కాంగ్రెస్‌ది గోబెల్స్‌ ప్రచారం: పల్లా | Buying from Innova's Toyota company is priced at the price of DGSD | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ది గోబెల్స్‌ ప్రచారం: పల్లా

Published Fri, Jul 28 2017 2:11 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

కాంగ్రెస్‌ది గోబెల్స్‌ ప్రచారం: పల్లా - Sakshi

కాంగ్రెస్‌ది గోబెల్స్‌ ప్రచారం: పల్లా

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ జాతీయ నాయకుల నుంచి గల్లీ స్థాయి నాయకుల వరకు టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం, మంత్రి కేటీఆర్‌పై విచక్షణ కోల్పో యి మాట్లాడుతున్నారని, ఇన్నోవా వాహనాల కొనుగోలులో కుంభకోణం జరిగిందని చెప్పిందే చెబుతూ అబద్ధాన్ని నిజం చేయాలని గోబెల్స్‌ ప్రచారం చేస్తు న్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కేంద్ర సంస్థ అయిన డీజీఎస్‌డీ నిర్ణయించిన ధరల మేరకే పోలీసు శాఖ 300 ఇన్నోవా లను టయోటా కంపెనీ నుంచి కొనుగో లు చేసిందన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ, వాహనాల కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగానే ఉందని, అక్ర మాలు జరిగాయని భావిస్తే ఏ దర్యాప్తు సంస్థకైనా వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. కేటీఆర్‌కు సంబంధించి ‘హిమాన్షు’ మోటార్స్‌ కంపెనీ ఉందని, కానీ, ఏడేళ్లుగా అందులో ఎలాంటి కార్యక లాపాలు లేవని, ఈ విషయంలో కాంగ్రెస్‌ నాయకులు కావాలనే బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement