India Vs South Africa T20 Visakhapatnam Online Booking And Tickets Price Details - Sakshi
Sakshi News home page

Ind Vs SA T20 Online Tickets: క్రికెట్‌ ఫ్యాన్స్‌కి అలర్ట్‌.. విశాఖలో టీ20 మ్యాచ్‌కు టికెట్స్‌ అమ్మకాలు

Published Sat, Jun 4 2022 10:31 AM | Last Updated on Sat, Jun 4 2022 10:52 AM

Ticket Sales For Visakhapatnam T20 Cricket Match - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: భారత్‌ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ఆడనున్న మూడో టీ20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు ఈ నెల 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నాయి. దక్షిణాఫ్రికా–భారత్‌ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌ ఈనెల 14న విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.

రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా.. 13వ తేదీనే ఇరు జట్లు విశాఖ చేరుకోనున్నాయి. మ్యాచ్‌ వీక్షించేందుకు స్టేడియంలో గల 27,251 సీటింగ్‌ కెపాసిటీలో స్థానిక క్లబ్‌లకు, కాంప్లిమెంటరీలు మినహాయించి మిగిలిన టికెట్లను ఈనెల 5వ తేదీన ఉ.11.30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్టు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. 

టికెట్లను పేటీఎం యాప్‌ www.insider.in.tickets ప్లాట్‌ఫాంలో పొందవచ్చన్నారు. టికెట్‌ కనీస ధర రూ.600 నుంచి రూ.6 వేల వరకు ఉంటుందన్నారు. 8న ఆఫ్‌లైన్‌లో విశాఖలోని 3 కేంద్రాల్లో విక్రయించనున్నారు. విశాఖతో పాటు విజయవాడ, హైదరాబాద్‌లలో కొన్నవారి టికెట్లను కొరియర్‌లో పంపనున్నారు. 

ఇది కూడా చదవండి: అస్సలు బాలేదు.. కోహ్లి, రోహిత్‌ తమ మార్కు చూపించాలి.. లేదంటే కష్టమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement