార్గుడు. చంద్రబాబు కొడుకు మాలోకం. అది యువగళమా.. విషగళమా?. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పెద్ద పదవులట!. టీడీపీ అధికారంమలోకి వస్తే కర్రలు ఇస్తాడట. ఇదీ రాబోయే కాలంలో వాళ్ల అజెండా. జోకర్ కొడుకు.. బ్రోకర్ తండ్రి అని పేర్కొన్నారాయన.
పవన్‌ని చూస్తే జాలేస్తోంది
చిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికి తెలుసు. కాపులని అనాదిగా తొక్కడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. రంగా హత్య నుంచి ముద్రగడ కుటుంబాన్ని వేధించే దాకా కాపులని అడుగడుగునా చంద్రబాబు కుట్ర ఉంది. అలాంటి చంద్రబాబు విష కౌగిలిలో పవన్ చిక్కకుపోయాడు. పవన్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారిపోయాడు. నా పార్టీ పెట్డిన ధ్యేయమే వైఎస్ జగన్ ని గద్దె దించడమే అని పవన్ అంటున్నాడు. పవన్ పై ప్రేమ ఉంటే ప్యాకేజ్ ఇవ్వలేదని ఏనాడైనా చంద్రబాబు చెప్పాడా?. అందుకే చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటపడాలి అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment