
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీఐఎస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కీలకమైన 12 రంగాల్లో దేశీయ, విదేశీ పెట్టబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేవిధంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళా శాల గ్రౌండ్స్‌లో జరిగే ఈ సమ్మిట్‌కు సంబంధించిన లో గోను ఇప్పటికే సీఎం ఆవిష్కరించారని గుర్తుచేశారు. దీనికి విస్త్రత ప్రచారం కల్పించే విధంగా ప్రకటనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎంగా జగన్ పదవి చేపట్టిన తర్వాత విజయవాడలో వివిధ దేశాల రాయబారులతో కలిసి డిప్లమాటిక్ సదస్సు నిర్వహించారని, తర్వాత కరోనాతో పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేక పోయామని చెప్పారు. రాష్ట్రంలోని పెట్టుబడుల అవ కాశాలు, వనరులను వివరిస్తూ తైవాన్, యూఏఈ, జర్మనీ, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోను, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరా ల్లోను రోడ్‌షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ, మారిటైమ్ రంగాలపై రెండు భారీ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సదస్సులకు ఈవెంట్ పార్టన ర్‌గా సీఐఐ, నాలెడ్జ్ పార్టనర్‌గా కేపీఎంజీ వ్యవహరించనున్నాయని తెలిపారు. వీటి ప్రచారానికి ఈవెంట్ మేనేజర్ ఏజెన్సీ కోసం టెండర్లు పిలిచామన్నారు.
అవకాశం కల్పిస్తే.. ఈ రోజునుంచే విశాఖను రాజధాని చేస్తాం..
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుకోసం జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీడి యాతో సహా అందరూ రాజకీయాలకు అతీతంగా సహ కరించాలని కోరారు. విలేకరుల అడిగిన ప్రశ్నకు బొత్స సమాధానమిస్తూ విశాఖను రాజధాని చేయాలన్నది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అవకాశం కల్పిస్తే ఈ రోజునుంచే విశాఖను రాజధానిని చేస్తామని చెప్పా రు.
అంతకుముందు మంత్రులు రాష్ట్ర పరిశ్రమలు, మౌ లిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐ.టి. శాఖల అధికారులు, సీఐఐ, కేపీఎంజీ అధికారులతో సమావేశమై సమ్మిట్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్వలవన్, హ్యండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, పరిశ్రమలు, వాణిజ్యశాఖ సంచాలకులు జి.సృజన, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి టి.విజయకుమార్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి సుందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment