
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మరిచిన మేనత్త సొంత మేనకోడలును హతమార్చింది. పెద బయలు మండలం లకేయిపుట్టులో మంగళవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాలు.. భార్యభర్తల మధ్య వచ్చిన తగాదాతో వంతాల రస్మో తన తమ్ముడి ఇంటికి వచ్చి ఉంటుంది. భర్తతో కాపురానికి వెళ్లమని తమ్ముడి భార్య మందలించడంతో కక్ష పెంచుకుంది. కట్టెలకోసం కొండప్రాంతానికి మేనకోడలు అనితను తీసుకెళ్లింది. సమీపంలో ఎవరూ లేరని గమనించి.. అమానుషంగా కత్తితో నరికి చంపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment