‘చంద్రబాబూ.. ఇక జగన్నామ స్మరణ ఆపేయ్‌’ | YS Jagan Fire On CM Chandrababu Blame His tenure Govt | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబూ.. ఇక జగన్నామ స్మరణ ఆపేయ్‌’

Published Fri, Sep 13 2024 4:45 PM | Last Updated on Fri, Sep 13 2024 5:25 PM

YS Jagan Fire On CM Chandrababu Blame His tenure Govt

కాకినాడ, సాక్షి: గోబెల్స్‌ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస. అబద్ధాలను మ్యానుఫ్యాక్చర్‌ చేయడంలో దిట్ట. వాటిని అమ్ముకోగలిగే కెపాసిటీ ఈ భూమ్మీద కేవలం ఒక్క చంద్రబాబుకే ఉంది అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏలేరు వరద ముంపు బాధిత గ్రామాల్లో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలను ఇబ్బంది చేయడమే కాకుండా చంద్రబాబు ఇప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో వచ్చి ఇన్నిరోజులు గడిచినా.. తాను చేయాల్సిన పనులేవీ చేయలేదు. దానంతటికి కారణం జగనే అంటారు. ఎక్కడ ఏం జరిగినా.. జగన్‌ పేరే చెప్తారు..

.. చంద్రబాబూ.. ఇకనైనా జగన్నామం ఆపు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచింది. చేయాల్సిన దాని గురించి ఆలోచించు. నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో. ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సిన దాని మీద ధ్యాస పెట్టు అని చంద్రబాబుకి జగన్‌ హితవు పలికారు. చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారాలకుఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లాంటి ఎల్లో మీడియా తోడైయ్యింది’’ అని జగన్‌ పేర్కొన్నారు. 

ఈ నాలుగు నెలల్లో..
ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థనలనూ నాశనం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడం లేదు. పంటల బీమా ప్రీమియమ్‌ కూడా కట్టడం లేదు. వ్యవసాయ సీజన్‌ మొదలైంది. వారికి అందాల్సిన సున్నా వడ్డీ పంట రుణాలు ఏమయ్యాయి?.  పెట్టుబడి సాయం రైతు భరోసా ఏమైంది? రూ.20 వేలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

ఇదీ చదవండి: చిల్లర రాజకీయమే చంద్రబాబు ముందున్న మార్గమా?

గత మా ప్రభుత్వంలో.. 
రైతులకు పంట నష్టం జరిగితే, గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవి. ఆర్బీకేలు ఉండేవి. ఇన్సూరెన్స్‌ ఉండేది. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఉండేది. రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని విధాలుగా ఆదుకునే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. గతంలో రైతులకు ఎంత వచ్చేది? ఒక్కసారి ఆలోచించండి.

జగన్‌ ఇప్పుడు ఉండి ఉంటే.. 
ఇప్పుడే కనుక జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే.. రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది. సీజన్‌ ప్రారంభంతోనే సాయం చేసి ఉండేవాళ్లం. గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో అది కేవలం రూ.15 వేలు మాత్రమే. ప్రీమియం కట్టి ఉండే వాళ్లం కాబట్టి రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు బీమా పరిహారం వచ్చేది. దాంతో పాటు, పెట్టుబడి సాయం, సున్నా వడ్డీ కింద దాదాపు రూ.5 వేల వరకు.. అన్నీ కలిపి రైతులకు ప్రతి ఎకరాకు దాదాపు రూ.45 వేల వరకు సాయం అంది ఉండేది.

కానీ, ఈ పెద్ద మనిషి(చంద్రబాబు) ఏం చెబుతున్నారు?. ఎకరాకు రూ.10 వేలు ఇస్తానన్నారు. ఎలా? ఈ–క్రాపింగ్‌ లేదు.. అడిటింగ్‌ లేదు. ఆర్బీకే వ్యవస్థ లేదు. ఇంకా ఇన్సూరెన్స్‌ గురించి చెప్పడం లేదు. బాబు హయాంలో కేవలం రూ. 3 వేల కోట్లే వచ్చింది. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,250 కోట్లు చెల్లించకపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఇన్సూరెన్స్‌ చెల్లించలేదు.  భరోసా గురించి నోరు మెదపరు. ఇన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా.. చంద్రబాబు మాత్రం నిజం మాట్లాడరు.

చంద్రన్న మార్క్‌ మోసం
చంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు. విద్యాదీవెన, గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. లా అండ్‌ఆర్డర్‌ గాలికొదిలేశారు. బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. వరద బాధితులకు కనీసం పునరావాసం కూడా కల్పించడం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా ఆర్టిస్ట్‌, చంద్రబాబు ఓ డ్రామా ఆర్టిస్ట్‌ అని జగన్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement