Goebbels campaign
-
‘చంద్రబాబూ.. ఇక జగన్నామ స్మరణ ఆపేయ్’
కాకినాడ, సాక్షి: అబద్ధపు ప్రచారాల్లో చంద్రబాబు గోబెల్స్‌కి తమ్ముడి వరుస. అబద్ధాలను మ్యానుఫ్యాక్చర్ చేయడంలో దిట్ట. వాటిని అమ్ముకోగలిగే కెపాసిటీ ఈ భూమ్మీద కేవలం ఒక్క చంద్రబాబుకే ఉంది అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏలేరు వరద ముంపు బాధిత గ్రామాల్లో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్మెంట్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలను ఇబ్బంది చేయడమే కాకుండా చంద్రబాబు ఇప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో వచ్చి ఇన్నిరోజులు గడిచినా.. తాను చేయాల్సిన పనులేవీ చేయలేదు. దానంతటికి కారణం జగనే అంటారు. ఎక్కడ ఏం జరిగినా.. జగన్ పేరే చెప్తారు.... చంద్రబాబూ.. ఇకనైనా జగన్నామం ఆపు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచింది. చేయాల్సిన దాని గురించి ఆలోచించు. నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో. ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సిన దాని మీద ధ్యాస పెట్టు అని చంద్రబాబుకి జగన్ హితవు పలికారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారాలకుఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లాంటి ఎల్లో మీడియా తోడైయ్యింది’’ అని జగన్ పేర్కొన్నారు. ఈ నాలుగు నెలల్లో..ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థనలనూ నాశనం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడం లేదు. పంటల బీమా ప్రీమియమ్ కూడా కట్టడం లేదు. వ్యవసాయ సీజన్ మొదలైంది. వారికి అందాల్సిన సున్నా వడ్డీ పంట రుణాలు ఏమయ్యాయి?. పెట్టుబడి సాయం రైతు భరోసా ఏమైంది? రూ.20 వేలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.ఇదీ చదవండి: చిల్లర రాజకీయమే చంద్రబాబు ముందున్న మార్గమా?గత మా ప్రభుత్వంలో.. రైతులకు పంట నష్టం జరిగితే, గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవి. ఆర్బీకేలు ఉండేవి. ఇన్సూరెన్స్ ఉండేది. ఇన్పుట్ సబ్సిడీ ఉండేది. రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని విధాలుగా ఆదుకునే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. గతంలో రైతులకు ఎంత వచ్చేది? ఒక్కసారి ఆలోచించండి.జగన్ ఇప్పుడు ఉండి ఉంటే.. ఇప్పుడే కనుక జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే.. రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది. సీజన్ ప్రారంభంతోనే సాయం చేసి ఉండేవాళ్లం. గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో అది కేవలం రూ.15 వేలు మాత్రమే. ప్రీమియం కట్టి ఉండే వాళ్లం కాబట్టి రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు బీమా పరిహారం వచ్చేది. దాంతో పాటు, పెట్టుబడి సాయం, సున్నా వడ్డీ కింద దాదాపు రూ.5 వేల వరకు.. అన్నీ కలిపి రైతులకు ప్రతి ఎకరాకు దాదాపు రూ.45 వేల వరకు సాయం అంది ఉండేది.కానీ, ఈ పెద్ద మనిషి(చంద్రబాబు) ఏం చెబుతున్నారు?. ఎకరాకు రూ.10 వేలు ఇస్తానన్నారు. ఎలా? ఈ–క్రాపింగ్ లేదు.. అడిటింగ్ లేదు. ఆర్బీకే వ్యవస్థ లేదు. ఇంకా ఇన్సూరెన్స్ గురించి చెప్పడం లేదు. బాబు హయాంలో కేవలం రూ. 3 వేల కోట్లే వచ్చింది. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,250 కోట్లు చెల్లించకపోవడంతో ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించలేదు. భరోసా గురించి నోరు మెదపరు. ఇన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా.. చంద్రబాబు మాత్రం నిజం మాట్లాడరు.చంద్రన్న మార్క్ మోసంచంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు. విద్యాదీవెన, గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. లా అండ్ఆర్డర్ గాలికొదిలేశారు. బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. వరద బాధితులకు కనీసం పునరావాసం కూడా కల్పించడం లేదు. వ్యవస్థలన్నీ అతలాకుతలంవైఎస్సార్సీపీ హయాంలో ప్రతీ ఒక్కటీ డోర్ డెలివరీ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఏది కావాలన్నా.. టీడీపీ నాయకులనే అడగాలి. ఆ నాయకులు ఇళ్లలోనే సచివాలయ సిబ్బంది పెన్షన్ పంచుతున్నారు. ఎవరైనా అలా వెళ్లి పెన్షన్ తీసుకోకపోతే, కట్ చేస్తున్నారు. ప్రభుత్వ పాలన గాలికి ఎగిరిపోయింది. రాష్ట్రం అతలాకుతలం అవుతోంది.ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయిచంద్రబాబు హయాంలో ఎవరూ తమ బాధ్యతలు నిర్వర్తించరు. ఇలాంటి దారుణ పాలన పోవాలి. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, మోసాల కింద మారుతున్నాయి. ప్రజలకు కోపం వస్తోంది. వారు తిరగబడే రోజులు దగ్గరే ఉన్నాయి. అది జరగకూడదని రెడ్‌బుక్ పాలన చేస్తున్నారు. అయినా ఏం చేయలేరు. ప్రజలు ఇంకా భరించే పరిస్థితి లేదు.ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలకు స్పందించడం లేదు. చంద్రబాబు ఎంతసేపూ డ్రామాలు చేస్తున్నారు. ఫొటోలకు ఫోజులు ఇస్తూ షోలు చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ సినిమా ఆర్టిస్ట్. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్. పవన్ కంటే బాబు బాగా నటిస్తున్నాడు. పవన్‌కు పెద్దగా ఏం తెలియడం లేదు’’ అని జగన్ అన్నారు. -
అదేనా మా తప్పు?: టీడీపీకి ఆర్కే రోజా సూటి ప్రశ్న
విశాఖపట్నం, సాక్షి: రుషికొండలో గత జగన్ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు.. అక్రమ కట్టడాలని ప్రచారం చేస్తున్న టీడీపీకి గట్టి ఎదురు దెబ్బలే తగులుతోంది. చంద్రబాబు మాదిరి జగన్ తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయలేదని.. ప్రజా ధనంతో పటిష్టమైన ప్రభుత్వ భవనాలే నిర్మించారని ఇటు వైఎస్సార్సీపీ, అటు నెటిజన్లు కౌంటర్లు ఇస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఈ అంశంపై స్పందించారు. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా.. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని టీడీపీ శ్రేణుల్ని గట్టిగా ప్రశ్నించారు. ‘‘విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా?. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా?’’ అంటూ సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం.. 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..?. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టం...ఇందులో అక్రమం ఎక్కడుంది..?. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...?. ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా..... హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..?. ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..?. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా...ఈరోజు విమర్శలు చేసేది..?. .. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?. జగనన్నపైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు...వెనకడుగు వేసేది లేదు.. జై జగన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. -
విశాఖ వృద్ధురాలి హత్యపై పిచ్చి రాతలు
సాక్షి, అమరావతి: పేదల పొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నాడని.. ఈ క్రమంలోనే పచ్చ మీడియాతో పిచ్చి రాతలు రాయిస్తున్నాడని.. అయితే వాస్తవాలు బయటపడడంతో ఇప్పుడు ఆ నోళ్లు మూతలు పడుతున్నాయని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. పది లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఏపీని అప్పుల పాలు చేశారని పచ్చ బ్యాచ్ సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారానికి దిగింది. పచ్చ పార్టీకి.. పిచ్చి రాతలు రాసే వాళ్ల నోళ్లు మూతలుబడేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే టైంకి రూ. 2.64 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో రూ. 1,77,991 కోట్ల అప్పులు మాత్రమే చేశారని పార్లమెంట్ సాక్షిగా వెల్లడైంది. ఒక పనికిమాలిన ఎంపి వేసిన ప్రశ్నతో వాస్తవం బట్టబయలైంది. టిడిపి తప్పుడు ప్రచారాలకి ఇది చెంప పెట్టు అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ► సీఎం జగన్ నాలుగేళ్లుగా సంక్షేమపాలన అందిస్తున్నారు.. ప్రజాభిమానమూ పెరిగింది. ఆ ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక రాష్ట్రం అప్పులపాలయ్యిందని.. శ్రీలంకలా మారిందని గోబెల్స్ ప్రచారం చేశారు. పేదలపొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేశారు. కానీ, వాస్తవాలు బయటపడటంతో నోళ్లు మూతబడుతున్నాయి అని అన్నారాయన. ► విశాఖలో వృద్దురాలు హత్యపైనా ఈనాడు పత్రిక అబద్దాలు ప్రచురించింది. మొత్తం వలంటరీ వ్యవస్థకు ముడిపెట్టి లేనిపోని రాద్ధాంతం చేస్తోంది. పనితీరు సక్రమంగా లేదని తొలగించిన వ్యక్తిని ఇంకా వలంటీర్ అని ఎలా రాస్తారు. కేవలం పిచ్చి రాతల్లో భాగంగానే ఆ కథనం ప్రచురించింది అని మంత్రి మండిపడ్డారు. ► చంద్రబాబు మూడు టర్మ్‌లలో రూ.7.50 లక్షల కోట్లు ఏం చేశారు? మూడు సార్లు సీఎంగా పని చేసి సంక్షేమాన్ని ఎందుకు అందించలేకపోయారు?. మా ప్రభుత్వం నాలుగేళ్లలో నేరుగా ప్రజలకి అందించిన సంక్షేమమే 2.50 లక్షల కోట్లపైనే. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలకు ఆస్కార్ ఇవ్వొచ్చు. సీఎంగా ఉండి ఏనాడైనా పోలవరం పేరు ఎత్తాడా?. పోలవరానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుపడ్డాడని చంద్రబాబు ఎలా అంటారు?. అసలు వైఎస్సార్ హయాంలో పోలవరం పనులు ప్రారంభయ్యాయి. కుడి, ఎడమ కాలువలు పూర్తి చేశారు. కమీషన్ కోసం కుక్కుర్తి పడి పోలవరాన్ని నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టలేదా?. ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి వందల కోట్ల పనులు అప్పనంగా అప్పగించలేదా? అని నిలదీశారు. ► చంద్రబాబు దుర్మార్గుడు. చంద్రబాబు కొడుకు మాలోకం. అది యువగళమా.. విషగళమా?. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పెద్ద పదవులట!. టీడీపీ అధికారంమలోకి వస్తే కర్రలు ఇస్తాడట. ఇదీ రాబోయే కాలంలో వాళ్ల అజెండా. జోకర్ కొడుకు.. బ్రోకర్ తండ్రి అని పేర్కొన్నారాయన. పవన్‌ని చూస్తే జాలేస్తోంది చిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికి తెలుసు. కాపులని అనాదిగా తొక్కడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. రంగా హత్య నుంచి ముద్రగడ కుటుంబాన్ని వేధించే దాకా కాపులని అడుగడుగునా చంద్రబాబు కుట్ర ఉంది. అలాంటి చంద్రబాబు విష కౌగిలిలో పవన్ చిక్కకుపోయాడు. పవన్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారిపోయాడు. నా పార్టీ పెట్డిన ధ్యేయమే వైఎస్ జగన్ ని గద్దె దించడమే అని పవన్ అంటున్నాడు. పవన్ పై ప్రేమ ఉంటే ప్యాకేజ్ ఇవ్వలేదని ఏనాడైనా చంద్రబాబు చెప్పాడా?. అందుకే చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటపడాలి అని సూచించారు. -
‘ఈనాడు’ ఏనాడూ చెప్పని నిజం.. రైతు భరోసాలో ఇదో చరిత్ర
నిజమే!! భారీ వర్షాలకు కోతకొచ్చిన వరి నేల వాలింది. తడిసిన ధాన్యం రంగు మారుతుందని, మిల్లులో ఆడిస్తే నూక ఎక్కువొస్తుందని ‘ఈనాడు’కు కూడా తెలుసు. ఆ ధాన్యానికి మామూలు ధాన్యం కన్నా తక్కువ ధర వస్తుందనేది కూడా నిజమే కదా? ఒకవేళ దానిక్కూడా మామూలు ధరే వస్తే... సాధారణ రకం ధర పెంచమని అడగరా? ఇవన్నీ రామోజీ రావుకు తెలియనివా? తెలిసి కూడా ‘వరికి కన్నీటి తడి’ అంటూ అక్కసు వెళ్లగక్కటమెందుకు? ఎందుకంటే రైతన్నల విషయంలో ఈ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తన చంద్రబాబు అధికారంలో ఉండగా కనీసం ఊహించటం కూడా చేయని పనులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా చేసుకుపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ ‘కన్నీటి తడి’. ‘ఈనాడు’ రాతల్లో నిజానిజాలేంటో... రైతుల విషయంలో ప్రభుత్వ అడుగులు ఎలా ఉన్నాయో వివరించే కథనమిది.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఐదేళ్లు రాష్ట్రాన్నేలింది రామోజీ మిత్రుడు చంద్రబాబే. మరి ఆ ఐదేళ్లలో ఒక్కసారైనా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొన్నారా? వరదలొచ్చి రైతులు గగ్గోలు పెట్టినా పట్టించుకున్నారా? విచిత్రమేంటంటే నాటి ప్రభుత్వమే కాదు. ‘ఈనాడు’ సైతం పట్టించుకుంటే ఒట్టు. బాబు హయాంలో ధాన్యం కొనుగోలుకు ఏటా పెట్టిన ఖర్చు రూ.8వేల కోట్లు. ఇపుడది రెట్టింపు కన్నా అధికం. రూ.17వేల కోట్ల పైమాటే. ఈ రెండేళ్లలో ధాన్యానికి ఏకంగా రూ.35 వేల కోట్లు ఖర్చుచేశారన్న నిజాన్ని ‘ఈనాడు’ ఏనాడూ చెప్పలేదే? ఎందుకని? అంతేకాదు!! ఇతర పంటలకు మరో రూ.8,200 కోట్లు వెచ్చించగా... దాన్లో పత్తి పంట కోసమే రూ.1,800 కోట్లు ఖర్చు చేసిందనేది కాదనలేని వాస్తవం. పంటల కొనుగోలుకు 6400 కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి కారణంగా రూ.600 కోట్ల నష్టం వచ్చినా... రైతుకు నష్టం రాకూడదని తపన పడ్డ ప్రభుత్వం ‘ఈనాడు’కు కనపడదెందుకు? గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు, రూ.9000 కోట్ల విద్యుత్ బకాయిలు, రూ.384 కోట్ల విత్తన బకాయిల్ని ఈ ప్రభుత్వం భరించటం నిజం కాదా? మిల్లర్ల ప్రమేయం ఎక్కడైనా ఉందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న కొనుగోళ్లలో మిల్లర్ల ప్రమేయం ఎక్కడుందసలు? గతంలో రాజ్యమంతా దళారులదే కదా? వారి చెప్పుచేతల్లో రైతు మోసపోవటమే కదా? నకిలీ విత్తనాలు, ఎరువుల నుంచి మొదలెడితే... అప్పులిచ్చి వడ్డీ కింద పంటను జమ చేసుకోవటమనే దౌర్భాగ్య పరిస్థితులను ఏనాడైనా ప్రశ్నించారా? ఇప్పుడు మోసాలకు తావు లేకుండా ఆర్బీకేల ద్వారానే పంటలను పూర్తిగా కొనుగోలు చేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఏ రైతుకూ దక్కని భరోసా 10,778 ఆర్బీకేలతో ఇక్కడ దక్కుతోంది. ముఖ్యమైన డీలర్లంతా అనుసంధానమై ఉన్నారు కనక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు ఆర్బీకేలతోనే అందుతున్నాయి. గ్రామ స్థాయిలో... విత్తు నుంచి విక్రయం వరకూ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థ అమల్లోకి వచ్చినా మరి శవాలపై పేలాలేరుకునే రీతిలో ఈ రాతలెందుకు? దీనికి జవాబొక్కటే. అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజాభిమానం పుష్కలంగా ఉంది. కాబట్టి ప్రతిదీ భూతద్దంలో చూపించి విషం కక్కాలి. ఇదే రామోజీ అజెండా. అందులో భాగమే ఈ అబద్ధపురాతలు. 100 శాతం ఈ క్రాపింగ్.. ఇపుడు పంటలకు సంబంధించిన వివరాల్లో చిన్నచిన్న మోసాలక్కూడా ఎలాంటి తావూ లేదు. నూరు శాతం ఈ–క్రాపింగ్. అంటే ప్రతి ఎకరం పారదర్శకం. ఎక్కడ.. ఏ రైతు... ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడన్నది ఈ–క్రాపింగ్‌తో సుస్పష్టం. ప్రతి ఒక్క ఎకరా నమోదవుతున్నది కాబట్టి సున్నా వడ్డీ, పంటల బీమా, పంటల కొనుగోలు అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. అదే గతంలో బీమా చేయించాలంటే... పంట రుణం తీసుకున్న వారికి మాత్రమే బ్యాంకులు బీమా చేసేవి. అది కూడా 95 శాతానికే బీమా. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. పంట రుణాలతో సంబంధం లేకుండా అందరికీ నూరు శాతం ఉచితంగా బీమా లభ్యమవుతోంది. ఇక రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించటం నుంచి వ్యవసాయ విద్యతో పాటు తగిన సలహాలివ్వటం.. వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల కోసం కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయటం కూడా ఆర్బీకేలతో సాధ్యమవుతోంది. అంటే.. ఆర్బీకేల సారథ్యంలో వరి ధాన్యం మాత్రమే కాక... అన్ని పంటల కొనుగోలుకూ పక్కా వ్యవస్థ రూపుదిద్దుకుంది. బలంగా వేళ్లూనుకుని ఎదుగుతోంది. మిల్లర్ల జోక్యం లేదు. రైతులతో వారికి సంబంధమే లేదు. ధాన్యాన్ని ఆర్బీకేల్లో కొనుగోలు చేశాకే మిల్లర్లు రంగంలోకి వస్తున్నారు. ఇక వైఎస్సార్ జలకళ పేరిట రైతులకు ఉచితంగా బోర్లు కూడా తవ్విస్తున్నదీ ప్రభుత్వమే. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ‘ఈనాడు’కు ఏనాడూ కనిపించవెందుకు? విద్యుత్ గురించి పట్టించుకున్నారా? విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోలు మాత్రమే కాదు. వీటన్నిటికీ మూలమైన విద్యుత్ సరఫరాపైనా ముఖ్యమంత్రి మొదట్లోనే దృష్టి సారించారు. చంద్రబాబు హయాంలో 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన విద్యుత్ గురించి ఆలోచించిన దాఖలాలే లేవు. ఎందుకంటే అప్పట్లో ఒకవేళ ఇవ్వాలనే ఆలోచన వచ్చినా... ఇచ్చే వ్యవస్థ లేదు. ఫీడర్లు మొత్తం దెబ్బతిని వ్యవస్థ కునారిల్లి ఉంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్యాల్లో భాగంగా రూ.1,750 కోట్ల వ్యయంతో ఫీడర్ల వ్యవస్థను చక్కదిద్దారు. దీంతో పగటిపూట రైతుకు నిరాటంకంగా 9 గంటల విద్యుత్ ఇవ్వటం సాధ్యమవుతోంది. అంతేకాదు. అప్పట్లో యూనిట్ రూ.4.50 చొప్పున కొనుగోలు చేసేలా చంద్రబాబు పీపీఏలు చేసుకుని ప్రయివేటు కంపెనీలకు ముడుపుల కోసం దోచిపెడితే... పారదర్శకంగా యూనిట్ రూ.2.49కే ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచే కొనుగోలు చేస్తున్న చరిత నేటి ప్రభుత్వానిది. కాకపోతే దీన్లో కూడా ‘ఈనాడు’కు వ్యతిరేక కోణమే కనిపిస్తోందన్నది వేరే సంగతి. ఇదీ... ఈనాడు రాతల కథ ‘ఈనాడు’ రాతలెంత అబద్ధాలో చెప్పటానికిదో ఉదాహరణ. శనివారంనాటి ‘ఈనాడు’ కథనంలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని టి.నాగేశ్వరరావుతో మాట్లాడినట్లు రాశారు. నిజానికి ఆయన రైతే కాదు. ఆయన పుట్టా నాగప్రసాద్ దగ్గర పనిచేస్తున్నాడు. నాగప్రసాద్ చాన్నాళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఖరీఫ్‌లో 23 ఎకరాల్లో వరి సాగు చేశారు. 15 రోజుల క్రితం కోతలు కోయించారు. అదే సమయంలో వర్షాలు రావటంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆర్బీకేకు సమాచారమిస్తే వ్యవసాయాధికారులు వచ్చి పంటను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం కోసం రాసుకొని వెళ్లారు. ఆర్బీకే ద్వారా మంచి రేటుకు ధాన్యం కొంటామని భరోసా ఇచ్చారు. ధాన్యం ఆరబెట్టుకున్నా. ఆర్బీకే సిబ్బంది వచ్చి చూసి తడిసిన ధాన్యాన్ని విడతల వారీగా సేకరిస్తున్నారు. ఉచితంగా ఇచ్చిన గోతాముల్లో నింపి రావులపాలెం మిల్లుకు తరలిస్తున్నారు. ధాన్యం ఒబ్బిడి చేసి సంచుల్లో ఎక్కిస్తుండగా ‘ఈనాడు’ వాళ్లు వచ్చి అక్కడ పనికోసం వచ్చిన టేకి నాగేశ్వరరావు(కూలీ)ను ఆరా తీసారు. వర్షం వల్ల తడిసి రంగు మారింది. ఈసారి మంచి రేటు రావడం కష్టమే అన్నాడు. అతను నిజంగా రైతా..ఆ పొలం అతనిదా..కాదా అని కనీసం తెలుసుకోకుండా తమకనుకూలంగా రాసుకొని వెళ్లిపోయారు. ఆ బురద ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశారు. అసలు ఈనాడు వాళ్లు తనతో మాట్లాడనే లేదని రైతు నాగప్రసాద్ ‘సాక్షి’తో వాపోయాడు. ఇదీ కథ. ఇలాంటి వ్యవస్థ ఎన్నడూ లేదు: కన్నబాబు ఈ–క్రాపింగ్ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఎకరంలో రైతులు ఏ పంట వేశారో ప్రభుత్వానికి తెలుసు. దీనికి కేవైసీ కూడా అనుబంధమై ఉంది కనక డబ్బులు నేరుగా రైతు ఖాతాలోకే వెళతాయి. ఇతర రాష్ట్రాల నుంచి మోసపూరితంగా తెచ్చి ఇక్కడ విక్రయించే పద్ధతికి అడ్డుకట్ట వేశాం. రీసైక్లింగ్‌ను నివారించాం. నేరుగా రైతు మాత్రమే లబ్ధి పొందాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశం. దానికి పక్కా వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ ఏడాది దురదృష్టవశాత్తూ తుపాన్ల వల్ల రంగుమారిన, తడిసిన ధాన్యం కొందరు రైతుల వద్ద ఉంది. దీన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవంక కోరుతూనే... ఇక్కడ కూడా కొనుగోలు మొదలుపెట్టాం. కేంద్రం ప్రకటించిన 23 పంటలే కాక.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అరటి, బత్తాయి వంటి మరో 7 పంటలకూ కనీస మద్దతు ధర కల్పించాం. పొగాకు కొనుగోళ్లలో కార్పొరేట్లు రైతులను దెబ్బతీస్తున్న పరిస్థితి చూసి గతేడాది ముఖ్యమంత్రి ఆదేశాలతో మేమే వేలంలో పాల్గొన్నాం. ఐటీసీ వంటి దిగ్గజాలతో పోటీపడి రూ.130 కోట్లు వెచ్చించి పొగాకు కొన్నాం. ఒక్కటి మాత్రం నిజం!!. రైతులను వారి మానానికి వారిని వదిలేయకూడదన్నదే ఈ ప్రభుత్వ సంకల్పం. అందుకే పెసలు, సజ్జలు కూడా కొంటున్నాం. మూడు వారాల్లో ధర చెల్లిస్తున్నాం. వీటన్నిటినీ వదిలి ఒకటి రెండు చోట్ల ఉన్న పరిస్థితిని ‘ఈనాడు’ భూతద్దంలో చూపిస్తోంది. అది వారి కడుపు మంటకు నిదర్శనమని చెప్పాలి. -
జనంలో తక్కువ.. సోషల్ మీడియాలో ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పరిస్థితి ‘సమాజంలో తక్కువ.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ’అనే రీతిలో ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఎద్దేవా చేశారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతూ బీజేపీ గోబెల్స్‌కే పాఠాలు నేర్పేస్థాయికి చేరిందని ఘాటైన విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థుల్లా ప్రవర్తిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు. ఓపిక నశిస్తే ఎవరినీ వదలిపెట్టం.. బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఓపిక నశిస్తే తామూ కేంద్ర మంత్రులు, ప్రధాని సహా ఎవరినీ వదిలిపెట్టకుండా కడిగిపారేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీసింది. కరోనాకు ముందు ఎనిమిది త్రైమాసికాల పాటు జీడీపీ క్షీణిస్తూ వచ్చింది. లాక్డౌన్ సమయానికి జీరో స్థాయికి చేరింది. హైదరాబాద్ వరదల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు, బెంగళూరు వరదల గురించి ఎందుకు మాట్లాడటం లేదు’అని కేటీఆర్ అన్నారు. ‘దుబ్బాకకు ఏం చేశామో శ్వేతపత్రం విడుదల చేయాలని అడగటం సరికాదు. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి అదనపు నిధులు తెచ్చారా? కేంద్రం నిధుల వాటాపై మంత్రి హరీశ్ విసిరిన సవాలుకు బీజేపీ నేతలు పారిపోయారు. హిందూ, ముస్లిం గొడవ తప్ప వారికి మరో ఎజెండా లేదు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. హరీశ్‌కు క్రెడిట్ ఇస్తే తప్పేంటి? ‘హరీశ్, నేను ఎవరైనా.. పార్టీ కోసమే పనిచేస్తాం. హార్సెస్ ఫర్ ఫోర్సెస్ అనే సామెత ప్రకారం ఏ గుర్రాన్ని ఏ రేసులో పరుగెత్తించాలో మా అధ్యక్షుడు కేసీఆర్‌కు తెలుసు. ఎవరు సైన్యాన్ని నడుపుతారో వారికే పార్టీ బాధ్యత అప్పగిస్తుంది. హరీశ్ జిల్లా మంత్రి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో కేడర్ పనిచేస్తుంది. సీఎం కేసీఆర్ అడుగు పెట్టకుండానే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో 47 వేల ఓట్ల మెజారిటీ సాధించాం. దుబ్బాక ప్రచారానికి సీఎం వెళ్లాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. అవసరం ఉంటే ప్రచారానికి వెళ్లడంపై సీఎం స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వం ఉంది. రాష్ట్ర స్థాయిలో సీనియర్లు ఉన్నారు. ఆధునిక భావాలు కలిగిన వారు వస్తే పార్టీలోకి తీసుకుంటాం. అలాంటి వారు అన్ని పార్టీల నుంచి మాతో టచ్‌లో ఉన్నారు. దుబ్బాక ఎన్నిక తర్వాత కాంగ్రెస్ నేతలు వేరే పార్టీల్లో చేరతారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరికలు ఉంటాయి. రాజకీయ విదూషకుడు రేవంత్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. రేపో మాపో ఆయన బీజేపీలో చేరతాడనే వార్తలు వింటున్నాం. ఆయన రాజకీయ వ్యాఖ్యాతగా మారారు’అని కేటీఆర్ విమర్శించారు. తలసరి ఆదాయం రెట్టింపు.. ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం రూ.27,718 కోట్ల రుణ మాఫీ చేశాం. రైతు బంధు కింద రూ.28 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడంతో పాటు రైతు బీమా, ఇన్పుట్ సబ్సిడీకి అదనంగా నిధులు ఇచ్చాం. తలసరి ఆదాయం రాష్ట్రంలో ఆరేండ్లలో రెట్టింపు కావడంతో పాటు, జీఎస్డీపీ మూడు వందల రెట్లు పెరిగింది. రైతుబంధుతో చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం దక్కిందని ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. షీ టీమ్స్ పనితీరు బాగా ఉంది. గురువారం మరో భారీ పారిశ్రామిక పెట్టుబడిపై ప్రకటన చేస్తాం’అని కేటీఆర్ వెల్లడించారు. ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై కేబినెట్లో చర్చించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు. -
హిట్లర్‌కు గోబెల్స్.. మోదీకి ఆయనే!
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ను కుదిపేస్తున్న కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ వినియోగదారులు సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్టు అపఖ్యాతి ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని, జీఎస్టీని ఉద్దేశించి ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’ కామెంట్ వెనుక ఉన్నది ఆ సంస్థేనని కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జి అనలిటికా సేవలను కాంగ్రెస్ పార్టీ పొందిందని విమర్శించారు. అయితే, ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే విషయంలో హిట్లర్‌కు గోబెల్స్ అనే మంత్రి ఉండేవాడని, ఇప్పుడు ప్రధాని మోదీకి రవిశంకర్‌ప్రసాద్ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. బూటకపు కథనాలను సృష్టించే కార్ఖానా బీజేపీ ప్రభుత్వమేనని, అతిపెద్ద సమాచార దొంగే.. అందరికంటే గట్టిగా అరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇలా ఆరోపణలు ఎలా చేస్తారని మండిపడ్డారు. -
‘జగన్‌పై గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీని అణిచి వేసేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, అవమానించినా దృఢ సంకల్పంతో వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని అన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయిస్తూ అధికార పార్టీ గ్లోబల్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మంచి సంక్షేమ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని, రాజన్న రామరాజ్యాన్ని వైయస్ జగన్ తీసుకువస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు బొత్స తెలిపారు. ఇందుకు ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళపై జరిగిన ఘటనను బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. టీడీపీ పాలనలో దళితులపై వివక్ష పెందుర్తిలో మహిళపై జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడేటట్లు, తలదించుకునేటట్లుగా ఉందని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, దోషులను రక్షించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా దళితులపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాల్లో వివక్ష చూపుతున్నారని బొత్స మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. తమ పార్టీ తరఫున వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, స్థానిక నాయకులను పెందుర్తి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించాలని వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆ మూడు అక్షరాలే.. వైఎస్ఆర్ అనే మూడు అక్షరాలు ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 9 కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్రగా ఉన్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. మహానేత ఆశయ సాధనకు ఆయన తనయుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వంతో కళకళలాడుతోందన్నారు. రాష్ట్రానికి వైళెస్ జగన్‌తో మంచి భవిష్యత్తు ఉందని అందరూ నమ్ముతున్నారని తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా..దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ స్ఫూర్తితో, ఆయన మాదిరిగా పాలనను మళ్లీ తీసుకురావాలని వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆనాటి 9 కోట్ల మంది ప్రజలు వైఎస్ఆర్ అనే మాట వినగానే ఫర్వాలేదు మాకు ఈ మూడు అక్షరాలు ఉన్నాయని, మాకు రాజన్న ఉన్నాడని ధైర్యంగా ఉండేవారన్నారు. అదే మూడు అక్షరాలను చూసి టీడీపీ శ్రేణులు ప్రజల్లో ఆ పేరును భగ్నం చేయాలని కుట్రలు చేశారు. మళ్లీ అదే మూడు అక్షరాలు జగన్.....తండ్రికి తగ్గ తనయుడిగా ఉండాలనే కోరికతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్లారని, మళ్లీ ఆ రాజన్న రాజ్యం తెస్తానని చెబుతున్న నేపథ్యంలో ఆ నాయకత్వాన్ని బలహీనపరచాలని అధికార టీడీపీ ధన మదంతో అప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొంటూ, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ వ్యక్తిగతంగా వైఎస్ జగన్ అనే మూడు అక్షరాలపైన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయిస్తూ, సోషల్ మీడియాలో చేయిస్తున్నారని మండిపడ్డారు. గ్లోబల్ ప్రచారం మాదిరిగా జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారన్నారు. బాబు..హిట్లర్ ఇద్దరు ఒక్కటే ఒకే తారీఖున పుట్టిన వారు ఒకే విధంగా వ్యవహరిస్తారని బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. హిట్లర్, చంద్రబాబు ఒకే తారీఖున పుట్టారని, ఆయన మాదిరిగానే చంద్రబాబు కూడా నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌పై చేస్తున్న ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని, ఒక సంక్షేమ ప్రభుత్వం రావాలని కోరుతున్నారని తెలిపారు. ఆ నాయకత్వం రావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. 2004 నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆరు సంవత్సరాల్లోనే సంక్షేమ రాజ్యంగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని గుర్తింపు ఉందన్నారు. గత 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో కానీ, ఈ నాలుగేళ్లలో కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా చెప్పుకునే విధంగా లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని మేం గొప్పగా చేశామని చెప్పుకునే సత్తా టీడీపీకి ఉందా అని నిలదీశారు. ఆ రోజు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు ఈ ప్రభుత్వం పేర్లు మాత్రమే మార్చారని, ఆ పథకాలను తొలగించే వీలు లేకుండా పోయిందన్నారు. ప్రజాసంకల్పయాత్రకు బ్రహ్మరథం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. గత 40 రోజులుగా వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేతకు తమ ఇబ్బందులు చెబుతున్నారని చెప్పారు. ఇదే వరవడితో, దృక్ఫథంతో వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారని, రాజన్న రాజ్యం తెచ్చేందుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చేలా ఇతరులు ప్రయత్నించినా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి ధ్యేయమే ప్రధానంగా ముందుకు రావాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని పక్కన పెట్టి వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు. జాతీయ ప్రాజెక్టును కేంద్రం నుంచి రాష్ట్రం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. హోదా ముగిసిన అధ్యాయం కాదు, ఐదు కోట్ల ప్రజలకు సంజీవని అని చెప్పారు. జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రకు యువ నాయకుడు వైఎస్ జగన్‌కు మీ ఆశీస్సులు ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరారు. -
ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ హుజూరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి గొంతెత్తుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి విఘాతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సకల జనులను ఐక్యం చేసి, రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకుని, ఆయన్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. టీజేఏసీ సభపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి, కోదండరాంకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారిపై కేసులు నమోదు చేస్తూ, దాడులకు పాల్పడటం, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారు మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారని, ఇందుకేనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ప్రతిపక్షాలు అడుగుతున్నాయని, ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం చేస్తున్న గోబెల్స్ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అభివృద్ధిని అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌ది గోబెల్స్ ప్రచారం: పల్లా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ నాయకుల నుంచి గల్లీ స్థాయి నాయకుల వరకు టీఆర్ఎస్ ప్రభు త్వం, మంత్రి కేటీఆర్‌పై విచక్షణ కోల్పో యి మాట్లాడుతున్నారని, ఇన్నోవా వాహనాల కొనుగోలులో కుంభకోణం జరిగిందని చెప్పిందే చెబుతూ అబద్ధాన్ని నిజం చేయాలని గోబెల్స్ ప్రచారం చేస్తు న్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర సంస్థ అయిన డీజీఎస్‌డీ నిర్ణయించిన ధరల మేరకే పోలీసు శాఖ 300 ఇన్నోవా లను టయోటా కంపెనీ నుంచి కొనుగో లు చేసిందన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ, వాహనాల కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగానే ఉందని, అక్ర మాలు జరిగాయని భావిస్తే ఏ దర్యాప్తు సంస్థకైనా వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. కేటీఆర్‌కు సంబంధించి ‘హిమాన్షు’ మోటార్స్ కంపెనీ ఉందని, కానీ, ఏడేళ్లుగా అందులో ఎలాంటి కార్యక లాపాలు లేవని, ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు కావాలనే బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
హోదాపై బాబు మోసం!
ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శ ►హోదాతో మేలు లేకపోతే 15 ఏళ్లు కావాలని ఎందుకు అడిగారు? ►అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం ఎందుకు చేశారు? ►అప్పుడు హోదాతో మేలు ఏమీలేదని తెలియకుండానే చేశారా? ►14వ ఆర్థిక సంఘం హోదా రద్దు చేయలేదని దాని సభ్యులే చెప్పారు ►కేబినెట్ తీర్మానం తర్వాత 10 నెలలపాటు ఏం చేశారు? ►హోదాపై ఇప్పుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు ►9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం గుర్తుకు రాలేదా? సాక్షి, అమరావతి: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించక పోగా... ప్రత్యేక సాయం పేరుతో ‘హోదా’కు కేంద్రం మంగళం పాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో అభినందన తీర్మా నం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే పార్లమెంటు చట్టంద్వారా సంక్రమిం చిన అంశాలకు మళ్లీ చట్టబద్ధత ఏమిటి అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గురువారం శాసనసభలో అభినందన తీర్మానంపై జగన్ మాట్లాడారు. బాబు ప్రత్యేక హోదా విషయం లో రాష్ట్రాన్ని తీవ్రంగా మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడంలేదంటే దానికి కారణం చంద్రబాబే అన్నారు. హోదాను 14వ ఆర్థిక సంఘం రద్దు చేసిందని సీఎం పదవిలో ఉండి అసత్యాలు చెబుతున్నారని, అలా రద్దు చేసినట్టు ఎక్కడా లేదని జగన్ మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్‌సేన్.. గోవింద రావు.. ఆ సంఘం చైర్మన్ వైవీ రెడ్డి హోదా రద్దుకు సిఫార్సు చేయలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆ విషయాలు సీఎంగా మీకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో తీర్మానాలు ఎందుకు చేసినట్లు? హోదా వల్ల ఒరిగేదేమీ లేదని ఇప్పుడు చెబు తున్నారు... అలాంటప్పుడు ఆగస్టు 31, 2015లో ఒకసారి, మార్చి 16, 2016లో ఒక సారి అసెంబ్లీలో హోదామీద తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపించారు అని జగన్ దుయ్యబట్టారు. మరి 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందో ఆరోజు బాబుకు తెలియదా? ఆర్థిక సంఘం సిఫార్సులు వచ్చిన తర్వాతనే కదా.. అవి అమలు జరుగుతున్న సమయంలోనే కదా ఈ తీర్మానాలు చేసింది? అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు, బయటికొచ్చి దానివల్ల లాభమేమీ లేదని ప్రజలను మోసం చేస్తారు ఇదేనా మీ తీరు అని నిలదీశారు. అసెంబ్లీలో తీర్మానాల కంటే ముందే తిరుపతిలో జరిగిన ఎన్నికల సభలో ఐదేళ్లు స్పెషల్ స్టేటస్ ఇస్తే కంపెనీలు రావని, అవి పెట్టేసరికే మూడేళ్లు పైన పడుతుందని, 15 ఏళ్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేయలేదా అని నిలదీశారు. ఆ పదినెలలు ఏం చేశారు? ‘‘కేబినెట్ తీర్మానం గురించి చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకమునుపే మార్చి 2న అప్పటి ప్రణాళికా సంఘానికి కేబినెట్ తీర్మానం చేసి పంపిం చింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల తర్వాత ప్రణాళికా సంఘం రద్దయి నీతి ఆయోగ్ ఏర్పడింది. అక్కడ కేంద్రంలో నరేంద్రమోడి ప్రభుత్వం కొనసాగుతోంది. మరి ఈ 10 నెలల కాలం చంద్రబాబు ఏం చేశారు? ప్రత్యేకహోదా గురించి వీళ్లసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ’ అని జగన్ పేర్కొన్నారు. ప్రణాళికా సంఘానికి కేంద్ర కేబినెట్ ఉత్తర్వు వెళ్లినా ఎందుకు హోదా రావడం లేదని బాబు కనుక్కునే ప్రయత్నమే చేయలేదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు మనకు పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్నీ ఇస్తూ ప్రత్యేకహోదా కూడా ఇస్తామని పార్ల మెంటు సాక్షిగా మాట ఇచ్చారన్నారు. ‘‘ఇవాళ వాళ్లు మిగిలిన వాటి గురించి మాత్రమే చెబు తూ హోదా ఇవ్వడం లేదని సంకేతాలిస్తున్న పుడు చంద్రబాబు ఎందుకు దానిని ప్రశ్నిం చకుండా మౌనంగా ఉన్నారు? కృతజ్ఞతలు చెప్పడానికి ఎందుకు ముందుకొస్తున్నారు?’’ అని జగన్ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై మీకే ప్రేమ ఉందా? ‘పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు తనకే ప్రేమ ఉన్నట్టుగా చెబుతున్నారు... 2004కు ముందు ఆయన తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడెందుకు పోలవరం ప్రాజెక్టు గుర్తుకు రాలేదు’ అని జగన్ అధికారపక్షాన్ని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టుకు అయిన రూ.8800 కోట్ల ఖర్చులో రూ.5555 కోట్లు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఖర్చు చేసిన విషయాన్ని మీరు మర్చిపోయారా అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 172 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో 144 కిలోమీటర్లు పూర్తి చేశారని, 182 కిలోమీటర్ల ఎడమ కాలువ పన్నుల్లో 135 కిలోమీటర్లు పూర్తిచేశారని, ఇప్పుడేమో అంతా మీరే చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అప్పటి పోలవరం కాంట్రాక్టులో మధుకాన్ సంస్థ హెడ్‌వర్క్స్ పనుల్లో కేవలం రూ.110 కోట్ల పనులు మాత్రమే చేశారని, అందుకే ఆ సంస్థను తొలగించారన్న విషయం గుర్తుచేస్తూ ఆ కంపెనీ అధినేత నామా నాగేశ్వరరావు తెలుగుదేశం ఎంపీ అన్నది మీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు. పోలవరం పనులు చేపట్టిన మరో సంస్థ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి సంబంధించిన రూ.472 కోట్లు ఆస్తులు బ్యాంకులు వేలం వేస్తున్నా ఆ కంపెనీని తొలగించాల్సింది పోయి కొనసాగిస్తున్న విషయం మీకు ఎందుకు గుర్తుకు రాలేదో అర్థం కావడం లేదన్నారు. పనులు చేయలేని ట్రాన్స్ట్రాయ్పై వేటు వేసి.. కొత్తగా టెండర్లు పిలిచి ఉంటే.. స్టీలు, సిమెంటు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిన నేపథ్యంలో అంచనా వ్యయం కూడా తగ్గేదని వివరించారు. కానీ.. అడ్డగోలుగా అంచనా వ్యయం పెంచేసి.. నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లలో ఒకరు స్వయానా మీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడన్నది కూడా మీకు తెలియదా? అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో పనులు మొత్తం మీకు కావాల్సిన వారికి నామినేషన్ పద్ధతిలో ఇచ్చింది వాస్తవం కాదా అన్నారు. పోలవరం ప్రాజెక్టు మీరే చెయ్యండని కేంద్రమే చెప్పిందని మీరు చంకలు గుద్దుకుంటున్నారు...కానీ ఆరోజు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తన ప్రెస్‌నోట్‌లో ‘రాష్ట్రమే తాము చేస్తామని విన్నవించుకుంటే పోలవరం నిర్మాణ బాధ్యతలు ఇచ్చాం’ అని చెప్పడం చూస్తే మీకంటే అబద్ధాలు ఎవరైనా చెబుతారా అని ఎద్దేవా చేశారు. కిరణ్ సర్కారును కాపాడింది మీరు కాదా? నాడు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు, కిరణ్–తెలుగు సర్కారు ఉన్న సమయంలో...294 మంది ఎమ్మెల్యేలుంటే సర్కారు నెగ్గాలంటే 148 మంది బలం ఉండాలి.. కానీ ఆరోజు మీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసి సర్కారును కాపాడింది మీరు కాదా అన్నారు. మీరు కిరణ్ సర్కారుకు మద్దతునివ్వడం వల్లే ఆరోజు 146 మంది ఎమ్మెల్యేలున్నా కిరణ్ సర్కారు నెగ్గిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాలకపక్షంతో కలవడం ఎక్కడైనా ఉందా? అని జగన్ ఘాటుగా విమర్శించారు. ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన సభ అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన అభినందన తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదాలతో సభ దద్ధరిల్లింది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను రద్దు చేసిందని, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటూ ధన్యవాద తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పగానే... ఒక్కసారిగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దానిపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు పూర్తిగా అసత్యాలు, అబద్ధాలు చెబుతున్నారని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో అధికారపక్ష సభ్యులు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దే నిలబడి ‘చంద్రబాబు అసత్యాలు ఆపాలి..అబద్ధాలు ఆపాలి’ అంటూ నినాదాలు చేసారు. దానిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. వీళ్లకు సభా మర్యాదలు తెలియవని, తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎక్కువ సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేశానని అన్నారు. వీళ్లు ఏం చదువుకున్నారో తెలియదుగానీ, తానైతే ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివానని, ఎంఫిల్ కూడా చేశానని అన్నారు. వీళ్లేం చదివారో అని ప్రతిపక్ష సభ్యుల నుద్దేశించి బాబు అనగానే...తాము లోకేష్ యూనివర్శిటీలో ‘ఓటుకు కోట్లు’ చదివామని, వెన్నుపోట్లు చదివామని ప్రతిపక్ష సభ్యులు అన్నారు. పోలవరానికి గతంలోనే చట్టబద్ధత వచ్చిందని, ఎన్నిసార్లు చట్టబద్ధత తెస్తారని ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. ప్రత్యేక సాయం అంటూ ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని, నాడు తిరుపతి ఎన్నికల సభలో ఎందుకు ప్రత్యేకహోదా 15 ఏళ్ల పాటు కావాలని అడిగారని మండిపడ్డారు. అనంతరం చంద్రబాబు తాను హైదరాబాద్‌లో హైటెక్‌సిటీని కట్టానంటూ మళ్లీ మొదలెట్టారు. అబద్ధాలు అనే పదం శాసనసభలో అన్‌పార్లమెంట్ (అసభ్య పదజాలం) అని, దీన్ని ప్రతిపక్ష సభ్యులు ఎలా వాడతారని సీఎం ప్రశ్నించారు. ఈ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకరు ఆదేశించారు. ప్రతిపక్ష నేతకు మైక్ కట్‌చేయడంపై సభ్యుల నినాదాలు ప్రత్యేక సాయానికి అభినందనలు తెలిపే తీర్మానంలో భాగంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మైక్ ఇవ్వడం వెంటనే కట్‌చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు, చివరకు ఎమ్మెల్యేలకు కూడా గంటల తరబడి మైకులిస్తూ ప్రతిపక్ష నేతకు మైక్ కట్‌చేయడంపై సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకపోతే తాము ఇక్కడ నుంచి కదిలేది లేదని నినదించారు. ఇంతలోనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేచి...ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వరని, అలా ఇవ్వాలని ఏ రూలులోనూ లేదని, సభ్యులు ఇలాగే ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. అయితే ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రతిపక్షనేతకు మైక్ ఇవ్వకుండానే తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షనేత క్లారిఫికేషన్స్ కోసం పట్టుబట్టగా మైక్ ఇచ్చినట్లే ఇచ్చి మరలా మైక్ కట్ చేశారు. చివరగా టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ప్రతిపక్ష, పాలక పక్ష ఎమ్మెల్యేల మధ్య వాడి వేడి వాగ్వాదం జరిగింది. సభ 20వ తేదీకి వాయిదా ప్రత్యేక సాయంపై చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాద తీర్మానం ముగిసాక స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసనసభను ఈనెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 17న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటం, 18, 19వ తేదీలు శని, ఆదివారాలు కావడంతో ఈనెల 20 అంటే సోమవారానికి సభను వాయిదా వేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. కౌరవ సభలా మార్చేశారు శాసనసభ జరి గిన తీరు కౌరవసభను తలపించిం దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం శాసనసభ వాయిదా పడిన తరువాత జగన్ బయటకు వచ్చినపుడు ఆయన ఛాంబర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. సభలో పరిణా మాలపై విలేకరులడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ ‘అసెంబ్లీని కౌరవ సభగా మార్చేశారు.... ఇంకేం చెబుతాం...’ అన్నారు. తాను కడపకు వెళుతున్నానని, అక్కడ కూడా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను కౌరవ సభ కన్నా నీచంగా మార్చేందుకు అధికారపక్షం ప్రయత్నిస్తోం దని జగన్ విమర్శించారు. -
గోబెల్స్ ప్రచారానికి అడ్డా గాంధీ భవన్
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: గోబెల్స్ ప్రచారానికి గాంధీభవన్ ప్రధాన అడ్డాగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌కు గోబెల్స్–2 ఆఫీసుగా పేరు మార్చుకుంటే బావుంటుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళ వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నింటిని భర్తీ చేయాలనే విషయాలపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని షబ్బీర్ అలీకి హితవుపలికారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాం గ్రెస్‌కు 50 సీట్లు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటన నవ్వు తెప్పిస్తోందని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే కాంగ్రెస్ పరిమితం కాక తప్పదన్నారు. -
కొనసాగుతున్న ‘ఈనాడు’ అసత్య ప్రచారం
* ఈడీ అటాచ్మెంట్ల క్రమంలో... ఇది పెన్నా చార్జిషీటు! * వరుసగా అటాచ్మెంట్లు చేస్తూ వస్తున్న ఈడీ * తాజాగా పెన్నా చార్జిషీటు విషయంలోనూ అదే చర్య * పనిగట్టుకుని ఆందోళన కలిగించేలా ‘ఈనాడు‘ వార్తలు హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: తెలిసిన వాళ్లకయితే ‘ఇది మరో చార్జిషీటు’ అంతే!. అదే తెలియని వాళ్లకయితే... ‘సాక్షి పత్రిక, టీవీ ఆస్తుల జప్తు’ అనేది ఆందోళన కలిగించే అంశం. కాబట్టే ‘ఈనాడు’ పత్రిక మరికాస్త మసాలా దట్టించి మొదటి పేజీలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఫొటోతో సహా అంతపెద్ద వార్తను అచ్చేసింది. తన లక్ష్యం సాక్షి, వైఎస్ అభిమానుల్లో ఆందోళనను పెంచటమేనని మరోసారి చాటుకుంది. నిజానికి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో మొదటినుంచీ జరుగుతున్న పరిణామాల్ని చూసినవారెవరూ దేనికీ ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఈ కేసులో జరిగినవన్నీ ఆశ్చర్యం కలిగించేవి, ఇంతకు ముందెన్నడూ ఏ కేసులోనూ జరగనివే కాబట్టి. తాజా వ్యవహారం విషయానికొస్తే ఇదే కేసులో సాక్షి పత్రిక, చానల్‌కు సంబంధించిన రూ.47 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. నిజానికి ఈ కేసులో ఆస్తుల్ని ఈడీ అటాచ్మెంట్ చేయటమనేది ఇది తొలిసారేమీ కాదు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఈడీ స్వయంగా దర్యాప్తు చేయకుండా సీబీఐ వేసిన ప్రతి చార్జిషీట్‌నూ యథాతథంగా స్వీకరిస్తూ సీబీఐ చార్జిషీటులో పేర్కొన్న ఆస్తుల వివరాల ప్రకారం అటాచ్మెంట్ చేస్తున్నట్టు ప్రకటిస్తోంది. ఇప్పటికి సీబీఐ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తిచేసి 11 చార్జిషీట్లు వేయటం తెలిసిందే. వాటిలో అరబిందో, హెటెరో డ్రగ్స్ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, కొందరు వ్యక్తులు వ్యక్తిగత స్థాయిలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, రాంకీ గ్రూపు పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, వాన్‌పిక్ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును అనుసరిస్తూ... ఆయా చార్జిషీట్లలో పెట్టుబడులుగా పేర్కొన్న మొత్తాలకు సంబంధించి బ్యాంకు డిపాజిట్ల నుంచి భవనాల వరకు జగతి పబ్లికేషన్స్‌కు చెందిన పలు ఆస్తుల్ని ఈడీ యథాతథంగా అటాచ్ చేస్తూ వస్తోంది. ఈ అటాచ్మెంట్లను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి కూడా. ఇదే క్రమంలో పెన్నా గ్రూపు సంస్థలు సాక్షిలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఛార్జిషీటు మేరకు ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లుగా సోమవారం రాత్రి ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీన్లో ఆయా ఆస్తుల్ని వరసగా పేర్కొంటూ.... సాక్షి భవనాల జాబితాను ఇచ్చేసరికి... ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిన తీరులో సాక్షి , వైఎస్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తించేలా ‘ఈనాడు’ మొదటిపేజీలో పేద్ద వార్తను అచ్చేసింది. ‘ఈనాడు’ గమనించాల్సిన విషయమేంటంటే ‘సాక్షి’ ఆస్తుల్ని ఎలియనేట్ చేయరాదంటూ రెండేళ్ల కిందట రాష్ట్ర హైకోర్టే ఓ కేసులో ఉత్తర్వులిచ్చింది. అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్లో క్రయవిక్రయాలు కుదరవు. వాటాలు విక్రయించటం వంటివి చేయకూడదు. అంతకు మినహాయించి రోజువారీ కార్యక్రమాలకు ఏమాత్రం అంతరాయం కలగరాదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రతి లావాదేవీనీ ఎంతో పారదర్శకంగా నిర్వహించే సాక్షి... అప్పటి నుంచీ అటాచ్మెంట్ పరిధిలోనే తన కార్యకలాపాలను కొనసాగిస్తూ... దినదిన ప్రవర్ధమానమవుతుండటం ‘ఈనాడు’కు మింగుడుపడటం లేదు. అదే ఈ రాతలకు అసలు కారణం. -
గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు దిట్ట: విజయసాయిరెడ్డి